Full Style

>

విష ప్రభావానికి చికిత్స మరియు సామాన్య సూత్రములు - FIRST AID - POISION

విష ప్రభావానికి చికిత్స మరియు సామాన్య సూత్రములు
  1. వెంటనే వైద్యునికి కబురు పంపుము. రోగి పరిస్థితి నీకు తెలిసిన యెడల రోగ కారణమును తెలియచేయుము. వైద్య పరీక్ష కొరకు యీ క్రింది వాటిని భద్రముగా నుంచుము.
    1. అక్కడ మిగిలియున్న వస్తువులు
    2. విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను.
    3. వాంతి
  2. రోగి స్పృహ తప్పియున్న ఎడల –
    1. రోగిని బోరగిల పరుండబెట్టుము / బోర్లా పడుకోపెట్టుము. తలను ఒక ప్రక్కకు త్రిప్పి ఉంచుము. తలక్రింద దిండు పెట్టకూడదు. అట్లు చేయుటవలన వాంతి పదార్థముగాలి గొట్టములోనికి పోదు. నాలుక కూడా ఊపిరి మార్గమునకు అడ్డుపడదు. అవసరమైతే వెంటనే ఊపిరి సాధన చేయుటకు వీలగును. డోకు, వాంతి ఎక్కువగా ఉంటే రోగి ఒక కాలిని ముందుకు వంచి యుంచుట మంచిది. అంటే, రోగి ఒక ప్రక్కకు పరుండును. పైకి ఉన్న కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద నుంచవలెను.
    2. ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు.
  3. రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు –
మొదట వాంతి చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల ఉప్పును ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము.
ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు.
  1. రోగి స్పృహ తప్పియున్నప్పుడు 
  2. రోగి పెదవులు లేక  నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును.
తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నవి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.
పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును.
అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును.

Post a Comment

0 Comments