Full Style

>

Electrophisiology theraphy for heart-ఎలెక్ట్రో ఫిజియాలజీ థెరపీ గుండె జబ్బులకోసం

-ఎలెక్టో ఫిజియోలజీ థెరపీ.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 గుండె వ్యాధులకు సంబంధించిన ఆధునిక వైద్య విధానము " ఎలెక్ట్రో ఫిజియోలజీ "  మనదేసములో ఇంకా పుర్తీ స్థాయిలో అందుబాటులోకి రాని ఈ చికిత్సా విధానము గుండె లయలో మార్పులను సరిచేస్తుంది .గుండెకు సంబందించిన వైద్యవిధానము ఆధునిక వైద్యము ఎలెక్టో ఫిజియోలజీ థెరపీ. దీన్నే ఎలెక్ట్రికల్ సిస్టం  ఆఫ్ ది హార్ట్  అంటారు . దీన్ని చికిత్స చేసే వైద్య్ నిపుణులను " ఎలెక్ట్రీషియన్‌స్  ఆఫ్ ది హార్ట్ " అంటారు .

గుండె లయలో మార్పులెందుకూ? :
గుండెను ఓక్ ఇంటితో పోల్చి చూసినప్పుడు .. ప్రతి ఇంటిలో ఒక విద్యుత్ జనరేటర్ , ఒక  ట్రాన్‌ఫార్మర్ , వైరింగ్ ఉన్నట్లే  ప్రతి మనిషికి గుండె లో పల్స్ జనరేటర్ ఉంటుంది . గుండే కొట్టుకోవడానికి అది తోడ్పడుతుంటుంది. దీన్ని " సైనో ఏట్రీల్ నోడ్ (SA node) అంటారు . అక్కడ నుంఛి విద్యుచ్చక్తి  ట్రాన్‌స్ ఫార్మర్ కు వచ్చి నట్లే  రక్తం అక్కడకు వస్తుంది . ఇక్కడ దీన్ని ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ (ఎ.వి.నోడ్ ) అంటారు . .దాని క్రింద వచ్చే వైరింగ్ అంటే రక్త సరఫరా జరిగే ప్రదేశాన్ని వెంట్రికల్ అంటారు . పైభాగాన్ని ఏట్రియం , కింది బాగం వెంట్రికల్ గా వ్యవహరిస్తారు .

ప్రతి మనిషి గుండె లో నాలుగు కవాటాలు ఉంటాయి. రెండు ఏట్రియాలు , రెండు వెంట్రికల్ లు  ఉంటాయి. శరీరములోని చెడు రక్తము ఏట్రియాకు వచ్చి అక్కడనుంచి కుడి వెంట్రికల్ కు వెళ్ళి అక్కడనుండి ఊపిరితిత్తులకు వెళుతుంది . అక్కడ శుద్ది చేసుకున్న రక్తము ఎడమవైపున ఉన్న ఏట్రియం కు వస్తుంది . , తరువాత ఎడమ వెంట్రికల్ కు వెళ్ళి అక్కడి నుంచి శరీరమంతటా సరఫరా అవుతుంది . దీన్నిబట్టి గుండెను ఒక మోటారు పంప్ తో పోల్చవచ్చును. వెంట్రికల్స్ అనేవి ఒక పంపులా పనిచేసి శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. గుండె కొట్టుకోవడంఉలో ఎటువంటి అసాధారణ క్రియనైనా సరిచేయడం ఎలెక్టోఫిజియాలజిస్టుల పని ,అంటే గుండె దడ , గుండె నెమ్మదిగా కొట్టుకోవడము , అపసవ్యము గా కొట్టుకోవడము , చాలా వేగంగా కొట్టుకోవడము , వంటివన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.

ఈ సమస్యలు ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఎస్.ఎ.నోడ్ సరిగా పనిచేయకపోవడము .. లేదా ఏ.వి.నోడ్ సరిగా పనిచేయకపోవడము .,లేదా కవాటాలకు రక్తసరఫరా సరిగా లేకపోవడము  వంటివి కావచ్చును . గుండె వేగము అపసవ్యము గా ఉండడానికి ఏట్రియం లో  లోపాలు కూడా కారణము కావచ్చును. అలాగే కింది కవాటం లోని వెంట్రికల్ లో లోపాలు కారణము కావచ్చు . వెంట్రికల్ లోని లోపాలవల్ల ఏర్పడే గుండె అపసవ్య గమనం అత్యంత ప్రమాదకరమని చెప్పవచ్చు .ఎందుకంటే వెంట్రికల్ నుంచే శరీరం మొత్తానికి రక్తము సరఫరా అవుతుంది . గుండె వేగము పెరిగినా , తగ్గినా ్...రక్తసరఫరా తగ్గిపోతుంది . దీనికి ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమవుతాయి.

