Full Style

>

అధిక బరువును తగ్గించుకోడానికి రోజూ యోగ చేయాలి

అధిక బరువు, ఒత్తిడితో భాదపడేవారికి యోగా బాగా సహాయపడుతుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతత కలిగించేది యోగా ఒక్కటే. వ్యాయామం కంటే యోగా ఎన్నో రెట్లు మంచిది.
  • అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి యోగా చాలా మంచిది. ప్రతిరోజు యోగా చేస్తే క్యాలరీలు వేగంగా తగ్గుతాయి. ఎరోబిక్ ఎక్సర్‌సైజులు చేసిన దానితో సమానం. ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి రకరకాల యోగా భంగిమలు సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.
  • పొట్ట కండరాలు బలపడడానికి యోగా బాగా ఉపకరిస్తుంది. పొట్టభాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా కావాలనుకునే వారు యోగా చేయాల్సిందే.
  • ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర సిస్టమ్ మొత్తం చురుకుగా మారుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్తేజపరుస్తాయి. ఈ హార్మోన్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.
  • రోగనిరోధక వ్యవస్థ బలహీనపడితే అలర్జీలు విజృంభిస్తాయి. ఇటువంటి సమయంలో యోగా చేస్తే అలర్జీలపై పోరాడే శక్తి శరీరానికి చేకూరుస్తుంది.
  • డిప్రెషన్, ఒత్తిడి ప్రభావం శృంగార జీవితం పై ఉంటుంది. శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను యోగా అందిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు మనసుకు కావలసిన రిలాక్సేషన్‌ను అందిస్తాయి.

Post a Comment

0 Comments