చలికాలం మొహం నుంచి కాలిగోరు వరకూ శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే తేమలేని
చలిగాలి మన రూపాన్ని కాకి రంగులోకి మారుస్తుంది. అయితే చాలా మంది మొహం,
చేతులు మీద పెట్టిన శ్రద్ధ పాదాలమీద పెట్టరు. మొహం నునుపుగా కనిపిస్తుంది.
కానీ పాదాలే పగిలి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. సో పాదాల పట్ల స్పెషల్ కేర్
అవసరమే. ఎలా అంటే.
- ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ ఏదైనా నూనెను తీసుకోవాలి. ఒక నిమిషం పాటు రెండు పాదాలకు నెమ్మదిగా మర్దనా చేయాలి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి. అలసిన పాదాలకు ఉపశమనం కలిగించడమే కాదు నునుపుగానూ అవుతాయి.
- గోరు నీటిలో చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అందులో పాదాలను పావుగంట సేపు నానబెట్టాలి. అనంతరం స్క్రబ్బర్ లేదా నునుపైన రాయితో పాదాలను మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న డెడ్‌స్కిన్ అంతా పోతుంది. పాదాలను ఇప్పుడు చల్లని నీటితో కడిగి మెత్తటి టవల్‌తో తుడవాలి. పొడిగా ఉన్న పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల పాదాలు అందంగా తయారయవుతాయి.
- కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి కొన్ని పాలు కలపాలి. వీటికి సరిపడా ఓట్స్ పౌడర్ తీసుకుని పాదాలకు మర్దనా చేయాలి. అర్ధగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలపై డెడ్‌స్కిన్ తొలగిపోయి మృదువుగా ఉంటాయి.
- ఒక బకెట్లో పావు భాగం వరకూ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్‌కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచాడు వంటసోడా వేసి ఒక అరగంటపాటు కాళ్లు అందులో ఉంచాలి.
- కాళ్లు పగిలి బాధపెడుతుంటే రోజ్‌వాటర్, గ్లిజరిన్ , నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ఓ గాజుపావూతలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ స్నానం చేయడానికి అర్ధగంట ముందు, లేదా పడుకునేముందు అపె్లై చేయాలి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
- బాగా పండిన బొప్పాయి గుజ్జుతీసుకుని దానికి కొంచెం నిమ్మరసం కలిపి కాళ్లకు మర్దన చేయడం వల్ల పగులు పోయి, పాదులు నునుపుగా మారతాయి.
- గోరు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లకు వెంట్రుకలు పెరగకపోవడమే కాదు, చర్మం మృదువుగా తయారవుతుంది.
- విటమిన్ ఇ నూనెలో కస్తూరి పసుపు పొడిని కలిపి మర్దనా చేయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. దీనివల్ల కాళ్లస్కిన్ బిగుతుగా తయారవ్వడమే కాక మంచి బ్లీచ్‌గా కూడా పనిచేస్తుంది.
- ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని దానికి ఒక చక్కెర కలపండి. మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పాదాలపై రాయండి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి.
- స్నానం చేసిన తరువాత ఆవ నూనెతో పాదాలు, చేతులను మర్దనా చేయండి. నీటితో కడిగేసి మెత్తటి టవల్‌తో తుడిచేయాలి. రోజంతా పొడిబారకుండా స్కిన్ తేమగా ఉంటుంది.
- సగం కప్పు పెరుగుకు అరచెంచా వెనిగర్ కలపండి. ఆ మిశ్రమాన్ని పాదాలు, వేళ్ల మధ్య మృదువుగా మర్దనా చేయాలి. ఐదు నిమిషాలాగి కడిగేయాలి.
చేతులు, పాదాలకు ప్యాక్
- సగం కప్పు - బొప్పాయి గుజ్జు
- సగం కప్పు - పైనాపిల్
- 4 టీ స్పూన్లు - తేనె
- ఒక కప్పు - ఓట్స్ పొడి
పై పదార్థాలన్నింటినీ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని
మోచేతులు, మోకాళ్లు, పాదాలు, వేళ్ల సందుల్లో మృదువుగా మర్దనా చేయాలి.
పూర్తిగా ఆరిన తరువాత కడిగేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.
0 Comments