Full Style

>

ఫిస్టులా , Fistula in Ano,భగంధరం వ్యాధి

కొన్ని వ్యాధులు కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తాయి. అలాంటి వాటిలో ఫిషర్, ఫిస్టులా (భగందరం), పైల్స్ (అర్శమొలలు), ఆబ్సిస్ (Abscess-చీము గడ్డ) మలద్వారంలో వచ్చే నాలుగు ప్రధాన సమస్యలు. కాకపోతే, ఈ నాలుగింటిలోనూ స్వల్పమైన తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక వ్యాధిని మరో వ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. కాకపోతే నాలుగింట్లో ఏ వ్యాధి వచ్చినా చాలా మంది అర్శమొలలే అనుకుంటారు.
ఫిస్టులా:
ఈ వ్యాధిని కొందరు ''లూటి'' అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు.''భగంధరం'' వ్యాధి అని కూడా అంటారు . మలవిసర్జన మార్గము ప్రక్కన ఎటో ఒకవైపు కురుపు ఏర్పడి అది పెరుగుతూ పోయి లోపల పెద్దపేగు చివర భాగములో రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. బయటి చర్మము మరియు లోపల ప్రేగుకు రెండువైపులా రంధ్రము ఏర్పడడాన్ని ఫిస్టులా అంటారు.  ఫిస్టులా అన్నది ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్య. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకూ ఖచ్చితముగా తెలియదు. ఇకపోతే మలబద్ధకం వల్ల అంతకు ముందే ఉన్న ఫిస్టులా సమస్య ఎక్కువవుతుందే తప్ప మలబద్ధకం వల్ల ఫిస్టులా రాదు. అలాగే దూరప్రయాణాలు, మాంసాహారం, మసాలా పదార్థాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. మలద్వారం చుట్టూ గడ్డలు వస్తాయి. తరువాత చీము పడుతుంది. ఈ సందర్భంలో సరైన చికిత్స చేయకపోవడం వల్ల భగంధరం ఏర్పడుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాల్లో చేసే శస్త్ర చికి త్స వల్ల ఫిస్టులా సమస్య ఎప్పుడూ పూర్తిగా పోదు. కొంత కాలం ఉపశమనంగా ఉన్నా కొన్నాళ్లకు మళ్లీ ఆ సమస్య మొదలవుతుంది. ఎక్కువ కాలం ఈ సమస్య ఇలాగే కొనసాగితే అక్కడ ఏర్పడిన చీము పేగుల్లోకి కూడా వెళ్లి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.

పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు తక్కువ గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.
ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.్

ప్రేరేపించే కారణాలు :
జీర్ణవ్యవస్థలోని లోపాలు, ఆ కారణంగా వచ్చే మలబద్ధకం సమస్యే ప్రధాన కారణం.
ఆహారంలో పీచుపదార్థాలు తక్కువగా ఉండడం,
నీరు తక్కువగా తాగడం,
శరీర శ్రమ లేకపోవడం,
స్థూలకాయం,
ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం,
గంటల పర్యంతం వాహనాలు నడపడం
గర్భంలోని శిశువు బరువు కారణంగా కూడా కొంత మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటారు.
పెద్ద వ్యవధి లేకుండా వెంట వెంట ప్రసవాలు జరిగినప్పుడు .

లక్షణాలు

నొప్పి,
రక్తస్రావం,
చీము-జిగురు పడటం,
దురద
ఇవే ప్రధానంగా కనిపించినా మరి కొన్ని ఉప లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో
జీర్ణక్రియ, విసర్జన క్రియ సరిగా లేకపోవడం.
ఆహారం మీద ఆసక్తి లేకపోవడం,
కడుపు ఉబ్బరం,
నోటినుంచి మలద్వారందాకా మంటగా ఉండడం,
కడుపులో శబ్దాలు రావడం,
బరువు తగ్గడం,
తేన్పులు రావడం,
రక్తహీనత ఏర్పడటం,
కళ్లు తిరిగినట్లు అనిపించడం,
వ్యాధి నిర్ధారణ :
చికి్త్సకు ముందు వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యము. దానికోసము -- ట్రాన్స్ యానల్ స్కాన్‌, ఫిస్టులోగ్రామ్‌, యం.ఆర్.ఐ.ఫిస్తులా, లాంటి పరీక్షలు చేసి ... కాన్సర్ కాదని బలపడిన తరువాత ముందుకు సాగాలి.
చికిత్స :
ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా హైరానా పడే వ్యక్తులో దురదలు పెట్టే వ్యాధులు ఎక్కువగానే కనిపిస్తాయి. చాలారకాల చర్మవ్యాధులు మానసి కంగా నలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా బహిర్గతమవు తాయి. ఈ తరహా సమస్యలున్నప్పుడు కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు కూడా చికిత్స చేయాల్సిఉంటుంది.

అల్లోపతి : నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen , diclofenac, aceclofenac) వాడాలి . ఇన్‌ఫెక్షన్‌ అయి చీము , రసి కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్ (ciprofloxin +ornidazole) వాడాలి.
ఏమీ చెయ్యకుండా ఉండడము : రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .
ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్‌ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.
సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .

ఆయుర్వేదము : క్షారసూత్ర ప్రక్రియ ద్వారా క్షార సూత్ర వైద్య ప్రక్రియతో భగంధరం దూరం అవుతుందని ఓరుగల్లు నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎంవిడి ప్రసాద్‌ చెప్పారు. దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,
మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,
మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.
మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.
ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.
మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవసరం.

Post a Comment

2 Comments

  1. Very useful and needed health tips. Thank you for sharing this blog
    For more information on fistula treatment kindly visit the site
    fistula treatment in coimbatore
    painless fistula treatment in coimbatore

    ReplyDelete
  2. Thank you for sharing valuable content with us , it was really helpful content. if you are looking Best Anal Fistula treatment in Kamla nagar then you can contact for all kinds of Gastro, fissure, fistula and piles problems.

    ReplyDelete