మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో
సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి
ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి
వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు
శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం
వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది
ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్,
ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.
కారణాలు
- గాయాలు, కండరాలుపై ఎక్కువ ఒత్తిడి ఉదాహరణకు వ్యాయామం, శారీరక శ్రమ అధికంగా ఉండటం.
- శరీరంలో పొటాషియం, కాల్షియం మోతాదు తగ్గడం.
- ఏసీఈ ఇన్‌హిబిటర్స్, బి.పి కి వాడే మందులు, కొకైన్, స్టాటిన్స్ అంటే శరీరంలో కొవ్వుని తగ్గించే మందులు వాడటం వలన రావచ్చు.
- ఇన్‌ఫ్లూయెంజా, మలేరియా, కండరాలపై గడ్డలు, పోలియో వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల రావచ్చు.
- ఫైబ్రోమయాల్జియా, డెర్మటోమైటోసిస్ వంటి వ్యాధుల వల్ల వచ్చే అవకాశం ఉంది. కండరాల వాపు, నొప్పి, తొందరగా అలసిపోవడం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి మందగించడం, శరీరం సన్నబడటం వంటి లక్షణాలుంటాయి. కదలికలు కష్టంగా మారతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
గాయాల వలన కండరాల నొప్పి, వాపు వస్తే ఆ ప్రదేశంలో మొదట ఐస్ పెట్టాలి.
దీనివల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. తరువాత తగిన విశ్రాంతి తీసుకోవాలి.
ఈఎస్ఆర్, సీబీపీ, సీరమ్, పొటాషియం, కాల్షియం లెవెల్స్ పరీక్షలు చేయించడం
ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
ఆర్సెనిక్ అల్బమ్
బరువు తగ్గడం, ఆహారం సరిగ్గా జీర్ణంకాకపోవడం, చల్లని చెమటలు పట్టడం, మందులు
వాడినా ఫలితం ఉండదని భావించడం, ఆత్మహత్యచేసుకోవాలనే ఆలోచనలు రావడం, కండరాల
బలహీనత, కాళ్లు, చేతులు బరువుగా ఉన్నట్లు అనిపించడం, కాళ్ల వాపు,
నడుమునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు ఉపయోగించదగిన ఔషధం.
బెల్లడోనా
లక్షణాలు తొందరగా రావడం, భయం, ఆందోళన, దాహం లేకపోవడం, నొప్పి తీవ్రంగా
ఉండటం, కండరాల వాపు, నొప్పి, నొప్పి ఉన్న ప్రదేశంలో శరీరం ఎర్రబడటం,
స్పర్శకి వేడిగా ఉండటం, రక్తనాళాలు కొట్టుకుంటున్నట్లు అనిపించడం వంటి
లక్షణాలున్న వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
బ్రయోనియా
నల్లగా, సన్నగా ఉండి దృఢ శరీరతత్వం ఉన్న వారికి మంచి మందు. శరీరంలోపల ఉండే
పొరలు పొడిగా అవ్వడం, దాహం ఎక్కువగా ఉండటం, శరీరంలోని ప్రతి కండరం నొప్పిగా
ఉండటం, అలసట, నొప్పి పొడిచినట్లుగా ఉండటం, కుడి పక్క ఎక్కువగా లక్షణాలు
కనిపించడం, విశ్రాంతి తీసుకుంటే ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారు
వాడదగిన మందు.
యూపటోరియమ్
ఇది మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, ఇతర రోగాల తరువాత వచ్చే కండరాల నొప్పికి,
ఎముకల నొప్పి, నిర్ణీత కాలంలో నొప్పులు మరలా వస్తుండటం, చేతులు, మణికట్టు,
నడుము, ఎముకలు, ఎముకల చుట్టూ ఉండు కండరాల వద్ద తీవ్రమైన నొప్పి, మొదలైన
లక్షణాలతో బాధపడుతున్న వారికి ఉపయోగకరమైన హోమియో ఔషధం.
లైకోపోడియం
చిన్న వయసులోనే వృద్ధలక్షణాలు కనిపించే వారికి మంచి మందు. కీళ్లనొప్పి, నడుము నొప్పి, వాతరోగం, నరాల బలహీనత ఉన్నవారికి మంచి మందు.
రస్టాక్స్
అధిక శారీరకశ్రమ, అధిక బరువులు మోయడం వల్ల వచ్చిన కండరాల సమస్యకు మంచి మందు. కీళ్లు, టెండాన్స్, కండరాలపై ప్రభావం చూపుతుంది.
మెర్స్‌సాల్
శరీరం అలసటగా ఉండటం, వణుకు, కాళ్ల వాపు, కండరాలు, ఎముకలలో నొప్పి తీవ్రంగా ఉండటం వంటి లక్షణాలున్నప్పుడు వాడవచ్చు.
పల్సటిల్లా
తిమ్మిర్లు, కండరాల నొప్పి, వాపు, నొప్పి ఒక ప్రదేశం నుంచి మరొక
ప్రదేశానికి మారుతుండటం వంటి లక్షణాలుంటాయి. చల్లటి ఆహారపదార్థాలు
తీసుకున్నప్పుడు కొంత ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్నప్పుడు వాడదగిన
మందు.
0 Comments