ఈ మొక్కను మీరంతా చూసే ఉంటారు.
ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుని కొంత సమయం తరువాత వాటంతట అవే మళ్ళి
విచ్చుకుంటాయి. వర్షా కాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ
మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళు లేని మొక్క, ముడ్లు ఉన్న మొక్క అనే
రెండు రకాలు ఉంటాయి. ముడ్లున్న అత్తా పత్తి భూమి నుండి జానెడు మొదలు మూరడు
వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మకుల్లగా చిన్నగా ఉంటాయి.
కొమ్మలకు
ముళ్ళుంటాయి. పూలు ఎరుపు కలిసిన ఉదారంగులో ఉంటాయి. ముడ్లు లేని అట్టి
పత్తి నేలపై పరచుకుని ఉంటుంది, ఇది కూడా నీరున్న ప్రాంతాలలో పెరుగుతూనే
ఉంటుంది. నెల పైన రెండు ముడు గజాల దాకా పాకుతుంది. దీనికి పసుపు రంగు
పూలు ఉంటాయి, సన్నటి కాయలు ఉంటాయి, కాయల్లో గింజలు లక్క రంగులో ఉంటాయి.
అత్తిపత్తి కి అనేక పేర్లు
సంస్కృతంలో లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో
తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని,
లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని
అంటారు.
అత్తిపత్తి-గుణ గణాలు
ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ది చేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని
సాఫీగా జారీచేస్తుంది, ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది, పాత
వ్రణాలనుమాన్పుతుంది, మేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను,
పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి
నొప్పిని, ఉబ్బరోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.
వీర్య హినతకు – బ్రహ్మాస్త్రం
అత్తిపత్తి గింజలు, చింతగింజల పప్పు, నీరుగోబ్బి గింజలు సమంగా తీసుకుని
మర్రి పాలలో ఒక రాత్రి నానా పెట్టి తరువాత గాలికి అరపెట్టి మెత్తగా నూరి
శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. రెండు పుటలా
ముడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటు అవు పాలు కండ చెక్కర కలిపి
తాగాలి.
నలబై రోజుల్ ముత్రములో వీర్యము పోవడం, శిఘ్రస్తలనం, నపుంసకత్వం, అన్గాబలహింత హరించి ధాతుపుస్టి కలుగుతుంది.
ఆహార నియమాలు: వేడి, పులుపు, కారం పదార్దాలు నిషేదించి భ్రహ్మచర్యం పాటించాలి.
ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు
ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయటం వల్ల గాని, లేక సెగ
రోగామున్న వారితో సంబోగం జరపడం వల్ల గాని, ఈ సుఖ రోగం కలుగుతుంది.
ఆ సమస్యకు అత్తిపత్తిఆకు, మంచిగందం పొడి, సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో
మెత్తగా నూరి మాత్రలు కత్తి నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ ఉంచుకోవాలి.
రోజు రెండు పుటలా పుటకు ఒక మాత్ర మంచి నీటితో వేసుకుంటుంటే సెగ తగ్గటమే
కాక విర్య వృద్ది కలుగుతుంది.
నారికురుపులు నశించుటకు
అత్తిపత్తి ఆకులూ మెత్తగా నూరి నారి కురుపులుపై వేసి కట్టుకడుతూ ఉంటె అవి నశించి పోతాయి.
ఆహార నియమాలు: గొంగోర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
ఆగిన బహిష్టు-మరలా వచ్చుటకు
అత్తిపత్తి ఆకు పొడి ఒక బాగము, పటిక బెల్లం పొడి రెండు బాగాలు కలిపి పుటకు
అర చెంచ పొడి మంచి నీటితో సేవిస్తూ ఆగిన బహిష్టు మరల వస్తుంది, రాగానే
చూర్ణం వాడటం ఆపాలి.
ఆహార నియమాలు: బెల్ల నువ్వులు, గంజి, తీపి పదార్ధాలు వాడాలి.
