తలనొప్పి, నడుము నొప్పిలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా విపరీతంగా
పెరిగిపోతోంది. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం
ఉంది. అందుకు వైద్యులు చెప్పిన కొన్ని సలహాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ
కిడ్నీ స్టోన్స్ అనేవి వంశపారంపర్యంగా రావచ్చు, మూత్ర నాళాలు బంధించబడితే
ఏర్పడొచ్చు, పారా థైరాయిడ్ అనబడే గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఏర్పడొచ్చు,
అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఏర్పడొచ్చు.
నడుము నొప్పిగా ప్రారంభమై, అది ముందు భాగంలోని పొట్ట దగ్గరికి వ్యాపించినా,
పొత్తి కడుపులో నొప్పి కలిగినా, తొడలు అలాగే ఇతర అంతర్గత అంగాలకి
వ్యాపించినా,జ్వరం, మూత్రంలో రక్తం పడడం మొదలైన లక్షణాలు కనిపించినా అది
కిడ్నీ స్టోన్స్ ఏర్పడడం వల్ల కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఆ రాయి
కొద్దికొద్దిగా పెరిగి దుప్పి కొమ్ములాగా తయారవుతుంది.
5 మిల్లీమీటర్ల కన్నా చిన్న రాయి అయితే, మూత్రం ద్వారా బయటికి
వచ్చేస్తుంది. 8 మిల్లీమీటర్లు ఉంటే 80 శాతం బయటికి వచ్చే అవకాశం ఉంది. 1
సెంటీమీటర్ ఉంటే చాలా శ్రమతో కూడుకున్న పని. సరైన సమయంలో చికిత్స
తీసుకోకపోతే మూత్రాశయం మూత్రాన్ని జారీ కానివ్వలేదు. పని చెయ్యదు కూడా.
0 Comments