హంటా వైరస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వైరస్ వ్యాధులు లేదా వైరస్ల వల్ల మనుషుల్లో వచ్చే-- సాధారణ వ్యాదులలో జలుబు , ఫ్లూ , మశూచి ,చికెన్ పాక్స్ , చికెన్ గున్యా, డెంగూ జ్యరం ముఖ్యమైనవి.
ప్రాణాంతకమైన ఎబోలా , ఎయిడ్స్ , ఏవియన్ ఫ్లూ , రేబిస్ , వైరల్ హెపటైటిస్ , జపనీస్ ఎన్సెఫలైటిస్ మరియు సార్స్ కూడా వీటి ద్వారానే కలుగుతాయి. వైరస్లకుండే వ్యాధి కలిగించగలిగే లక్షణాన్ని పోల్చుకోవటానికి విరులెన్స్ అనే పదాన్ని వాడతారు. నాడీసంబంధ వ్యాధులకు ఏమయినా వైరస్లు కారకాలా అనేది ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది. మల్టిపుల్ స్క్లీరోసిస్ వంటివి. కాన్సర్ వ్యాధిని కలుగజేసే వైరస్ లూ ఉన్నాయి ఉదా: మానవ పాపిల్లోమా వైరస్.
హంటా వైరస్ : ఇవి ఆర్.ఎన్.ఎ. రకము వైరస్లు .Bunyaviridae ఫామిలీ చెందినవి. హంటర్ వైరస్ అనే కంప్యూటర్ వైరస్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు.
డెంగ్యూ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని.. మరో డేంజర్ వైరస్ - హంటా వైరస్ - టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది... దీని లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయి.. ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ వైరల్ డ్రగ్ తీసుకుంటే ప్రమాదం లేదు. ఈ ప్రమాదకర రోగకారక వైరస్ ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది .. ఇది ప్రమాదకరమైన hemorrhagic fever, తద్వారా Renal syndrome , pulmonary syndrome లను కలుగజేస్తాయి.
ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి... ఈ హంటర్ వైరస్ లక్షణాలు హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిలో బయటపడ్డాయి. రాష్ట్రంలో ఇది మొదటి కేసని డాక్టర్లు చెబుతున్నారు. మొదట డెంగ్యూ జ్వరంగా భావించి చికిత్స చేసిన డాక్టర్లు... అది కాదని తేలడంతో ముంబయిలోని ల్యాబొరేటరీలో రోగి రక్త నమూనాల పరీక్షలు చేయించగా... హంటా వైరస్‌గా నిర్థారణ అయ్యింది.. ప్రాథమిక దశలోనే ఈ వైరస్‌ను గుర్తించకపోతే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు...
హంటా వైరస్ లక్షణాలు...----
తీవ్ర జ్వరం వస్తుంది----
ఉన్నట్టుండి కండరాల నొప్పి----
ఆ తర్వాత B.P. తగ్గుతుంది----
మూత్రపిండాల పనితీరులో మార్పులు , నీరుడు తక్కువగా అవడం , తరువాత ఫేజ్ లో నీరుడు ఎక్కువగా పోవడము , మూత్రపిడాలు పాడవడము .
ఊపిరితిత్తుల సంబంధించి .. ఊపిరి తీసుకోవడములో ఇబ్బంది, గుండె వేగముగా కొట్టుకోవడము , దగ్గు ఎక్కువగా బాదించడము జరిగి cardio- vascular shock కి గురిఅవడము జరుగును.
హంటా వైరస్ వ్యాప్తి ఎలా....
దక్షిణ కొరియా లో " హంటాన్ నది ప్రాంతములో గుర్తించడం వలన ఈ వైరస్ కి ఆ పేరు వచ్చినది. 1978 లో Ho-Wang Lee మరియు అతని సహచరులు కనుగొన్నారు. మొదటిలో ఈ వైరస్ వల్ల కలిగిన వ్యాది ని Korean hemorrhagic fever అనే పేరు ఉండేది. ఎలుకల నుంచి వైరస్ వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం.. మూత్రం, మలం ద్వారా వైరస్ విస్తరణ జరుగును . ఎలుకలు కరడము వలన వచ్చేఅవకాశమున్నది. ఈ వ్యాధి ఒకరినుండి ఒకరికి వ్యాప్తిచెందును.(Human to human transmission).
ముందు జాగ్రత్త చర్యలు... ఇళ్లు, పొలాల్లో ఎలుకలు లేకుండా
చూసుకోవాలి.. వాడుకలో లేని కిటికీలు, తలుపులు తెరచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి స్వచ్ఛమైన నీటిని తాగాలి. వ్యాక్యూమ్ క్లీనర్ వాడేటప్పుడు ముఖానికి ముసుగు వేసుకోవాలి జ్వరం ఏమాత్రం తగ్గకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి...
ఈ వైరస్ చరిత్ర : korean యుద్దము లో చాలా మంది అమెరికన్ సైనికులు రోగగ్రస్తులైనారు ..ఎంతోమంది చనిపోయారు . యుద్దం అనంతరము మనుషులలో ఈ వైరస్ కనిపెట్టడానికి సుమారు 25 సంవత్సరాలు పట్టింది. దక్షిణ కొరియా " హొ-వాంగ్ లీ " 1978 లో కనిపెట్టగలిగారు. 1993 లో
అమెరికాలో ఇది విజృంభించి చాలా గందరగొళం సృష్టించినది. ఇది చాలా దేశాలలో వ్యాప్తిచెందినది. ముఖ్యము గా చైనా, కొరియా , రస్యా,ఆర్జెంటైనా, చిలీ, బ్రెజిల్ , అమెరికా , ఇండియా మున్నగునవి.
చికిత్స : హంటా వైరస్ కి స్పెసిఫిక్ గా యాంటివైరల్ మందులు లేవు . ఈ వ్యాది ఉన్న వారిని హాస్పిటల్ లో ఉంచి ..
ఆయాసము నకు ... ఆక్షిజన్ ఇవ్వడము ,
జ్వరానికి ... జ్వరము తగ్గేందుకు మందులు ,
నీరు ఎక్కువగా తాగించడము ,
మిగతా జబ్బులేవీ సోకుండా పెన్‌సిలిన్ రకానికి చెందిన యాంటిబయోటిక్స్ ఇవ్వడము ,
డయాలిసిస్ అవసరాన్ని బట్టి చేయడము .
రొటీన్ యాంటివైరల్ మందులు .. ఉదా: Acyclovir, వాడుతున్నారు.
వి్శ్రాంతి తీసుకోవడం వలనే ఈ వ్యాది నుందు విముక్తి పొందుతారు.
0 Comments