Full Style

>

కళ్లెలో రక్తం పడుతుంటే?,Blood in the expectoration(sputum)

కళ్లెలో రక్తం పడుతుంటే?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




Cancer
కళ్లెలో రక్తం పడటానికి ప్రధాన కారణం గడ్డ కట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయాణించటం. ఊపిరితిత్తులకు Cancer‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గినప్పుడు కళ్లెపడుతూ రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. అయితే కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జ్వరం లేకుండా ఉండటం, దగ్గీ దగ్గీ ఉమ్మిలో నెత్తురు పడటం - ఇవి ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలు. కేన్సర్‌ తాలూకు గడ్డ ఊపిరితిత్తుల నిండా వ్యాపిస్తున్న కొద్దీ మీకు ఊపిరి అందక పోవడం, గాఢంగా శ్వాసను తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి ఉంటాయి.

అయితే ఇది 40యేళ్ల వయస్సు పైబడిన వారివిషయంలో.40యేళ్లలోపు వయస్సులో ఉండి, మిగతా విషయాలలో ఆరోగ్యంగా ఉండి, అంతకు మునుపు ఊపిరితిత్తుల మార్గంలో ప్రమాదకరం కాని పులిపిరులు ఉన్నవాళ్లయితే అది లంగ్‌ కేన్సర్‌ కాకపోయే అవకాశం ఉంది.

ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డ
మీరు స్త్రీలై ఉండి, 25-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి, గర్భనిరోధ మాత్ర లను వాడుతున్నవారైతే గాఢంగా శ్వాస పీల్చుకో బేయే సరికి మీకు అకస్మాత్తుగా ఛాతీ పక్క భాగంలో చురుక్కుమనే పోటు కలుగుతుంది. జ్వరం ఉండదు. ఒక కాలిపిక్క అప్పుడప్పుడూ నొప్పి చేస్తుంటుంది. ఉమిసినప్పుడు ఉమ్మి లేత ఎరుపు రంగులో ఉంటుంది.
రోజులు గడుస్తున్న కొద్దీ ఉమ్మి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంటుంది. అప్పుడ ప్పుడూ స్వల్పంగా ఊపిరి అందకపోవడం, గుండెదడ ఉంటాయి. ఒక కాలు వాచి, తాకితే నొప్పి పెడుతుంది. ఇవన్నీ మీకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండటానికి సూచనలు. ఈ గడ్డను పల్మొ నరీ ఎంబాలిజమ్‌ అంటారు.
మీరు మధ్య వయస్సులో ఉన్న మహిళ అను కుందాం. గర్భ నిరోధక మాత్రలను వాడుతూ ఉండరు. కాని, పైన చెప్పిన లక్షణాలు కనిపి స్తున్నాయనుకోండి. అప్పుడు ఒకసారి ఈ కింది అంశాలు ఆలోచించండి.
ఈమధ్య మీకు ఏదైనా ఆపరేషన్‌ అయిందా? సుస్తీ వలన చానాళ్లపాటు పడక మీద ఉన్నారా? ఈ మధ్య చాలా దూరం విమాన ప్రయాణం చేశారా? మీకు వెరికోస్‌ వీన్స్‌ సమస్య ఉండి, అవి నొప్పి చేస్తున్నాయా? ఇవన్నీ ప్రయాణ సందర్భంలో ఊపిరితిత్తులలో రక్తపు గడ్డను ఏర్పరిచే అంశాలు.

క్షయ
వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు టిబిగా సందేహించేవారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.
బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బలహీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. దీర్ఘకాలం పాటు యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ చేయించడం అవసరమవుతాయి.
ఈ రోగులు దగ్గినప్పుడు దుర్వాసనతో కూడిన కఫం పడుతుంది. కఫంలో నెత్తురు ఉండవచ్చు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్పుడు. టిబి రోగులు ఉండే నర్సింగ్‌ హోమ్‌ లలో పని చేసేవారికి కఫంలతోపాటు క్రమం తప్పకుండా రక్తం పడుతుంటే దానిని టిబిగా సందేహించవచ్చు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌
ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా లేదా వైరస్‌ వలన ఏ ఇన్‌ఫెక్షన్‌ సోకినా కఫంలో రక్తం కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసనాళ వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ సోకే క్రానిక్‌ బ్రాంకైటిస్‌. ఈ వ్యాధిలో కఫానికి రక్తం చారికలు కనిపిస్తాయి. లంగ్‌ కేన్సర్‌లో రక్తం కలగలిపి ఉంటుంది.

Post a Comment

0 Comments