పవన ముక్తాసనం
వెల్లకిలా పడుకొని కాళ్లు రెండింటిని దగ్గరగా ఉంచాలి. గాలిని తీసుకొంటూ కుడికాలిని పైకి మడిచి మోకాలిని పొట్ట వైపునకు రెండు చేతులతో నొక్కిపట్టి ఉంచాలి. తర్వాత మెల్లగా గాలిని వదులుతూ తలని పైకి లేపి మోకాలిని పెదవులకు ఆనించాలి. పది నుంచి ఇరవై సెకన్ల పాటు అలా ఉంచి తలని యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత గాలిని వదులుతూ కాలిని కిందికి పెట్టాలి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి. మార్చిమార్చి ఆరు సార్లుచెయ్యాలి.
శశాంకాసనం
వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులు వెనుకకు పెట్టాలి. చేతులను ఒకదానితో ఒకటి అంటే ఎడమచేతి మణికట్టుని కుడిచేతితో పట్టుకొని నెమ్మదిగా గాలి తీసుకొని ఆ గాలిని వదిలేస్తూ మెల్లగా ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆనించి గాలిని పీలుస్తూ వదులుతూ అలా పది సెకన్లు ఉండి మెల్లగా గాలిని పీల్చుకొంటూ పైకి రావాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.
ఓంకార ప్రాణాయామం
ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులు సూర్యముద్రలో మోకాళ్లమీద పెట్టి నెమ్మదిగా గాలిని తీసుకోవాలి. తిరిగి గాలి వదిలేటప్పుడు ఓంకార శబ్దం చెయ్యాలి. ఓమ్ ఎలా అనాలంటే ముందుగా నాభి నుంచి అ కార శబ్దాన్ని చేస్తున్నట్లు వూహించుకోవాలి. పెదాలని సున్నాలా చుట్టి ఉకార శబ్దాన్ని చెయ్యాలి. తర్వాత పెదాలని మూసి 'మ్' శబ్దం చెయ్యాలి. ఇలా చేస్తే ఓంకారం వినబడుతుంది. నేరుగా ఓం అనడం కన్నా ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

సూర్యముద్ర
ఉంగరం వేలు మడిచి గోరువైపు నుంచి మొదటి కణుపు మీద బొటనవేలు ఉంచాలి. మిగిలిన
వేలు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
అనులోమ విలోమ ప్రాణాయామం
సుఖాసనంలో కూర్చొని ఎడమ చెయ్యి ఎడమ మోకాలు మీద చిన్‌ముద్ర (బొటన వేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి)లో ఉంచి కుడి చెయ్యి నాసికాముద్రలో అంటే చూపుడు వేలు మధ్యవేలు మడిచి చిటికెన వేలు, ఉంగరం వేలు నిటారుగా ఉంచాలి. ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిని తీసుకొని కుడిముక్కుతో గాలిని వదిలి మరల అదే ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ఒక రౌండు అంటారు. ఇలా ఐదు నుంచి పదినిమిషాలు చెయ్యాలి.
గమనిక: గుండె శస్త్రచికిత్సలు జరిగిన వాళ్లు... సంబంధిత ఇబ్బందులున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాతో.. నిపుణుల ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది.
కటి ఆసనం:
నేలపై వెల్లకిలా పడుకొని కాళ్లని తొంభై డిగ్రీల కోణంలో పెట్టాలి. నెమ్మదిగా మోకాళ్లు కొద్దిగా పైకి మడిచి ఉంచి.. రెండు చేతులతో రెండు కాళ్ల బొటనవేళ్లు పట్టుకొని కాళ్లు కాస్త ఎడంగా పెట్టాలి. ఇలా చేసేటప్పుడు తలని పైకి ఎత్తకూడదు. ఈ ఆసనం వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది.
0 Comments