- కాలిన చోటుని అవసరమైనంతకంటే ఎక్కువ ముట్టకూడదు. ముందు చేతులను శుభ్రముగా కడుగుకొనవలెను
- కాలిన గాయమును చల్లని నీటితో కడగవలెను. ఎట్టి ద్రావకములను గాయము మీద పోయవద్దు
- కాలిన గుడ్డలను ఊడదీయవద్దు. బొబ్బలను చిదపవద్దు
- కాలినచోటును, కాలిన గుడ్డలతో సహా అంటు దోషములేని గుడ్డలతో కప్పుము. అది లేనియెడల బట్టను ఉపయోగింపవచ్చును
- బొబ్బలుంటే తప్ప, కట్టుగట్టిగా కట్టాలి, బొబ్బలుంటే కొంతవదులుగా కట్టవలెను
- కాలిన భాగమును తగు రీతిగా కదలకుండా చేయుము
- నిస్త్రాణకు చికిత్స చేయుము
- ఎక్కువ కాలిన యెడల వెంటనే ఆస్పత్రికి తరలించవలెను. ఆలోగా నోటికి ఎట్టి ద్రవపదార్థమును ఇవ్వకూడదు. ఎందుకనగా ఆస్పత్రిలో అతనికి మత్తుమందు ఇవ్వలసియుండును. నాలుగు గంటల వరకు వైద్య సదుపాయం దొరకదని తెలిసిన ఎడల ఒక గ్లాసెడు నీళ్ళలో టీ స్పూనులో 4వ వంతు ఉప్పు కలిపి ఇవ్వవచ్చును. వంటసోడా దొరికితే దానిని నీటిలో కలిపి ఇవ్వవచ్చును.
- కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.
|
0 Comments