Full Style

>

టాయ్ లెట్‌ కన్నా సెల్‌ఫోనే మురికి

వాస్తవానికి టాయ్ లెట్‌ సీట్ల కన్నా మొబైల్‌ ఫోన్లే మురికిగా ఉంటాయి. ఎందుకంటే, ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడటం, ఇతరులు తీసుకుని మాట్లాడినా దాన్ని ఎప్పుడూ శుభ్రపరచరు. దీంతో ఫోన్లపై క్రిములు ముసురుకుంటాయి. వాంతులవడం, కడుపులో వికారంగా ఉండటం వంటి సమస్యలు పది రెట్లు పెంచే ఈ క్రిములు టారులెట్‌ సీట్ల కన్నా మొబైల్‌ ఫోన్లపై తిష్టవేస్తాయని పరీక్షల్లో వెల్లడైంది. ఫోను మన చేతులు, నోటికి దగ్గరా ఉంటాయి కాబట్టి క్రిములు వీటిపై జీవిస్తాయని అరిజొన విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజి ప్రొఫెసర్‌ చార్లెస్‌ గెర్బ నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. మొబైల్‌ ఫోన్లు ఎలక్ట్రానిక్‌ వస్తువులు కదా అని వీటిని శుభ్రపరచాలనే ఆలోచన రాదు.
ఇవి శరీరంలో భాగం కావు, అందుకే వీటిని శుభ్రపరచడం లేదన్నారు. యాంటి బ్యాక్టీరియల్‌ పదార్థంతో వీటిని శుభ్రపరచాలని సూచిస్తున్నారు. మొబైల్‌ ఫోన్లే కాక డబ్బులు లెక్కపెట్టే మిషన్లపై కూడా బ్యాక్టీరియా ప్రజాతి, కర్ర ఆకారంలో ఉండే సూక్ష్మజీవులు (బాసిల్లస్‌), సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవీ పబ్లిక్‌ టారులెట్‌లపై కూడా ఉంటాయి. వీటి వల్ల అస్వస్థత, అతిసార వంటి జబ్బులు వస్తాయి. మలవిసర్జన చేసే సీటు కన్నా కంప్యూటర్‌ కీబోర్డులే ఐదు రెట్లు మురికిగా ఉంటాయి.

Post a Comment

0 Comments