వ్యాధి నిర్ధారణ ఎలా?

గుండె కొట్టుకునే వేగము ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే ఎలెక్ట్రోఫిజియోలాజికల్ (ఇసి)అద్యయనము చేయాల్సి ఉంటుంది . ఎస్.ఎ.నోడ్ దగ్గర ఏ.వి నోడ్ దగ్గర దానికింద వవాటాల దగ్గర క్యాథటర్స్ పెట్టి అధ్యయనము చేస్తారు . ఎందుకు గుండెదడ పెరిగింది ? , ఎందుకు గుండె దడ తగ్గిపోయింది? వంటి విషయాల్ని తెలుసుకుటారు . కణజాలములో లోపాలు ఉంటే ' రేడియో ఫ్రీక్వెన్‌సీ  అబ్లేషన్‌ (కాలచడము) చేస్తారు . లోపము ఎక్కడుందో తెలుసుకున్న తరువాత  ఆ ప్రదేశము లో గుండె వేగము లో మార్పులను తెస్తున్న కణాలను కాల్చివేయడం జరుగుతుంది . అలా కాల్చడానికి ఉపయోగించేదే ... " రేడియో ఫ్రీక్వెన్‌సీ ఎనర్జీ"  ఇందులోనే వేరే విధానాలు కూడా ఉంటాయి. క్రయో అబ్లేషన్‌ లో కణాలను శీతలము చేయడానికి ఐస్ ను ఉపయోగిస్తారు . కణజాలం లోని కణాలు శీతలానికి ఫ్రీజ్ అయి చనిపోతాయి.

చికిత్సా పద్దతులు :

గుండె వేగము పెరగడాన్ని   టెకీ కార్డియా అంటారు . ఇది ఏట్రియం వలన  లేదా  వెంట్రికల్ వలన రావచ్చును. వెంట్రికల్ నుండి వచ్చేదాన్ని వెంట్రుకులర్ - టెకీకార్డియా అంటారు . అందుకే వెంటనే చికిత్స ను అందచేయాల్సి ఉంటుంది. ఇది ముదిరితే  .. తలెత్తే వెంట్రికల్ ఫిబ్రిల్లేషన్‌ అనే పరిస్థితిలో రోగి హఠాత్తుగా చనిపోవచ్చు. గుండె కొట్టుకోవడము హఠాత్తుగా నిలిచిపోతుంది . ఎటువంటి కారణము లేకుండా హఠాత్తుగా గుండె పోటుతో మరణిచ్చేవారిలో అధిక శాతము వెంట్రికల్ ఫిబ్రిల్లేషన్‌ కారణము గానే మరణిస్తున్నారు . వీటికి చికిత్స చేసేదే ఎలెక్ట్రోఫిజియాలజీ థెరఫి . దీనికి కూడా వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి.
 త్రీడి వ్యాపింగ్ చేసి   చికిత్స చేయడము ఒక పద్దతైతే , పేస్మేకర్ లాగా ఉండే  ఐసిడి అనే పరికరము అవర్చడం మరోపద్దతి.
గుండె వేగాన్నీ నియంత్రించడానికి పేస్మేకర్ ను ఉపయోగించడము అందరికీ తెలిసిందే . దీనికి ఒకటి  లేదా  రెండుచోట్ల వైర్లు ఉంటాయి.
హార్ట్ ఫెయిల్యూర్ కేసులలో గుండె చాలా బలహీనపడి ఉంటుంది ... దానికి సపోర్ట్ చేయడానికి స్పెషల్ ఫేస్మేకర్ అమరుస్తారు . దీంట్లో మూడు వైర్లు ఉంటాయి . . . ఒకటి ఏట్రియం లో, రెండోది కుడివైపు వెంట్రికల్ లో , మూడోది ఎడమ వెంట్రికల్ లో అమరుస్తారు . దీన్ని కార్డియక్ రీసింక్రనైజేషని థెరఫీ(సి.ఆర్.టి) అంటారు .
భవిష్యత్తులో కంప్యూటర్ నేవిగేటెడ్ రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రోగులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 

Post a Comment

0 Comments