నల్ల ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో
తేలింది. నల్లద్రాక్షలను రోజూ తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్
పెట్టవచ్చునని ఇజ్రాయేల్, హైఫా రంబం మెడికల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో
తేలింది.
నల్లద్రాక్షలోని యాంటియాక్సిడెంట్లు గుండెపోటు, హృద్రోగ వ్యాధులు, సమస్యలను
ఏమాత్రం దరిచేర్చవని హైఫా రంబం మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ మైఖేల్ అవిరామ్
చెప్పారు.
నల్లద్రాక్షలో ఉన్న యాంటియాక్సిడెంట్లు గుండెను పదిలంగా ఉంచేందుకు
తోడ్పడుతుందని డైలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. రోజూ అరకప్పు ఎండు
ద్రాక్షను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని హైఫా సెంటర్
తెలిపింది.
0 Comments