Full Style

>

తల తిరుగుడు, కళ్లు తిరుగుడు,Reeling sensation


-కళ్లు తిరుగుడు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయ. ఇవి సాధారణమే అయనా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి వ్యాధులు రావడానికి ముందు సూచనగా కూడా ఇవి బయటపడుతుంటాయ. కనుక ఎప్పుడైన కళ్లు తిరిగినా, ఒళ్లు తూలిన దానికి కారణాలను తెలుసుకోవాలి. అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్టర్ల సలహాను పాటించవలసి ఉంటుంది.

వ్యాధుల వలన కలిగే తలతిరుగుడుకు కారణం
తలకు పెద్ద గాయం అవడం,
లోపలి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవం లోపల చేరిన వైరస్,
లోపలి చెవిలో అవయవం లోపం,
లోపలి చెవి శస్తచ్రికిత్స అనంతరం ఇలాంటి జబ్బు కనపడుతుంది.
యూస్టాషియన్ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ,
రాయలా గట్టిగా చెవిలో గులివి ఏర్పడినపుడూ,
మెడ ఎముకలు అరుగుదల లాంటివి ఏర్పడినపుడు తల తిరుగుడు ... కళ్లు తిరుగుడు కనిపిస్తుంది.
అదిక రక్తపోటు ఉన్నవారిలో కూడా ఒక్కక్క సారి తలతిరిగినట్లు ఉంటుంది .



కళ్ళు తిరగడానికి కారణాలు:
ఇవి మూదు రకాలైనవి --->
1. వ్యాధి వలన (పేథోలాజికల్‌)--2.వ్యాధి లేకుండానే (నాన్‌ పేథోలాజికల్‌)---3. తీవ్ర మానసిక ఆందోళనలు (సైకొలాజికల్)కలిగినపుడు...



1.తలకి తగిలిన దెబ్బలు (రోడ్‌ ప్రమాదాలు)

2. వాహన ప్రయాణంలో కదలికలు పడక వచ్చే లక్షణం (ట్రావెల్‌ సికనెేస్‌)

3. చెవిలో సమతూల్య నియంత్రణ కలిగించే అవయవం (మినియర్స్‌ వ్యాధి)

4. వైరస్‌ వ్యాధులు, గవద బిళ్ళలు, తట్టు వంటి వ్యాధులు సోకిన తరువాత

5. లోపలి చెవి శస్త్ర చికిత్స అనంతరం

6. తీవ్రమైన పెద్ద శబ్దాలు దగ్గరగా విన్నపðడు

7. చెవిలో చీము (ప్రమాదకరమైన రకం అన్‌ సేఫ్‌ సి.ఎస్‌.ఓ.ఎం)

8. యూస్టాషియన్‌ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ

9. రాయిలా గట్టిగా గులివి ఏర్పడినపðడు

10. మెడ ఎముకల ఆరుగుదల (సర్వైకల్‌ స్పాండిలోసిస్‌)

11. కంటి చూపులో పవర్‌లో మార్పులు

12. రక్తపోటు అస్తవ్యస్తం (అధిక పోటు/బి.పి. తగ్గుట)

13. తీవ్రమైన రక్తహీనత

14. మెదడులో కంతులు

15. అతి తీవ్రంగా మానసిక వత్తిడులు

16. పక్క నుండి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుండి పక్కకు తిప్పినా తల తిరుగుడు వస్తుంది. (పొజిషనల్‌ వర్టిగో)

వ్యాధి నిర్ధారణ పరీక్షలు:

ఈ వ్యాధి చికిత్సలో చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులతో బాటు ఫిజీషియన్‌ నరాల సంబంధిత వైద్యుల పాత్ర కూడా ఉంటుంది.

- చెవి పరీక్ష

- ఆడియోలజీ పరీక్షలు

- సమతూల్య (వెస్టిబ్యులర్స్‌) పరీక్షలు, ఇఎన్‌జి, కేలోరిక పరీక్షలు

- రక్త పరీక్షలు

- మధుమేహం, కొవ్వు (కొలస్ట్రాల్‌) పరీక్షలు

- హెచ్‌.ఐ.వి. పరీక్షలు

- మెడ ఎక్సరే

- ఈసిజి ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశితంగా పరీక్షించాలి.

