Health foretellers, ఆరోగ్య శకునాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఆరోగ్యముగా ఉండడము ఎంత మహాభాగ్యమో అనారోగ్యము వస్తే కాని తెలియదు . ఎవరికి వారు ఆరోగ్యముగానే ఉన్నామని భావిస్తుంటారు . అనారొగ్య చిహ్నాలు కనిపిస్తున్నా వాటిని గుర్తించకుండా వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా నిత్యజీవితాన్ని గడిపేస్తుంటారు . వ్యాధి ముదిరేక గుర్తించి అప్పుడు చేసేదేమీ లేక చింతిస్తారు .
కొన్నిరకాల జబ్బులను చిన్న చిన్న లక్షణాలతోగుర్తించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లాంటి పెద్ద జబ్బుని ఒక చిన్న షేక్ హ్యాండ్ తోనే నిపుణుడైన వైద్యుడు గుర్తించేస్తాడు . ఉదా: ముంబై లో ఒక డాక్టర్ తన స్నేహితుడికి ఓ రెస్టారెంట్ లో కలిసి షేక్ హేండ్ ఇచ్చాడు .అతని అరచేయి " ప్లెష్షీ" (fleshy) గాఉండడము తో డాక్టర్ కి అనుమానము వచ్చి ... బ్రెయిం ట్యూమర్ వచ్చిన వారి చేతుల్లో టిష్యూ ఎక్కువగా పేరుకుపోతుందనే విషయము గుర్తుకువచ్చి బ్రెయిన్ ట్యూమర్ టెస్ట్ లు చేయించాడు . పరీక్షల్లో డాక్టర్ అనుమానము నిజమని ధృవపడింది. వెంటనే ఆపరేషన్ కి ఏర్పాటులు చేసి ట్యూమర్ తొలగించారు . ప్రాణాంతకమైన జబ్బులను కూడా తొలిదశలో కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించే అవకాశము ఉందనే నమ్మకము ఈ ఉదాహరణ తో మనకు బోదపడుతుంది. అటువంటి వాటిలో కొన్ని :->
వెన్నునొప్పి :
వెన్నునొప్పి కిడ్నీలో రాళ్ళకు సంకేతము కావచ్చు . తుంటి ఎముకలకు , పక్కటెముకలకు (హిప్ , రిబ్స్ ) మధ్య నొప్పి జివ్వున లాగేస్తుంటే ఒకసారి డాక్టర్ ని సంప్రదించాల్సిందే ... ఈ నొప్పి ఒక్కోసారి తీవ్రంగా ఉండి , ఒక్కోసారీ తెలిసీ తెలీనట్లు గా పోతుంది . దీనివల్ల చాలామంది ఈ నొప్పిని తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యము చేస్తుంటారు ... ఏవో బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వచ్చిన నొప్పిలే అని కొట్టిపడేస్తారు . .. కాని అది మూత్రాయం లో రాళ్ళకు సంబంచిన ముందస్తు హెచ్చరిక అని గుర్తుపట్టరు . ప్రతి 10 మంది మగవాళ్ళలో ఓకరికి మూత్రాశయములో రాళ్ళ అనారోగ్యము వస్తుంది . ఆ జబ్బును నివారించకపోతే మూత్రము సాఫీగా రాదు . దానివల్ల మూత్రాశయం వాపు వచ్చి క్రమేపీ నొప్పి తీవ్రమవుతుంది .
ఏమి చేయాలంటే :
నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తున్నా లేదా గుదంలోకి పాకుతున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరియైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి. వారానికి మూడు సార్లు 45 నిముషాల పాటు కార్డియో ఎక్స్ ర సైజ్ లు చేయడము ,రోజూరెండున్న లీటర్ల నీరు తాగడము లాంటివి చేయాలి. ఇందువల్ల మూత్రాశయం లో రాళ్ళు పెరగకుండా అరికట్టవచ్చును.
పాదాల్లో నొప్పి :
డిస్క్ జారడము వల్ల కావచ్చు " హెర్నియేటెడ్ " లేదా " ప్రోలాప్సెడ్ డిస్క్ వల్ల పాదాల్లో నొప్పి వస్తుంది . సామాన్యము గా నొప్పి ఉదయము పూట ఎక్కువగా ఉంటుంది .కూర్చోవడము వల్ల నొప్పి తీవ్రమవుతుంది . వెన్నునొప్పి లేకపోవడము వల్ల దీన్ని డిస్క్ సమస్యగా సామాన్యముగా డాక్టర్ లు గుర్తించలేకపోతారు. ఈ సమస్యను నివారించకపోతే సయాటిక్ నరం మీద ఒత్తిడి ఎక్కువై ఆ కాళు అంతా తిమ్మిరి గాను , నొప్పిగాను వచ్చే స్థితి సంభవిస్తుంది. ఏమి చేయాలంటే : పొత్తికడుపు మీద పడుకుని కోబ్రా ఆసనాలు ఓ పదిసార్లు మృదువుగా చేయాలి. పిరుదులను నేలకు ఆనించి వీపుని మాత్రము బాణం లా వంచి చేతులను నెమ్మదిగా చాపాలి. ఈ ఎక్సర్ సైజ్ లు చేయడము వలన ఒత్తిడి తగ్గి నొప్పి కూడా తగ్గుతుంది. దిస్క్ సమస్యని కూడా ఇలా ఎక్సర్ సైజులతో తగ్గిందుకోవచ్చు. ఫిజియో థెరపీకి వెళ్ళేవరకు ఈ ఎక్సర్ సైజులు అవసరాన్నిబట్టి గంటకు ఒకసారి చేసుకుంటూ నొప్పిని తగ్గించవచ్చును.
0 Comments