ఓట్స్! ఇప్పుడు ఎక్కడవిన్నా ఇదే మాట! ఆరోగ్యంపట్ల శ్రద్ధ, స్థూలకాయాన్ని
తగ్గించుకోవాలనే తాపత్రయం నేడు ఓట్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతను
సంతరింపజేసింది. ఓట్స్ తినడానికి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ
సౌకర్యం ఉండటంకూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. ఓట్స్‌ను పాలలో,
మజ్జిగలోనూ తినొచ్చు. బెల్లం కలిపి పాయసంలా, కాదంటే పళ్ల ముక్కలు, కూరగాయల
ముక్కలు, నట్స్‌తో సలాడ్‌లా తినొచ్చు. ఇవికాక ఇప్పుడు ఉప్మా, ఇడ్లీ,
స్వీటు, హాటు... ఇలా అన్నిటా ఓట్స్‌దే హవాగా ఉంది. మరి ఇంతగా ఆదరణకు
నోచుకున్న ఓట్స్‌లోని సద్గుణాలేంటో ఓసారి తరచిచూద్దాం.
- ఇందులోని బీటా గ్లూకోన్ రక్తంలో షుగర్ శాతాన్ని పెరగనివ్వదు. ఇన్సులిన్ హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తుంది.
- కేన్సర్ కారకాలను నిరోధిస్తాయని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి.
- ఇవి రక్తపోటును దరికి రానీయకుండా చేస్తాయి.
- ఓట్స్‌లో అనవసరపు కేలరీలు లేవు.
- వీటిలో కొవ్వు అసలే ఉండదు. కొలెస్ట్రాల్ పెరగనివ్వదు.
- ఓట్స్‌లో మెగ్నీషియం, కేల్షియం, విటమిన్ ఇ, జింక్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలెన్నో కొలువుతీరి వున్నాయి.
- ఓట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే మరింత కేల్షియం, ప్రోటీన్‌లను మేళవించినట్లే!
- ఓట్స్ కడుపు నిండిన అనుభూతినిస్తాయి. దరిమిలా తక్కువ తినగానే కడుపునిండిపోతుంది. ఆపై మెల్లగా జీర్ణమవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఆరోగ్యకరమైన మార్గం.
- ఇందులోని సాల్యుబుల్ ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది.
100 గ్రా ఓట్స్‌లో...
- శక్తి 387 కిలో కేలరీలు
- ప్రోటీన్లు 15.2 గ్రా
- కొవ్వు 8.6 గ్రా
- శాచ్యురేటెడ్ కొవ్వు 1.7 గ్రా
- కొలెస్ట్రాన్ 0
- కార్బొహైడ్రేట్స్ 62.2 గ్రా
- ఫైబర్ 10.5 గ్రరా.
- ఐరన్ 4.4 మిగ్రా.
0 Comments