రోగానికి గల కారణం నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేయాలి. మొట్టమొదట కళ్ళు తిరగటం, తలతిరగటం తీవ్రంగా ఉన్నప్పుడు రోగికి ధైర్యం చెప్పాలి. కారణం తెలుసుకున్నాకా కొన్ని యాంటీ వర్టిగో మందులతో, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించవచ్చును. మెద డులో కంతుల వంటి వ్యాధులకు శస్త్ర చికిత్స అవసరమౌతుంది. మినియర్స్‌ వ్యాధి ఇది తరచుగా వచ్చే వ్యాధి. ఇందులో తలతిరగ టం, చెవిలో హౌరు, వినికిడిలోపం మధ్యమధ్యలో ఉధృతం అవుతూ (అటాక్  లా) వస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవాలి. లేనిచో శాశ్వతంగా వినికిడి లోపించి మనిషికి అసహాయత రావచ్చు.

గుండె సంబంధమైనవి

అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై పీడం ఏర్పడినప్పుడు, రక్తనాళాల్లో కొవ్వు పదార్థాం చేరడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి తలతిరగడం జరుగుతుంది.

వైద్యం :

 మూలకారణమైన అధిక రక్తపోటు తగ్గించే మందులు వాడాలి. కొవ్వు పదార్థాలు తగ్గించే స్టాటిన్స్‌ వాడాలి. అంతేకాక తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

    చెవి, ముక్కు, గొంతు

చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోనూ, రక్త సరఫరాలోనూ, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వల్ల చెవిలో మీనిమర్స్‌ వ్యాధి,Vertigo ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది.

వైద్యం :

 ఇఎన్‌టి వైద్యనిపుణులను సంప్రదించి ‘స్టిరాయిడ్‌’ వైద్యం, సినర్జిన్‌ వంటి మందులు వాడాలి.

    ఆర్థోపెడిక్‌

మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రసరించే రక్తం మెడ ముందు భాగంలోని రెండు కెరోటాడ్‌ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా రెండు సర్వైకల్‌ వెర్టబ్రల్‌ రక్త నాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనక భాగానికి రక్తాన్నందిస్తాయి. మెడలోని ఎముకల అరుగుదలలో ఈ రక్త నాళాలు ఒక్కోసారి ఒత్తిడికి లోనై మెదడుకు సరఫరా అయ్యేరక్తం తగ్గినప్పుడు తలతిరగడం, నిద్ర నుండి లేచినప్పుడు తలతిరిగి పడిపోతారు.---

వైద్యం :

 దీనికి కాలర్‌, ట్రాక్షన్‌ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి.
తాత్కాలికముగా వాడే మందులు :


సిన్నర్జిన్‌ – 25 మిల్లీ గ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు రోజూ రెండు సార్లు వాడాలి.
డోమ్‌పెరిడోన్‌ – 10 నుండి 20 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు వాడాలి.
బీటా హిస్టిన్‌ హైడ్రోక్లోరైడ్‌ – 8,16,24 మిల్లీగ్రాముల డోసులు రోజుకు 2 లేక 3 సార్లు వాడాలి.
స్టెమ్‌టిల్ 5 మి.గా రోకుకు 2-3 సార్లు . 4-5 రోజులు .

Post a Comment

6 Comments

  1. ధన్యవాదములు - గోనిగింతల నాగ వర ప్రసాద్

    ReplyDelete
  2. Ma vadhinaki kallu teruguthunnaye ent lo chupinchanu,Ami ledhu annaru,ct scaning chupinchanu Ami ledhu annaru hyd lo a doctor ni kalavali

    ReplyDelete
  3. Talent tirugudu debuted aarogyam?

    ReplyDelete
  4. Tala tiragadam oka anarogyaniki samkethama?

    ReplyDelete
  5. Sudenly stop the difrestion tablets any side effects

    ReplyDelete
  6. Ma husband ki summer vasthae chalu tala tiruguthundi anntaru adi kuda apudapudu anntaru work lo em annaru intilo free ga oka 5days untae matram tala tiruguthundi anntaru em cheyali a doctor dagariki velthae manchidi

    ReplyDelete