Full Style

>

Heart Valves-గుండెకు తలుపులు...

Heart Valves-గుండెకు తలుపులు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


--నదీ ప్రవాహానికి ఆనకట్టలు కావాలి. వాటి ద్వారా నీరు వృథా కాకుండా అవసరమైనప్పుడు, తగినంత మేర ప్రవహించేందుకు వీలుంటుంది. అదేవిధంగా శరీరంలో రక్తం ఇష్టం వచ్చినట్టు ప్రవహించకుండా క్రమ పద్ధతిలో పంపింగ్ చేయడానికి గుండెలో ఉన్న తలుపుల లాంటి నిర్మాణాలనే కవాటాలు లేదా వాల్వులు పనిచేస్తాయి. వాటిలో లోపం ఎదురైతే రక్తవూపసరణ అస్తవ్యస్తం అవుతుంది.

శరీరంలో నిరంతరం ఎటువంటి విశ్రాంతి లేకుండా పనిచేసే పంపింగ్ యంత్రం గుండె. నాలుగు గదులతో కూడిన గుండెలో ఒకవైపు నుంచి చెడు రక్తం, మరోవైపు నుంచి మంచి రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక గది నుంచి మరో గదికి రక్తం ప్రయాణించడాన్ని కంట్రోల్ చేసేదే కవాటం. రక్తం తిరిగి వెనక్కి రాకుండా ముందుకే ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీర భాగాల నుంచి సేకరించిన రక్తం గుండె గదుల నుంచి రక్తనాళాలకు, రక్తనాళాల నుంచి గదుల్లోకి నిరంతరం ఒక క్రమ పద్ధతిలో ప్రయాణించడానికి తోడ్పడేవే కవాటాలు.

కవాటాలు.. రక్తసరఫరా..
- గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్, ఆయోర్టిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్.
- మిట్రల్, ట్రైకస్పిడ్ కవాటాలు కర్ణిక, జఠరికల మధ్య ఉంటాయి. కర్ణికల నుంచి జఠరికల్లోకి రక్తం ప్రయాణించడానికి ఇవి సహకరిస్తాయి. మిట్రల్ కవాటం ఎడమ కర్జిక, జఠరికల మధ్య ఉంటే, ట్రైకస్పిడ్ కవాటం గుండె కుడివైపు కర్ణిక, జఠరికల మధ్య ఉంటుంది.
- ఆయోర్టిక్ కవాటం ఎడమ జఠరిక, ఆయోర్టా మధ్య ఉంటుంది. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం ఆయోర్టాలోకి వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది.
- పల్మనరీ కవాటం కుడి జఠరిక, పుపుస సిరల మధ్య ఉంటుంది. జఠరిక నుంచి  చెడు రక్తం పుపుస సిరలోకి వెళ్లడానికి ఇది తోడ్పడుతుంది.
- ఆ నాలుగు వాల్వ్‌లోనూ ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్), వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్‌)
 కారణాలు
- కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్.
- రుమాటిక్ హార్ట్ డిసీజెస్.
- జన్యుపరమైన కారణాలు. కొందరిలో పుట్టుకతోనే (కంజెనిటల్) కవాటాలలో లోపాలు ఏర్పడవచ్చు.
- కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజనరేటివ్) వచ్చే సమస్యలుగా కూడా రావచ్చు.
లక్షణాలు
రక్త ప్రసారానికి ద్వారాలు తెరిచే కవాటాల్లో సమస్యలు వస్తే శరీరానికి తగినంత రక్తాన్ని తగిన సమయంలో అందించే పనిలో గుండె ఫెయిల్ అవుతుంది. అందుకే రకరకాల సమస్యలు వస్తాయి.
- గుండె వైఫల్యం వల్ల ఆయాసం
- పొడి దగ్గు
- పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం
- గుండెదడ.
- బలహీనంగా అయిపోవడం, ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
- సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దుష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.
- ట్రైకస్పిడ్ కవాటం లీక్ సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది.
- మిట్రల్ వాల్వ్ సన్నబడితే రక్తపు వాంతులు కావచ్చు.
- ఆయోర్టిక్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు.

కొత్త నిర్ధారణలు...
కవాటాల సమస్యలను కచ్చితంగా నిర్ధారించడానికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పద్ధతి ట్రాన్స్ ఈసోఫిజియల్ కార్డియోక్షిగామ్. ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫిజియల్ ఎకో కార్డియోక్షిగామ్ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం కవాటాన్ని మార్చవచ్చు.

కవాట మార్పిడి
కవాటాల్లో ఏర్పడిన సమస్యలకు చాలావరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మిట్రల్ వాల్వ్ సన్నబడ్డపుడు బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారినా లేదా లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్వ్‌లోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటపుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నదే పరిష్కారం. కవాటాన్ని రీ ప్లేస్ చేసే క్రమంలో మెటల్‌వాల్వ్, టిష్యువాల్వ్ అనే రెండు రకాల వాల్వ్‌లను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్‌ను ఉపయోగించినపుడు ''ఎసివూటోమ్'' అనే మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. దీన్ని జీవితాంతం వాడాల్సిందే. ఈ మందులు రక్తాన్ని పలుచబరుస్తాయి. టిష్యు కవాటాలు జంతువుల కండరాలతో చేసినవి. టిష్యు వాల్వ్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబర్చే మందు ఎసివూటోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కవాటం 15 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

ఆధునిక చికిత్స
ప్రస్తుతం కవాట సమస్యలకు సర్జరీ మంచి పరిష్కారాన్నే చూపిస్తుంది. కానీ సర్జరీ కంటే కవాటాన్ని మరమ్మత్తు చేసే చికిత్సకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండెలోని కవాటాన్ని మార్చి కొత్తదాన్ని అమర్చడం కన్నా ఉన్నదాన్ని మరమ్మత్తు చేయడం ఎక్కువ సులువైన, మెరుగైన పద్ధతి.
అందుకే వైద్యనిపుణులు రిపేర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా సహజమైన కవాటాన్ని మరమ్మత్తు చేసినప్పుడు ఎసివూటోమ్ లాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మిట్రల్, ట్రైకస్పిడ్ కవాటాలకు సంబంధించిన సమస్యలైతే వాటిని మరమ్మత్తు చేయడమే కరెక్ట్. దీనివల్ల ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments