మూర్చతగ్గిందని మందులు వాడడం ఆపొద్దు
ఒక్కసారే ఫిట్స్ వచ్చి, పరీక్షలో అన్ని నార్మల్‌గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో రిపోర్ట్‌నిబట్టి ఆసుపత్రిలో 1-2 రోజులు ఉండాల్సి రావచ్చు. సాధారణంగా ఒకసారి మందులు వాడడం మొదలుపెట్టిన తరువాత అవసరాన్నిబట్టి రెండునుంచి మూడు సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది. జన్యుపరమైన కారణాలవలన ఫిట్స్ వచ్చినప్పుడు జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు.
ప్రత్యేక పరిస్థితులు
ఫెబ్రెల్ సీజర్స్
6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లల్లో జ్వరంతోపాటు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇవి తరువాత ఆగిపోతాయి. అయితే వీరికి 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఫిట్స్ వచ్చినా, వరుసగా రెండు, మూడుసార్లు ఫిట్స్ వచ్చినా, ఫిట్స్ వచ్చాక తర్వాత కోలుకోకున్నా; ఇఇజి పరీక్షలో తేడా వచ్చినా వారికి ఫిట్స్ రాకుండా సిరప్ వాడవలసి ఉంటుంది. ఇవేవీ లేవన్నట్లయితే జ్వరం వచ్చిన మూడునాలుగు రోజులు ఫిట్స్ మందులు వాడితే సరిపోతుంది.
మెటబాలిక్ సీజర్స్
మన శరీరంలో వేరే కారణాలవలన, అంటే జ్వరం వలన, కిడ్నీ ప్రాబ్లం వలన, షుగరు, ఉప్పు శాతం తగ్గిపోవడంవలన వచ్చే ఫిట్స్ కొద్ది రోజులు ఫిట్స్ మందులు వాడాతే తగ్గిపోతాయి. వీరిలో రెండు వారాల నుండి మూడునెలల వరకు మందులు వాడితే సరిపోతుంది.
రిఫ్రాక్చరీ సీజర్స్
సాధారణంగా 80 శాతం మందిలో ఒకటి లేక రెండు మందులు పూర్తి డోసులో కనక వాడితే ఫిట్స్ అదుపులో ఉంటాయి. అయితే 20 శాతం మందిలో మందులు వాడినా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి వారిలో 3టి ఎంఆర్‌ఐ, వీడియో ఇసిజి, స్పెక్ట్, పిఇటి వంటి పరీక్షలు నిర్వహించి మెడలో ఏ భాగం నుంచి విద్యుత్తు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవాలి. ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించినట్లైతే ఫిట్స్ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆపరేషన్ చేసినాక కూడా కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
ఎపిలెప్సీ సిండ్రోమ్స్
కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన కారణాలవలన కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. వీరిలో కొంతమందిలో జీవితాంతం కూడా మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. మరికొంత మందిలో మందులు వాడినా కూడా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. వీరికి ఆపరేషన్ వలవ కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉండదు. వీరిలో కొంతమందికి కీటోజెనిక్ డైట్; వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి కొత్త పద్ధతుల ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
1. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు ఆపినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2. రోజుకు 6-8 గంటలు నిద్ర ఉండేట్లు చూసుకోవాలి.
3. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం; చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఫిట్స్‌రాకుండా ఉపయోగపడతాయి. టీవీ వీక్షించడం కూడా తగ్గించాలి.
5. మత్తు మందులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
6. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
7. పదే పదే ఫిట్స్ వచ్చేవారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది.
8 ఎత్తయిన ప్రదేశాలకు, నీటిలోనికి, నిప్పు దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి.
8. పెళ్ళయిన అమ్మాయిలు ఫిట్స్ మందులతోపాటు, ఫోలేట్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాలి. దీనివలన వారికి కలిగే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి.
9. మూర్ఛవ్యాధి ఉన్న వారందరూ వారి పర్స్‌లో వారి జబ్బును గూర్చి తెలియజెప్పే కార్డుని పెట్టుకుంటే మంచిది.

0 Comments