వెన్నునొప్పి అంటేనే భయం....భయం...వంగాలన్నా, కదలాలన్నా, ఏ కాస్త
బరువెత్తాలన్నా భయం. నిజానికి దీర్ఘకాలం కొనసాగితే, ఈ నొప్పి, బతుకు
దెరువుకే ఎసరు పెడుతుంది. ఇది శస్త్ర చికిత్సతో తొలగిపోయే సమస్య కాదు.
ఆధునిక హోమియో చికిత్సలు మాత్రం ఈ సమస్యను తొలగించడంలో ఎంతో సమర్థవంతంగా
పనిచేస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కాదు, హోమియోతో వెన్నునొప్పి శాశ్వతంగా
తొలగిపోతుందంటున్నారు, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాశి.
వెన్ను నొప్పిపేరెత్తితే చాలు చాలా మందికి వెన్నులో వణుకు మొదలవుతుంది.
నిజానికి మన దేశంలో శరీర శ్రమ ఆధారంగా జీవించే వారే ఎక్యువ. అయితే, ఈ
వెన్నునొప్పితో వారందరి బతుకు దెరువు దెబ్బ తింటోంది. అయితే వెన్ను నొప్పి
విషయంలో పాతుకు పోయిన అపోహలు కూడా ఎక్కువే. చాలా మంది స్త్రీలు గతంలో తమకు
అనస్తీషియా ఇంజెక్షన్ చేయడం వల్లే ఈ వెన్నునొప్పి వచ్చింది అనుకుంటారు.
వెన్నునొప్పి రావడానికి అదీ ఒక కారణమే అయినా, అందరికీ ఆ ఒక్కటే కాదు, అనేక
కారణాలు ఉంటాయి. వెన్నునొప్పి బాగా ముదిరితే గానీ, ఏ వైద్య చికిత్సలూ
పనిచేయవనే అపోహ కొందరిలో ఉంది.
నిజానికి వెన్నునొప్పి ప్రారంభంలో చికిత్స తీసుకున్నప్పుడే ఎక్కువ ప్రయోజనం
ఉంటుంది. కాళ్లూ, చేతులు, వేళ్లల్లో నొప్పి ఉంటే, వెన్నునొప్పికి వాటితో
సంబంధం లేదనుకుంటారు. కానీ, ఇవన్నీ వెన్నునొప్పిని తెలిపే లక్షణాలే.
దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి, కాళ్లు, చేతులకు కూడా పాకుతుంది.
ఆ భాగాలు మొద్దుబారినట్టు ఉంటాయి. కొందరి కాళ్లూ చేతుల్లో మంటలు కూడా
వస్తాయి.
నడుము భాగంలో గానీ, వెన్ను భాగంలో గానీ, నొప్పి మొదలై అది క్రమంగా కాళ్లూ
చేతులకు పాకిందీ అంటే ఇక వెన్నులో సునామీ మొదలయ్యిందనే అర్థం. మోకాలు,
తుంటి, భుజంలోని కీళ్లు అరిగినట్లే, వెన్నులోని ఫేసెంట్ జాయింట్స్,
డిస్కులు అరిగిపోవచ్చు. అందుకే ఎవరైనా వెన్ను భాగంలోని ఈ సమస్యలను
గుర్తించకపోతే, ఆ తరువాత చాలా తీవ్రస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంది.
వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం తెలియకుండానే ఎవరైనా శస్త్ర చికిత్స
చేయించుకుంటే సమస్య తగ్గకపోగా ఎన్నో తీవ్రమైన దుష్ప్రభావాలకు గురికావలసి
రావచ్చు.
ఇవీ కారణాలు
సాధారణంగా డిస్కులల్లో రెండు రకాల సమస్యలు ఉంటాయి. వాటిలో ఒకటి డిస్కు
ప్రొలాప్స్. రెండవది డిస్కు డీజరనేటివ్ డిసీస్. ఏ కారణంగానైనా, డిస్కు బయట
ఉన్న పొర బలహీనపడినప్పుడు, డిస్కు వెనక్కి జరిగి కాళ్లలోకి వచ్చే నరాలపై
ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడిన భాగాల్లో తిమ్మిర్లు, కాళ్లు
మొద్దుబారడం, మంటలు స్పర్శ తగ్గడం, నిలుచుంటే తూలినట్లు అనిపించడ, వంగడం,
లేవడం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలా కావడాన్ని స్లిప్ డిస్క్ సమస్య అంటారు. కొన్ని సార్లు యానులస్ అనే పొర
చిట్టిపోయి, డిస్కులోని గుజ్జులాంటి పదార్థం బయటికి వచ్చేస్తుంది. ఇలా
కావడాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ సమయంలో కాలును వంచకుండా పైకి
ఎత్తాలి. ఆ సమయంలో కాల్లో నొప్పి పెరిగితే అది డిస్క్ ప్రొలాప్స్ సమస్యేనని
ఒక నిర్ధారణకు రావచ్చు. ఈ సమస్యను 90 శాతం మందిలో హోమియో చికిత్సలతో
తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
కొంత మందిలో వెన్ను భాగంలో టిబి (క్షయ) రావడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఈ
సమస్యను ట్యూబర్‌కులోసిస్ స్పాండిలైటిస్ అంటారు. సాధారణంగా ఈ రోగుల్లో
వెన్నునొప్పితో పాటు, జ్వరం, బరువు తగ్గడం, పక్షవాత లక్షణాలు కనిపిస్తాయి.
తొలిదశలోనే ఈ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోకపోతే, వెన్నెముక
దెబ్బతినిపోతుంది. ఫలితంగా వెన్నుపాము మీద ఒత్తిడి పడి కాళ్లూ, చేతులూ
పడిపోవచ్చు. ఈ స్థితినే పేరాప్లేజియా అంటారు.
నిర్లక్ష్యం ఎంతో ప్రమాదం
మెడ నుంచి నొప్పి చేతుల్లోకి పాకడం, వేళ్లల్లో తిమ్మిరి, తల తిరగడం, మెడ
పట్టేసినట్లుగా ఉండడంతో పాటు, నడుమునొప్పి, చేతుల్లోకి, కాళ్లలోకి పాకినా,
తిమ్మిరెక్కినా, వెంటనే వెన్ను సమస్యలని గుర్తించాలి. చేతులు, కాళ్లలో
తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్లు ఉండడం, నొప్పితో పాటు జ్వరం, ఆకలి
తగ్గడం, బరువు తగ్గడం, కాళ్లూ, చేతుల కండరాలు పటుత్వం కోల్పోవడం, మల
మూత్రాల మీద అదుపు తగ్గడం, నడకలో మార్పు రావడం వంటి లక్షణాలు
కనిపించినప్పుడు తక్షణమే వైద్యణ్ని సంప్రదించాలి.
హోమియో చికిత్సలు
శస్త్ర చికిత్స అవసరం లేకుండా కేవలం హోమియో చికిత్సలతోనే వెన్నునొప్పి
సమస్యను తొలగపోతాయి. వెన్నునొప్పి రావడానికి గల మూల కారణాల్ని గుర్తించి
చికిత్స చేస్తే, క చ్చితంగా ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. శస్త్ర
చికిత్సతో తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే కాని, దాని వల్ల నొప్పి రావడానికి
గల మూలకారణాలు మాత్రం తొలగిపోవు. అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుడు నొప్పి
రావడానికి గల ఆ మూల కారణాల్ని తొలగించడమే కాదు, వెన్నెముక శక్తివంతమై, అది
జీవితానికి వెన్నుదన్నుగా నిలిచేలా సంపూర్ణ చికిత్సలు అందిస్తారు.
0 Comments