Full Style

>

ఆరెళ్లు ఆయుష్షును పెంచే జీవనశైలి

జబ్బుల బారిన పడే ప్రమాదమున్న వారితో పోలిస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న వారు ఆరేళ్లు ఎక్కువగా జీవిస్తారని స్వీడిష్‌ అధ్యయనం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వృద్ధాప్యంలో స్త్రీలు5 ఏళ్లు , ఆరేళ్లు పురుషులు అదనంగా జీవిస్తారని అధ్యయనం కనుగొన్నది. అధిక బరువు, ధూమపానం, అధికంగా మద్యం సేవించడం వృద్ధులో మరణానికి దారిస్తాయి. 75 ఏళ్లుపైబడిన వారికి ఇవి వర్తిస్తాయా? లేదా? అనేది తెలియదు.
దీని కోసం స్వీడన్‌కు చెందిన పరిశోధకుల బృందం 75 ఏళ్ల వయసున్న వారిని, జీవనశైలి వ్యాధులన్న వారిని విశ్లేషించారు. 1800 మందిని 18 ఏళ్లపాటు (1987-2005) పరిశోధకులు అనుసరించారు. వయసు, లింగం, వృత్తి, విద్య, జీవనశైలి ప్రవర్తనలు, సామాజిక సంబంధాలు, తీరిక వేళల్లో చేసే పనులను నమోదు చేశారు. 
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది మరణించారు. సగం మంది 90 ఏళ్లకుపైగా జీవించి, మరణించారు. వీరిలో బతికిన వారు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అంతేకాక విద్యాధికులు కూడా. వీరు ఆరోగ్యకరమైన జీవనశైలితో ఉన్నారు. సామాజిక సంబంధాలు ఎక్కువ. తీరిక వేళల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ధూమపానం చేసే వారు, చేయని వారి కన్నా ఒక సంవత్సరం ముందుగానే చనిపోయారు. మధ్య వయసులో సిగరెట్‌ తాగడం ఆపేస్తే, దాని ప్రభావం మరణంపై పడుతుందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. మధ్యలో సిగరెట్‌ మానేసిన వారు కూడా ఎప్పుడు సిగరెట్‌ తాగని వారిలాగే ఎక్కువ కాలం జీవించారు. తీరిక వేళల్లో చేసే పనుల్లో శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రెగ్యులర్‌గా ఈత కొట్టడం, నడవడం లేదా జిమ్నాస్టిక్స్‌ వంటి చర్యల వల్ల మిగతా వారి కంటే రెండేళ్లు ఎక్కువ జీవించారు. మొత్తంగా చూస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న వారు మిగతా వారి కన్నా 5.4 ఏళ్లు ఎక్కువ కాలం బతుకుతారు.

Post a Comment

0 Comments