ఊపితి తిత్తుల వ్యాధి లేదా తొలిదశ మధుమేహం కావచ్చు . దంతాల చిగుళ్ళ వ్యాధి కావచ్చు . గతరాత్రి వెళ్ళుల్లి తిన్నాం కాబట్టి నోటి దుర్వాసన వచ్చిందనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. కాని అది తప్పు. టిక్ -టాక్ నోట్లో వేసుకుంటే పోయే దుర్వాసన కాకపోవచ్చు . కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు ... ఆస్మా , సిస్టిక్ ఫైబ్రోసిస్ , లంగ్ యాబ్సెస్ కావడం వలన వచ్చే దుర్వాసన అయిఉండవచ్చును . ఆ దుర్వాసన ఎంత యాసిడ్ తో కూడుకొని ఉంటుందో జబ్బు అంటతీవ్రమైనట్లు లెక్క . దాదాపు 90 శాతము నోటిదుర్వాసన కేసులు గమ్ (gums)సమస్యలవల్ల లేదా నోరు పరిశుబ్రము గా ఉంచుకోకపోవడం వల్ల వస్తుంది. మిగతా 10 శాతము ఊపిరితిత్తుల వ్యాధి , లివర్ వ్యాధి మదలైన వాటి మూలాన వస్తుంది. ఏమి చేయాలంటే : నొరు ఎండిపోవడం , సైనస్ , గమ్ వ్యాధులు , పొగ తాగడం లాంటి వాటివలన నోటి దుర్వాసన వస్తుందా? లేక మరేదైనా కారణమున్నదా ? అని వైద్యుని సంప్రదించి తెలుసుకోవాలి. నోటి కాన్సర్ తొలిదశలో దంత వైద్యులు గుర్తుపట్టి హెచ్చరిస్తారు. మొదటిలో అయితే చికిత్స చేయడం సులభం అవుతుంది.
0 Comments