Full Style

>

బొగ్గు పొగతో లంగ్‌ క్యాన్సర్‌

బొగ్గులతో వంట చేయడం వల్ల వచ్చే పొగతో లంగ్‌ క్యాన్సర్‌ వృద్ధి చెందే ప్రమాదముందని చైనా అధ్యయనం చెబుతోంది. వంట చెరుకును బాగా తగ్గించాలని, ఇదొక హానికరమైన ఇంధనాల్లో ఒకటని అధ్యయనం ప్రత్యేకంగా సూచిస్తోంది. ప్రపంచంలో సగం జనాభా బొగ్గును, ఇతర ఘన ఇంధనాలను వంట కోసం ఉపయోగిస్తున్నారు. దీని వల్ల 'క్రానిక్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌', అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. లంగ్‌ క్యాన్సర్‌తో మరణించిన వారిని అంతర్జాతీయ పరిశోధకులు బృందం విశ్లేషించింది. ఇందులో ఇంట్లో వంట కోసం బొగ్గు వాడిన వారు, వాడని వారు ఉన్నారు.

వీరంతా చైనాలోని యునాన్‌ ప్రొవీన్స్‌లో నివసించేవారే. 1976 నుండి 1996 అంటే 20 ఏళ్లపాటు 37 వేల మందిని పరిశోధకులు అనుసరించారు. ఈ సమయంలో లంగ్‌క్యాన్సర్‌తో 2 వేల మంది చనిపోయారు. లంగ్‌ క్యాన్సర్‌కు కారణయమ్యే పొగాకు వినియోగాన్ని కూడా పరిశోధకులు పరిగణలోకి తీసుకున్నారు. ఇంట్లో వంట వల్ల వచ్చే పొగతో చాలా మందిలో లంగ్‌ క్యాన్సర్‌ను కనుగొన్నారు. వంట కోసం బొగ్గును వినియోగించిన 70 ఏళ్ల తర్వాత లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 18 నుంచి 20 శాతం ఉంటుంది. బొగ్గు పొగతో సంబంధం లేని వారిలో లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 0.5 శాతం ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ధూమపానం చేసేవారిలో లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 20 నుండి 26 శాతం ఉంటుంది. ఎంత సేపు బొగ్గును కాల్చడం వల్ల వచ్చేపొగతో ఉంటున్నారు అనే అంశంపైన లంగ్‌ క్యాన్సర్‌ మరణాలు ఆధారపడి ఉంటాయి. ఈ అధ్యయనం బిఎంజె.కాం లో ప్రచురితమైంది.

Post a Comment

0 Comments