భారత దేశం లొ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం బాగా పెరిగింది . సెల్ ఫొన్ల వినియోగం చాలా ఎక్కువయినది . ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు , కంప్యూటర్లు , ల్యాప్ టాప్లు , డివిడి ప్లేయర్లు , ఎంపీ3 ప్లేయర్లు ... వినియోగము హద్దులు దాటుతుంది . వీటి జీవిత కాలము పూర్తయితే ... అవి ఎలక్ట్రానిక్ వ్యర్ధ పదార్దాలుగా మారుతాయి . ప్రపంచ వ్యాప్తం గా వ్యర్ధాల పెరుగుదల రేటు ఎక్కువవుతూనే ఉన్నది . 4 కోట్ల టన్నుల మేర ఉంటుందని అంచనా . వీటివలన ఆరోగ్యానికి , పర్యావరణానికి హాని కలుగుతుంది . భారతదేశం లొ 2005 లో 1.47 లక్షల టన్నులు కాగా .. ఇది 2012 నాటికి 8 లక్షల టన్నులు కు చేరుతుందని నిపుణుల ఊహా .
ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సరిగా శుద్ధిచేస్తే విలువైన ముడిపదార్హాలను పొందవచ్చును . పర్యావరణానికీ మేళుజరుగుతుంది . అయితే భారత వంటి పలు దేశాలలో ఈ పక్రియ సరిగా జరగదం లేదు . ఎలక్ట్రానిక్ పరికరాలను భాగాలుగా విడదీసి పనికొచ్చే భాగాలను రోడ్ల వెంబడి అమ్మే వస్తువుల కోసం విక్రయిస్తున్నారు . మిగతా భాగాలను తగల బెట్టడమో , పాతిపెట్టడమో చేస్తున్నరు .ఈ రెండు విధానాల వల్ల ఆరోగ్యానికి , పర్యావరణానికి హానిజరుగుతుంది .
భూమిలో పాతిపెట్టినప్పుడు విషతుల్యమైన రసాయనాలు భూగర్భజలాల్లో కలుస్తాయి . నీరు కలుషితమై రోగాలను కలుగజేసుంది .
ఎలాంటి రక్షణ లేకుండానే మహిళలు , పిల్లలు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు . సుమారు 80 శాతం రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు .
ఈ ఎలక్టానిక్ వ్యర్ధాల్లో హానికరమైన పాదరసం , సీసం , పీవీసీ పూతపూసిన రాగి తీగలు ఉంటాయి . వీటివల్ల మొదట ఈ రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారికే హానికరము .
హానికర వ్యర్ధపదా్ర్ధాలు ->
సీసమం : టీవీలు , కంప్యూటర్ మోనిటర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది . అధిక మోతాదులో సీసం ప్రభావానికి గురైతే ... వాంతులు ,విరేచనాలు , మూర్చ రావడం , కోమా లోనికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది .
క్యాడ్మియం : సెమీ కండక్టర్ చిప్ లు , క్యఠోడ్ రే ట్యూబ్ ల్లో దీన్ని వినియోగిస్తారు . క్యాడ్మియం ను పీల్చితే ఊపిరితిత్తులు , మూత్రపిండాలు దెబ్బతింటాయి . కొన్ని కేసుల్లో మరణాలూ సంభవిస్తాయి.
పాదరసం : ప్రపంచవ్యాప్తం గా ఉత్పత్తి అయ్యే పాదరసం లో 22 శాతం ఎలక్ట్రానిక్ పరిశ్రమే వినియోగిస్తోంది . ఇది మెదడు , మూత్రపిండాలు వంటి అవయవాలను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తుంది .
బేరియం : సీ అర్ టీ స్క్రీన్ ప్యానెళ్ళ లో రేడియోధార్మికత నుంచి ప్రజలను రక్షించేందుకు బేరియం ను వాడతారు . గుండె , కాలేయము వంటి అవయవాలను పాడుచేస్తుంది .
బెరీలియం : ఈ లోహం తేలిగా , దృఢం గాను ఉంతుంది .విద్యుత్ ను బాగా గ్రహించే దీన్ని పరిశ్రమలొ వివిగా వాడతారు . ఇది ఊపిరితిత్తుల కేన్సర్ ను కలుగజేస్తుంది .
పాలీ వినైల్ క్లోరైడ్ (పి.వి.సి) : ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే ప్లాస్టిక్ లో పివిసె నే ఎక్కువగా ఉంటుంది . వీటిని మండించడం వల్ల వెలువడే "డైఆక్షిన్లు " రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి .

0 Comments