నేటి యాంత్రిక జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం
పరిపాటిగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి శరీర జన్యువుల ఆధీనంలో
పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ ఎటువంటి మార్పునైనా తట్టుకునే శక్తిని కలిగి
ఉంటుంది. దీర్ఘకాలికంగా కొనసాగే ప్రతిచర్యలు రోగ నిరోధక వ్యవస్థను
బలహీనపరుస్తాయి. స్పాండిలైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ దుష్ప్రభావాలు
శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. హోమియో వైద్యంతో ఈ సమస్యను దూరం
చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను.
చిన్న పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆధునిక జీవన శైలిలో
జీవించేవారిలో కనిపించే స్పాండిలైటిస్ లేదా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్
దుష్ప్రభావాలు కేవలం వెన్నెముక పైనే కాకుండా శరీర ముఖ్య అవయవాలు చాలా
వాటిపై జరగడం కేవలం మానవ తప్పిదానికి నిదర్శనం. మరికొంతమందిలో ముఖ్య
అవయవాలపై దుష్ప్రభావాలు మొదలైన తర్వాత మూలాలను వెతకటం నిర్లక్ష్యానికి
నిదర్శనమనే చెప్పాలి.
వెన్నెముక సమస్యలు
మెడ, నడుములో జరిగే ప్రతి చర్యల కారణంగా వెన్నెముక అంతర్భాగాలు అరగటం,
తదుపరి చర్యలలో చిన్న చిన్న ఎముకలు ఉత్పత్తి కావటం తద్వారా పరిసర రక్త
నాళాలు, నరాలు, కండరాలపై ప్రభావం పడి రకరకాల లక్షణాలకు దారి తీయవచ్చును.
ముఖ్యంగా, మెడనొప్పి, తలనొప్పి, అకస్మాత్తుగా తల తిరగటం లేదా స్పృహ
కోల్పోవటం, కండరా నొప్పి, వాపు, చేతులలో తిమ్మిర్లు, మంటలు అనిపించటం,
నడుము నొప్పి, అరికాళ్లు తిమ్మిర్లు, మంటలు, సియాటిక అనగా విపరీతమైన
కాళ్లనొప్పి ఉండటం, కండరాలు బిగుసుకుపోవడం, డిస్క్ సమస్యలు, భంగిమలో మార్పు
రావటం, మొదలైనవి జరిగిన నష్టాన్ని బట్టి మారుతుంటాయి.
కంటి సమస్యలు
దీర్ఘకాలిక స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఏదో ఒక కంటి వాపు, నొప్పి, కాంతిని చూడలేకపోవటం, చూపు మందగించటం వంటివి జరగవచ్చును.
శక్తి కోల్పోవటం
దీర్ఘకాలిక నొప్పి, వాపులు కొనసాగడం లేదా వాటిని ఉత్పత్తి చేసే మూల కారణాలు
కొనసాగడం వల్ల జరిగే ప్రతి చర్యలకు శరీర శక్తి నిల్వలు ఒక దాని తర్వాత
వేరొకటి ఉపయోగింపబడుతుంది. తద్వారా నీరసం, నిస్పృహ, ఆందోళన, నిద్రలేమి
వంటివి ఏ ప్రేరేపకం లేకుండానే ఉంటాయి.
నరాల సమస్యలు
దీర్ఘకాలికంగా కొనసాగే ప్రతి చర్యల వల్ల నరాలపై ఒత్తిడి జరిగి పటుత్వం
కోల్పోవటం, మల మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవటం, లైంగిక సమస్యలు
తలెత్తడం, కాళ్లు బలహీనపడి నడకలో మార్పులు రావటం మొదలు కావచ్చు.
కిడ్నీ, లివర్ సమస్యలు
శరీరంలో విషపదార్థాలను తొలగించే ముఖ్య అవయవాలపై దీర్ఘకాలిక ఒత్తిడి పడటం
ముఖ్యంగా రకరకాల చికిత్సల ఫలితంగా వచ్చే మలిన పదార్థాలను శరీరం నుండి బయటకు
పంపించడంలో నిమగ్నమయ్యే లివర్, కిడ్నీలలో ప్రతి చర్యలు మొదలై వైఫల్యానికి
దారితీసే అవకాశం లేకపోలేదు.
ఊపిరితిత్తులు, గుండె సమస్యలు
స్పాండిలైటిస్‌తో బాధపడేవారిలో ఊపిరి తీసుకోవడం నియంత్రణబద్దంగా ఉంటుంది.
తద్వారా ఊపిరితిత్తుల పనితీరు తగ్గుముఖం పట్టి రకరకాల ఇన్‌ఫెక్షన్లకు
దారితీయవచ్చును. రక్తనాళాలలో దీర్ఘకాలిక స్పాండిలైటిస్ ప్రతి చర్యల కారణంగా
రక్త సరఫరాలో విఘ్నాలు ఏర్పడి గుండె సమస్యలకు దారితీయవచ్చును. ఒక్కోసారి
రక్తం గడ్డకట్టుకుని శరీరంలో మిగిలిన ప్రదేశాలు ముఖ్యంగా కాళ్లలో
రక్తసరఫరాకు విఘాతం ఏర్పడవచ్చును.
ఎముకల సమస్యలు
ప్రతి చర్యల ప్రభావం మిగిలిన ఎముకలపై పడి తద్వారా బలహీనపడటం జరగవచ్చును.
అలాగే ఎముకలు త్వరగా విరగటం ఆర్థరైటిస్ లక్షణాలు ప్రారంభం కావటం వంటివి
జరిగి కదలికను నియంత్రించవచ్చును.
నిర్ధారణ
రోగ లక్షణాలను బట్టి సమస్య మూలాన్ని కనుగొనుట చాలా సులభం. అయితే సమస్య
తీవ్రతను, జరగబోయే నష్టాన్ని అంచనా వేయటానికి ఎక్స్‌రే, సిటి, ఎంఆర్ఐ, బోన్
డెన్సిటీ పరీక్ష వంటివి అవసరం పడవచ్చును. అలాగే డాప్లర్ స్టడీ, ఇఎస్ఆర్,
సిబిపి, హెచ్‌బి శాతం, సిరమ్ కాల్షియం, హెచ్ఎల్ఎ బి-27, ఆర్ఎ ఫాక్టర్,
సిఆర్‌పి వంటివి రోగ నిరోధక వ్యవస్థపై ఉన్న భారాన్ని, పనితీరును
తెలియచేస్తాయి. అలాగే లక్షణాలను బట్టి లంగ్ ఇన్‌ఫెక్షన్ టెస్ట్, ఇసిజి,
యాన్జియోగ్రామ్, సిరమ్ యూరియా, క్రియాటినైన్ వంటివి సూచించెదరు.
హోమియో వైద్యం
శరీరంలో అనారోగ్యం వ్యాపించే విధానం అంటే నెమ్మదిగా లేదా అత్యంత త్వరగా
వృద్ధి చెందటం మొదలైన ముఖ్య సంకేతాలను బట్టి జన్యులోపాలను తద్వారా జీవరసాయన
అసమతుల్యతలను సరైన హోమియో మందుల ద్వారా పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది.
అయితే రోగి దినచర్య, మానసిక, శారీరక ఒత్తిడిలో చూపించే ప్రతిచర్యలు,
సాంఘిక సంబంధాలు మొదలగైనవి సరైన చికిత్సకు, తీసుకోవలసిన జాగ్రత్తలకు
ఉపయోగపడును. నాడి సంబంధ వ్యవస్థ ఆధారంగా జన్యువులపై పనిచేయు హోమియో మందుల
వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
0 Comments