శరీర భాగాలపై పెరిగే వెంట్రుకలు, స్త్రీలకే కాదు పురుషులకు కూడా అసహ్యం
కలిగిస్తాయి. వాటిని తీసివేయడానికి మరల పెరగకుండా వుండాలని భావిస్తారు.
కాని అనుకున్నంత మాత్రాన వాటి ఎదుగుదల ఆగదు. నేడు వాటిని ఏదో ఒకరకంగా
తీసివేస్తే, మరల షుమారు పది లేదా 15 రోజులకే వెంట్రుకలు ఆయా భాగాలలో
ఎదుగుతూంటాయి. మరి ఎంతో నిరుత్సాహం కలిగించే ఈ వెంట్రుకల ఎదుగుదల అరికట్టటం
ఎలా?
మేము సూచించే పద్ధతులన్ని మీ శరీర వెంట్రుకల ఎదుగుదలను తక్కువ చేస్తాయి. మీ
సెలూన్ ట్రిప్పులను తగ్గిస్తాయి. మరి అవేమిటో పరిశీలించండి.
శరీర వెంట్రుకల ఎదుగుదల నిదానించేందుకు మార్గాలు
1. షేవ్ చేయటం ఆపండి - ముందుగా మీ శరీర వెంట్రుకలను తీయటానికి రేజర్
ఉపయోగించకండి. రేజర్ ఉపయోగిస్తే, మరింత వేగంగా పెరిగిపోతాయి. రెండు లేదా
మూడు సార్లు రేజర్ తో షేవ్ చేస్తే చాలు మీరొక ఎలుగుబంటి అయిపోతారు. ఒక సారి
ఈ పరిస్ధితి వస్తే, ఇక మీరు ఎపుడూ రేజర్ వేసి చేయాల్సిందే. కనుక రేజర్
ఉపయోగించకండి.
2. ట్వీజర్లు వాడండి - ట్వీజర్ తో ప్రతి వెంట్రుక కత్తిరించటం చాలా
కష్టం. కాని ట్వీజర్ వెంట్రుకను కుదుళ్ళతో సహా పీకేస్తుంది. 4 నుండి 6
వారాల వరకు మరల వెంట్రుక రాకుండా చేస్తుంది. ఫేషియల్ వెంట్రుకలకు బాగా
పనిచేసినప్పటికి ఛాతీ భాగాల వెంట్రుకలకు ఇది సరికాకపోవచ్చు.
3. వ్యాక్సింగ్ - వ్యాక్స్ చేయటం వెంట్రుకల ఎదుగుదల పూర్తిగా ఆపలేదు
కాని కొంత కాలం చేస్తే వాటి ఎదుగుదల ఆపగలదు. వెంట్రుకలు బాగా ఏర్పడిన
తర్వాత వ్యాక్సింగ్ సూచించదగినది. వెంట్రుకలన్నీ ఒకే సారి ఊడి వస్తాయి.
4. సోయా తినండి - శరీరంపై వెంట్రుకలు టెస్టోస్టిరోన్ అనే పురుష
హార్మోన్ అధికం అవటం వల్ల వస్తాయి. ఈ హార్మోన్ మహిళలలో కూడా కొద్దిపాటిగా
వుంటుంది. అందుకనే మహిళలకు సైతం ఛాతీ వంటి భాగాల్లో వెంట్రుకలు వస్తాయి.
సోయా ఉత్పత్తి మీలోని అంటే మహిళలోని ఈస్ట్రోజన్ పెంచుతుంది పురుష హార్మోన్
ను అణచి వేస్తుంది. సోయా బీన్, పాలు, ఇతరసోయా ఉత్పత్తులు తినటం ఈ అంశంలో
బాగా సహకరిస్తుంది.
5. కండలు నిర్మించండి - మహిళలకు సోయా వలెనే పురుషులు తమ కండలను
నిర్మించుకొని శరీర భాగ వెంట్రుకలను నిర్మూలించవచ్చు. పొట్ట వ్యాయామాలు
శరీర కండలు వీటిని సహజంగా అరికడతాయి. కండలు నిర్మిస్తే, చర్మం సాగుతుంది
అది వెంట్రుకల దట్టాన్ని అరికడతాయి.
6. వెంట్రుకల ఎదుగుదలను అరికట్టే లోషన్లు - కాస్మెటిక్ లేదా
ఫార్మస్యూటికల్ కంపెనీలు శరీర వెంట్రుకలను నిలుపు చేయటానికి ఎన్నో లోషన్లను
తయారు చేస్తున్నాయి. ఈ లోషన్లు ప్రధానంగా సోయా పదార్ధాలు కలిగి వుంటాయి.
వీటిని కొనేటపుడు ప్యాక్ పై మీ శరీరానికిఅలర్జీ కలిగించే పదార్ధాలు అందులో
ఏవైనా వున్నాయా అనేది పరిశీలించండి.
పైన చెప్పిన ఈ పద్ధతులు, శరీరంపై వెంట్రుకల ఎదుగుదలను తగ్గిస్తాయి. కాని
పూర్తిగా తొలగించలేవు. మరి మీకు పూర్తిగా తొలగిపోవాలంటే, ఖరీదైన శాశ్వత
ఎలక్ట్రోలిసిస్ లేదా లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకొని శరీర వెంట్రుకల
ఎదుగుదల అరికట్టవచ్చు.
0 Comments