Full Style

>

హోమియో వైద్యం కీళ్లనొప్పులకు వరం

ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే కీళ్లనొప్పులు నేడు అన్ని వయోవర్గాల వారినీ తీవ్రంగా బాధిస్తున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా కీళ్లనొప్పుల సమస్యతో సతమతం కావటం ఆశ్చర్యకరం. ఎముకల అరుగుదల, కీళ్లనొప్పుల సమస్యలను హోమియోపతి వైద్యంతో సమర్ధంగా నివారించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా కూర్చొవడం వల్ల ఊబకాయం పెరిగి కీళ్లనొప్పి సమస్యగా మారుతుంది. కీళ్ల నొప్పులను 'ఆర్థరైటిస్' అని అంటారు. కీళ్లు గట్టిపడటం, కీళ్ల వాపుతోపాటు నొప్పి ఏర్పడటాన్ని ఆర్థరైటిస్‌గా పేర్కొంటాం. దీనిలో వంద రకాల సమస్యలున్నాయి. రెండు ఎముకలు కలిపే భాగాన్ని కీలు లేదా జాయింట్ అంటారు. మన శరీరంలో 200 దాకా కీళ్లు ఉంటాయి. మోకాలు, తుంటి, చీలమండలం, చేతివేళ్లు, కాలివేళ్ల వద్ద పలు జాయింట్లు ఉంటాయి. కీళ్లనొప్పి సమస్య చాలా కాలంపాటు మనిషిని అతలాకుతలం చేస్తాయి. ఆర్థరైటిస్ వల్ల తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. వయసును బట్టి, కారణాలను బట్టి శరీరంలోని వివిధ ప్రాంతాలు ఆర్థరైటిస్‌కు గురవుతుంటాయి. ఈ సమస్యలకు హోమియోపతి మందులతో పరిష్కారం లభిస్తుంది.
అస్టియో ఆర్థరైటిస్
ఎక్కువమందిని బాధ పెట్టేది కీళ్లనొప్పి సమస్య. వయసు పెరుగుతున్న కొద్దీ జాయింట్లలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కీళ్లు అరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధిని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ బాగా అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికి ఒకటి బిగుసుకుపోయి ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి మోకాళ్లలో కనిపిస్తుంది. దీనివల్ల మోకాళ్లను ఎక్కువగా వాడినపుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. సమస్యను 40 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువ శాతం కనిపించేది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వస్తుంది.
అమ్మకు కాని, నాన్నకు కాని ఉంటే 50 శాతం వారి పిల్లలకు వచ్చే అవకాశముంది. అదే తల్లిదండ్రులిద్దరికీ ఉన్నట్లయితే 100 శాతం ఈ వ్యాధి వస్తుంది. తల్లిదండ్రులకు 50 ఏళ్లకు ఈ వ్యాధి వస్తే వారి పిల్లలకు ఇంకా తక్కువ వయసులో వ్యాధి వచ్చే అవకాశముంది. ఈ వ్యాధి వృత్తిరీత్యా ఎక్కువ సేపు నిలబడటం, ఎక్కువగా కూర్చొవడం, క్రీడల్లో పాల్గొనే వారిలో ఇలాంటి సమస్య త్వరగా వచ్చే అవకాశముంది. ఇలాంటి వాళ్లకు వయసుతో సంబంధం ఏమీ ఉండదు. సాధారణ జీవనశైలి గడిపేవారికి మధ్యవయసు దాటాక ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
తీవ్రమైన కీళ్లనొప్పితోపాటు జ్వరం వస్తుంటుంది. మొదట కూర్చొని, లేచేటపుడు జాయింట్లు పట్టినట్లుగా ఉండి తీవ్ర నొప్పిని కలగజేస్తుంది. జాయింట్లలో టకటకమనే శబ్ధం వస్తుంది. కింద కూర్చొవడం చాలా కష్టంగా మారుతుంది. మెట్లు ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది. అధిక బరువు, స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, వయసు మళ్లిన వారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో హార్మోన్ల అసమతుల్యత, అదే పనిగా జాయింట్లలో ఒత్తిడి కలిగించినపుడు, వంశపారంపర్యంగా, సోరియాసిస్, థైరాయిడ్ లాంటి వ్యాధుల ప్రభావం వల్ల జాయింట్ల పైన ఒత్తిడి పెరిగి నొప్పి, వాపు, జ్వరంతో బాధపడుతారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్
ఈ వ్యాధి శరీరంలోని అన్ని రకాల కీళ్లకు సంభవిస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూనో డిజార్డర్‌గా గుర్తిస్తారు. ఈ సమస్య మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి చలికాలంలో తీవ్రమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి శరీరంలో చేతివేళ్లకు, మోకాళ్లకు, మణికట్టు కీలుకు, కాలివేళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉండి కదలలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం శరీరం వేడిగా ఉండి జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినపుడు జ్వరం రావడం, వ్యక్తి కదలలేక పోవడం సంభవిస్తుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. మానసికంగా రోగి కుంగిపోతాడు. కీళ్ల ప్రాంతంలో 'నాడ్యుల్స్' అనబడే బొడిదెల వంటి ఎముకల ఉబ్బెత్తులు ఏర్పడతాయి. ఈ ముఖ్య లక్షణం ఆధారంగా కూడా రుమటాయిడడ్ ఆర్థరైటిస్‌గా గుర్తించాలి.
వ్యాధినిర్ధారణ
ఎక్స్‌రే జాయింట్స్, ఎంఆర్ఐ, సినోరియల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్, రుమటాయిడ్ ఫ్యాక్టర్, సీఆర్‌పీ, ఈఎస్ఆర్ లాంటి పరీక్షలతో చాలావరకు ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రత కూడా గుర్తించవచ్చు.
హోమియోపతి చికిత్స
ఆస్టియో ఆర్థరైటిస్‌కు బ్రయోనియా, రస్టాక్స్, కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా ఫాస్, కల్మియా మొదలగు హోమియో మందులు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు లీడుంపాస్, రస్టాక్స్, యూపర్‌టోనియం, ఫర్పరేటమ్, బెలీస్‌పర్, బెల్లడోనా మందులను నిపుణులైన హోమియోపతి వైద్యుల పర్యవేక్షణలో వాడితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments