మొక్కల రోగములు, పురుగులను చంపుటకు చల్లు కొన్ని మందులు అజాగ్రత్తగా వాడినను, ప్రమాదవశాత్తు అంటుకొనినను చాలా అపాయము కలుగవచ్చును. ఈ రకము విషము వల్ల ఆరొగ్యం రెండు రకములుగా దెబ్బ్ తినవచ్చును. వానిలో ఒకటి వేడివల్ల కలిగే వడదెబ్బ పోలియుండును గనుక దానికి ఎండదెబ్బ చికిత్సవలె చేయవలెను. రెండవ రకములో శ్వాస సంబంధము రీతిలో రావచ్చును. దాని గుర్తులేవనగా తలత్రిప్పుట, డోకు, చూపు మాంద్యము, రొమ్ము బిగుసుకొనుట, వాటితోపాటు నాడి నిదానముగా కొట్టుకొనుట, చిన్నవైన కనుపాపలు, చెమట, పెదవులు ముఖము నల్లబడుట, స్మారకము తప్పుట, మూర్ఛ రావచ్చును.
చికిత్స :
ఊపిరి సాధనను, అవసరమైతే చాలా సేపు చేయవలెను. డాక్టరుకు కబురు పంపినపుడు ఫలాని దానివలన యీ స్థితి వచ్చి యుండవచ్చునని చెప్పవలెను. ఎందుకంటే ఇంజక్షన్ ద్వారా డాక్టరు విరుగుడు మందు ఇవ్వదలచవచ్చును. |
0 Comments