Full Style

>

Hepatic Encephatopathy -Telugu



హెపాటిక్ ఎన్‌సెఫలోపతి

తీవ్రంగా దెబ్బ తిన్న కాలేయం వలన మెదడు మందగించి సరిగ్గా పని చేయనందున కలిగే అయోమయ స్థితినుండి మొదలుకొని కోమా లోకి వెళ్లే వరకూ ఉండే పరిస్థితిని హెపాటిక్‌ ఎన్‌సెఫలోపతి అంటారు. ఈ పరిస్థితి లివర్‌ సిర్రోసిస్‌ రోగుల్లో తరచుగా వస్తుంది. కాని ఏ కారణంగానైనా, రోగి హెపాటిక్‌ ఫెయిల్యూర్‌కు లోనైనప్పుడు ఈ పరిస్థితి ఎదురు కావచ్చు.

కారణాలు
లివర్‌ ఫెయిల్యూర్‌, ''పోర్టోసిస్టమిక్‌ షంటింగ్‌ ఆఫ్‌ బ్లడ్‌'' పై కారణాల వలన మనిషి మెదడులోని జీవ రసాయన చర్యలలో ఇబ్బందులు ఏర్పడటం వలన అమ్మోనియా, గామా అమైనోబ్యుటిరిక్‌ యాసిడ్‌ వంటి పదార్థాలు రక్తంలో ఎక్కవ కావడం వలన, ఫాల్స్‌ న్యూరోట్రాన్స్‌మిటార్‌ అయిన అక్టోపమిన్‌, అమైనోయాసిడ్‌, మెర్‌క్యా ప్టెన్స్‌, ఫ్యాటి యాసిడ్స్‌ వలన ఈ పరిస్థితి రావడం జరుగుతుంది.

ఉత్ప్రేరకాలు
యురీమియా - తనంతట రావడం, డైయూరిటిక్‌ మందుల వలన రావడం,
మందులు - సెడెటివ్స్‌, యాంటి డిప్రెసెంట్స్‌, హిప్నాటిక్స్‌,
పేగుల నుండి రక్త స్రావం జరగడం వలన,
ఆహారంలో ఎక్కువ ప్రొటీన్‌ శాతంతో తినడం వలన,
మలబద్ధకం వలన,
ప్యారాసెంటస్‌ (3 నుంచి 5 లీటర్లకు పైగా నీటిని పొట్టలోనుంచి -అసైటిస్‌- తీయడం వలన),
శరీరంలో పొటాషియం శాతం తగ్గడం వలన,
ఇన్‌ఫెక్షన్స్‌ వలన,
ట్రామా (శస్త్రచికిత్సతో కలిపి),
పోర్టాసిస్టమిక్‌ షంట్‌ శస్త్ర చికిత్సల వలన,

వ్యాధి లక్షణాలు
వ్యాధి ప్రారంభంలో లక్షణాలు చాలా తక్కు వగా ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనిషి ఉదాసీనంగా కనిపిస్తాడు.
దీనితో భ్రమ లేదా కలవరపడటం, ఏకాగ్రత దెబ్బతినడం, తానెక్కడున్నాడో, సమయమెంత అయిందో చెప్పలేకపోవడం, స్పృహ మందగిం చడం, మాట తడబడటం వంటి లక్షణాలతో మొదలై కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. కొంతమందిలో ఫిట్స్‌ కూడా రావచ్చు.
రోగి శ్వాస తీసుకున్నప్పుడు ఒకలాంటి తీపి పదార్థాలు బూజు పట్టిన లేదా మగ్గిపోయిన ప్పుడు వచ్చే విధమైన వాసన వస్తుంది. దీనిని ఫీటార్‌ హెపాటికస్‌ అంటారు.

దీర్ఘకాలికంగా హెపాటిక్‌ ఎన్‌సెఫలోపతికి లోనైన రోగుల్లో చిన్నమెదడు సరిగ్గా పని చేయ కపోవడంతో మనిషి సరిగ్గా నడవలేకపోవడం, బాలెన్స్‌ తప్పిపోవడం వంటివి జరుగుతాయి. పార్కిన్‌సోనిజంలాంటి పరిస్థితి, కాళ్లు పడిపోవడం, డిమెన్షియా వంటి పరిస్థితులు రావచ్చు. కాని చాలా అరుదు.

పరీక్షలు
ఇఇజి - సాధారణంగా ఈ పరిస్థితి రోగిని పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది.
కొన్ని సందర్భాలలో అనుమానం వచ్చి నప్పుడు ఇ.ఇ.జి. అనే పరీక్ష చేయాల్సిన అవ సరం కలుగుతుంది.
ఆర్టీరియల్‌ అమ్మోనియా పరీక్ష (ధమనుల నుంచి తీసిన అమ్మోనియా శాతం కోసం పరీ క్షించడం)
బ్లడ్‌ యూరియా, బ్లడ్‌ సుగర్‌, సీరం క్రియాటినిన్‌, సీరం ఎలెక్ట్రొలైట్స్‌, సీరం ప్రొటీన్స్‌ శాతం, ప్రోత్రాంబిన్‌ టైమ్‌,
ఎల్‌ఎఫ్‌టి,
ఎండోస్కోపి,
అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ (కడుపు పరీక్ష),
బ్లడ్‌ కల్చర్‌ (కొన్ని సందర్భాలలో),

చికిత్స
ఎన్‌సెఫలోపతి అనే పరిస్థితి లివర్‌ సిర్రోసిస్‌ రోగుల్లో సాధారణంగా వస్తుంది. రోగి పరిస్థితి తుది దశకు చేరనంత వరకూ చికిత్స ద్వారా కోలుకుంటాడు.రోగి ఈ పరిస్థితికి రావడానికి ఉత్ప్రేరక కార ణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకొని, వాటికి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఆహారంలో ప్రొటీన్‌ రోజుకు 20 గ్రాముల కంటే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. గ్లూకో జ్‌ను రోజుకు 300 గ్రాములు నోటి ద్వారా లేదా రోగి పరిస్థితి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సిరల ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. రోగి పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆహా రంలో ప్రొటీన్‌ను ప్రతి 48 గంటలకు రోజుకు 10 నుంచి 20 గ్రాములు పెంచుతూ, చివరకు రోజుకు 40 నుంచి 60 గ్రాముల వరకూ పెంచడం జరుగుతుంది. లివర్‌ సిర్రోసిస్‌ రోగు లకు రోజుకు ఇంతకుమించి ప్రొటీన్‌లు ఇవ్వడం జరుగదు.

లాక్టులోజ్‌, లాక్టిటాల్‌, నియోమైసిన్‌, ఎల్‌- ఆర్నితిన్‌లాంటి మందులను అవసరాన్నిబట్టి తగు మోతాదులో ఇచ్చి చికిత్స చేస్తారు.లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ - దీర్ఘకాలికంగా లేదా హెపాటిక్‌ ఎన్‌సెఫలోపతి మందుల ద్వారా ప్రయత్నం చేసినా పరిస్థితి మెరుగుపడనప్పుడు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఈ పరిస్థితులను నియంత్రించడానికి ఫిజిషియన్‌ను సంప్రదిం చాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments