Full Style

>

మంచినీళ్ళు సరిపడా తాగండంతే

మంచినీళ్లను అమృతంతో పోలుస్తారు వైద్యులు. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత ఆరోగ్యమని చెబుతారు. ఆరోగ్యం నుంచి సౌందర్యం వరకూ అన్నింటిలోనూ నీరు ప్రధాన ప్రాత్ర పోషిస్తుందని చెవులువాచేలా బోధిస్తారు. కాని అవసరం కంటే ఎక్కువ నీరు తాగడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని చెబుతున్నారు ఇంటర్నేషనల్ మారథన్ మెడికల్ డైరెక్టర్ ఆసోసియేషన్‌వారు. మీ శరీరానికి అవసరమయ్యే నీటికంటే ఎక్కువ తాగితే కిడ్నీలపై అధిక భారం పడుతుందంటున్నారు.

అలాగే శరీరంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల కణాలు ఉబ్బే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మెదడు భాగంలోని కణాలు ఉబ్బితే ఏకంగా కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమంటున్నారు. మారథన్ పోటీల్లో పాల్గొనేవారు, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడేవారిలో 1600 మందిపై పరిశోధన చేసి తేల్చిన విషయమేమిటంటే మాటిమాటికీ నీరు తాగడం వల్ల వారిలో చాలా సమస్యలు తలెత్తాయని. 'నీరంటే మంచినీరొక్కటే కాదు...కోలాలు, రకరకాల పండ్ల రసాలు ఎక్కువగా తాగేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు తాగడంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. దాహం వేసినపుడు మాత్రమే నీరు తాగితే సరిపోతుంది. అదే పనిగా నీళ్లు తాగడం మంచిది కాదు' అని చెబుతున్న ఈ సంస్థ ఏ మనిషి ఎంత నీరు తాగాలో కూడా వివరించింది. వంద కిలోల బరువున్న మనిషి రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే సరిపోతుందట.

Post a Comment

0 Comments