వీర్య స్తంభనకు
అత్తిపత్తి వేర్లను మేక పాలతో గాని, గొర్రె పాలతో గాని, గంధంలా నూరి ఆ
గంధాన్ని ఫురుషులు తమ అరికాళ్ళకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే
చాలాసేపటి వరకు విర్యపతనం కాదు.
బోదకాలి మంట, పోటుకు
అత్తిపట్టిఆకు 5గ్రా., మిరియాలు 9 ఒక కప్పు నీటితో మెత్తగా నూరి బట్టలో
వడపోసి పరగడుపున 40 రోజుల పాటు సేవించాలి, దీనితో పాటు... అత్తిపత్తి ఆకును
ముద్దగా నూరి బోధకాలిపై పట్టులాగా వేసి కట్టు కడుతూ ఉంటె మాట, పోటు,బాద
తగ్గిపోతాయి.
ఆహార నియమాలు: మాంసం, చేపలు, నంజుపధర్ధాలు నిషేధం.
స్త్రీల యోని బిగువకు
అత్తిపత్తి ఆకు తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటె యోని బిగువగా మారుతుంది.
ఆహార నియమాలు: తీపి పదార్ధాలు సేవించాలి.
స్త్రీల స్తనాల బిగువుకు
అత్తిపత్తి సమూలఛుర్నం, అస్వగంద దుంపల చూర్ణం సామగా కలిపి వుంచుకుని రాత్రి
పుట తగినంత పొడిని నీటితో నూరి స్తనలపై పట్టించి ఉదయం కడుగుతూ ఉంటె జారిన
స్తనాలు బిగువుగా మారతాయి.
ఆహార నియమాలు: పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
చల్ది, మశూచికములకు
అత్తిపత్తి ఆకు 30గ్రా.. మిరియాలు 2 గ్రా.. ఈ రెంటిని మెత్తగా నూరి ఒక
గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువ చేసుకోవాలి.
రెండు పుటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ చెల్దికురుపులు
మసూచికంగండమాల హరించి పోతాయి.
ఆహార నియమాలు: చేపలు, మాంసం, వేడి పదార్ధాలు నిషేధం.
నీళ్ళవిరేచనాలు-రక్తమొలలు
అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రా పంచదార ఒక చెంచా కలిపి రెండు పుటల సేవిస్తుంటే అతిసారా విరేచనాలు, రక్త మొలలు హరించి పోతాయి:
ఆహారనియమాలు: విరేచనకర పదార్ధాలు నిషేధం.
సిగ్గు విడచిన – స్త్రీ పురుషులకు
సూర్య గ్రహణము లేక చంద్రగ్రహనము రోజున అత్తిపత్తి ధూపదీప నైవేద్యలతో
పూజించి వేరు తెచ్చి కడిగి ఆరపెట్టి దాన్ని రాగి తాయేత్తులోపెట్టి మొలకు
గాని చేతికి గాని కట్టిఉంచితే అంతకుముందువరకు సిగ్గు లేకుండా బరితెగించి
ప్రవర్తిచే స్త్రీ పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గు
పడతారు.
అతిముత్రమునకు-అత్తిపత్తి
పచ్చని పూలు పుసే అత్తిపత్తి చెట్టు కాడలను, తాటి కలకండను సమంగా కలిపి
మెత్తగ్గా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా అరపెట్టి
రెండు పుటలా మర్రి చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటె అతి మూత్రం
హరిస్తుంది.
వ్రణాలకు-అత్తపత్తి
అత్తపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులుపైన,
పుడ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటె క్రమంగా వ్రణాలు మాడిపోతాయి.
అత్తపత్తితో-అద్బుత కాటుక
అత్తపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో 4 కేజీల
నీళ్ళుపోసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కాషాయం
మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో ఒక కేజీ నువ్వుల నునే పోసి తైలం
మిగిలే వరకు మళ్ళి మరగ బెట్టాలి.
0 Comments