Full Style

>

ఆరోగ్య చిట్కాలు -రహస్యాలు , Health tips & tricks

ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే పాలు, చేపలు వంటి ఆహారం తీసుకునేవారికి చత్వారం వచ్చే ముప్పు తక్కువ.
తమ శరీర సౌష్ఠవం, అందచందాల గురించి సానుకూల దృక్పథంతో ఉండే మహిళలు మిగతావారితో పోలిస్తే చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించగలరని ఒక అధ్యయనం.
తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.
బాదం నూనె చక్కటి మాయిశ్చరైజర్‌. క్రమం తప్పకుండా దాంతో మర్దన చేస్తే పొడిచర్మం సున్నితంగా మారుతుంది.
నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుంటే... ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.
ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో కోరికలు రేకెత్తిస్తాయట. ఆ ఫ్లేవర్‌ ఉన్న అత్తరును స్త్రీలు తమ మెడమీద చల్లుకుంటే పురుషులు వారి కొంగు పట్టుకు తిరుగుతారు. (స్మెల్‌ అండ్‌ టేస్ట్‌ రీసెర్చి ఫౌండేషన్‌, చికాగో).
ఎరుపు రంగు ప్రేమకూ శృంగారానికీ చిహ్నం. ఆ దుస్తుల్లో ఉన్న మహిళల వైపు మగవారు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఎక్కువ. గర్ల్‌ఫ్రెండ్‌ ఎర్రటి వస్త్రాలు ధరించి వచ్చినరోజు అబ్బాయిలు వారిని సంతోషంగా ఉంచేందుకు మిగతా రోజుల్లో కన్నా ఎక్కువగా ఖర్చుపెడతారని అనేక పరిశోధనల్లో తేలింది.(జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ)
అండోత్పత్తి సమయంలో అమ్మాయిలకు... కండలు తిరిగిన మగాళ్లే నచ్చుతారు. మిగతా సమయాల్లో కాస్త సున్నితంగా ఉండే పురుషులు (మెట్రోసెక్సువల్‌) నచ్చుతారు. ఇది సృష్టిధర్మం. ఆరోగ్యవంతులైన బలమైన పిల్లలు పుట్టాలంటే అలాంటి పురుషులే కావాలనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో తనను ప్రేమగా సున్నితంగా చూసుకునే మగవారిని మాత్రమే ఇష్టపడతారు. (నేచర్‌ జర్నల్‌)
ఆందోళన, ఒత్తిడి... వీటిలో ఏది ఎక్కువైనా శరీరంలో అడ్రినలిన్‌ ఉత్పత్తి అధికం అవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి అమ్మాయి అయినా మగవారికి అమిత సౌందర్యరాశిలా కనపడుతుంది. (జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ అండ్‌ సైకాలజీ)
దృఢమైన ఛాతీ విశాలమైన భుజాలూ ఉండే మగవారు మహిళల్ని ఇట్టే ఆకర్షిస్తారు. ఇలాంటి వారిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అధికంగా ఉంటుందని అధ్యయనాల ఫలితం. ('సైజ్‌ మ్యాటర్స్‌' గ్రంథం)
తన తల్లి ముఖాన్ని పోలి ఉండే మహిళలను మగవారు ఎక్కువగా ఇష్టపడతారు. 'పోలిక' అంటే అచ్చుగుద్దినట్టు కాదు, ఎముకల నిర్మాణం, ముఖ సౌష్ఠవం... ఇవి ఒకేలా ఉంటే చాలు. ఇలాంటి పోలికను 'సెక్సువల్‌ ఇంప్రింటింగ్‌' అంటారు. (ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద రాయల్‌ సొసైటీ)
మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెస్ట్రన్‌ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
రోజుకు కనీసం అరవైగ్రాముల పెరుగు తినేవారిలో చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
అధిక కొవ్వుతో బాధపడేవారు అవిసెనూనెను ఆహారంలో భాగం చేసుకుంటే... శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రతగలిగిన కొవ్వు(ఎల్‌డీఎల్‌) త్వరగా కరిగిపోతుంది.
అలా తింటేనే...క్యారెట్లలో ఉండే ఫాల్‌కారినాల్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ... వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తరిగినవాటితో పోలిస్తే పూర్తి క్యారెట్‌ను ఉడకబెట్టినప్పుడు ఫాల్‌కారినాల్‌ 25శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. క్యారెట్లను తరిగి ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. క్యారెట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచినిచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయట.
తలకు రాసుకునే నూనె పరిమాణంలో తేనె తీసుకుని కుదుళ్లకు అంటేలా మర్దన చేయండి. అరగంట తర్వాత పొడిజుట్టుకు ప్రత్యేకించిన షాంపూతో స్నానం చెయ్యండి. వారానికొకసారి ఇలా చేస్తే... బిరుసుగా ఉండే జుట్టు మళ్లీ జీవంతో నిగనిగలాడుతుంది.
* కీవోథెరపీ చేయించుకునే క్యాన్సర్‌ బాధితులు థెరపీకి మూడు రోజులు ముందూ తర్వాతా ఆహారంలో కొద్దివోతాదులో 'అల్లం' తీసుకుంటే మంచిది. కీవోథెరపీ వల్ల కలిగే అలసటను అల్లం దాదాపు 40శాతం దాకా తగ్గిస్తుంది.
* రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు.
* చెవిపోటు వచ్చినప్పుడు చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లిరసం వేస్తే కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
* మిక్సీ నుంచి మసాలా వాసన వస్తుంటే ఎండిన బ్రెడ్‌ముక్కలు వేసి పొడి చెయ్యండి. వాసనలు మాయం.
అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.అవును ఇది పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది.
గొంతు ఇన్‌ఫెక్షన్‌కి వేడిపాలల్లో పసుపు కలిపితే.. మంచిది.పసుపులో యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇక వేడిపాలు.. పసుపు సులువుగా నొప్పిని నివారిస్తాయి. దాంతో శరీరానికి సాంత్వన.మిగతా సమయంతో పోలిస్తే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.ఇందుకు ప్రత్యేకమైన ఆధారాలు లేకపోయినా.. నిపుణులు ఏమంటారంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలనేది వాస్తవం. అయితే ఏదిపడితే అది కాకుండా.. వేడివేడి సూప్‌లు.. విటమిన్‌ ఇ ఉండే ఆహారపదార్థాలు.. ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
తలనొప్పిని దూరం తగ్గించేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి.వేడి కారణంగా డిహైడ్రేషన్‌ సమస్య వచ్చి.. తద్వారార తలనొప్పి బాధిస్తే.. మాత్రమే ఈ చిట్కా ఫలిస్తుంది. విద్యార్థులు పాలు కలపని కాఫీ తాగితే.. రాత్రిళ్లు నిద్ర రాదు.కెఫీన్‌ నిద్ర పట్టకుండా చేస్తుంది. పైగా దీని ప్రభావం 20 గంటల దాకా ఉంటుంది. ప్రయత్నించవచ్చు. అయితే ఓ మాట. అతిగా తాగితే అనర్థమే. ఎందుకంటే.. మీకూ నిద్ర అవసరమని మరవకండి.
దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది.లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు.. మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం.. లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే.. దాని తాలూకు ఇన్‌ఫెక్షన్‌ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.

Post a Comment

0 Comments