Full Style

>

హెపటైటిస్ వైరస్ ,Hepatitis virus,వైరల్ హెపటైటిస్,Viral Hepatitis

-హెపటైటిస్ వైరస్ ,Hepatitis
virus,వైరల్ హెపటైటిస్,Viral Hepatitis- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలక కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు. వైరస్ అనగా జీవజాలంపై దాడి చేసే అతి సూక్ష్మమైన కణాలని అర్థం.
హెపటైటిస్ వైరస్లు (Hepatitis virus) ఒక వ్యాధికారక వైరస్ ల సమూహం. ఇవి అన్నీ వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) వ్యాధిని కలుగజేస్తాయి. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్‌ ఎ,బి,సి,డి, ఇ,ఎఫ్‌ ఇలా ఆరురకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి.

హెపటైటిస్‌-ఏ(HAV) :

ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్‌ రూట్‌' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపుడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్‌-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.


హెపటైటిస్‌-బి(HBV):

ఇదిహెపటైటిస్‌-ఏ కన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వేరొకరికి ఎక్కించినపుడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి. ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా.. ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.

ఎయిడ్స తదితరాలులా ఇది కూడా ఎలాంటి చికిత్స లేని వ్యాధికావటం ఆందోళన కలిగించే విషయం, దీనికి నివారణాచర్యలు ముఖ్యమైనవి. కలుషిత సూదులు గుచ్చుకున్నా, వ్యాధికారకులతో లైంగిక సంపర్కం జరిపినా 14 రోజుల్లోగా వ్యాక్సిన్‌ని వేయించు కోవటం ద్వారా వ్యాధి కారకాలను నిలువరించవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో పాటు వైద్యుల సూచనల మేరకు ఇమ్యూనోగ్లోబిలిన్‌ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాధి కారకాల గర్భిణీకి జన్మించిన బిడ్డకు పుట్టగానే వ్యాక్సిన్‌ ఇప్పించడం ద్వారా చాలామేరకు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్) సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-బి టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

హెపటైటిస్‌-సి(HCV) :

ఇది హెపటైటిస్‌-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్‌-బి కనీసం వ్యాక్సిన్‌ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్త లని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్‌-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్‌ సిరోసిస్‌గా, లివర్‌ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు. మిగతా రకాలు ->

హెపటైటిస్‌-డి (HDV)
హెపటైటిస్‌-ఇ (HEV)
హెపటైటిస్‌-ఎఫ్ (HFV)

వైరల్ హెపటైటిస్ లక్షణాలు :

ఈ వైరస్‌ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వికారంగా ఉండటం, విరేచనాలు కావటం, ఆకలి లేకపోవటంతో పాటు మూత్రం పసుపు వర్ణంలో నీరుడు పోయటం, కళ్లు, నాలుక పచ్చగా మారిపోతుంది. చేతులు, కాళ్ల గోర్లు కూడా పచ్చగా మారుతుంటాయి. కాలేయ భాగం విపరీతమైన నొప్పిగా మారుతుంది. కాలేయం కొద్ది కొద్దిగా పెరుగుతుంటుంది. దీని తో పాటు ప్లీహం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తాయి. నడి చేందుకు కూడా వెసులు బాటు ఇవ్వని కీళ్ల నొప్పులు, మలం ద్వారా తెల్లని పదార్ధం శరీరం నుండి బైటకు రావటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ

పరీక్షలివి...
ఎలీషా టెస్ట్ ద్వారా వైరల్ హెపటిటిస్ పొజిటివ్ లేదా నెగటివ్ గా తెలుసుకోవచ్చును .
ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కాలేయ పరిస్ధితిని నిర్ధారించుకోవచ్చు. మూత్ర పరీక్షలు చేస్తే అందులో బైల్‌ పింగ్మెంట్స్‌ కనిపిస్తాయి. అలాగే రక్త పరీక్షలలో సీరం ఎంజైమ్స్‌, సీరం బలురూబిన్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక లివర్‌ ఫంక్షన్‌ టెస్టుల్లోనూ మన కాలేయంలో జరిగిన పరిణా మాలను నిర్ధారించుకోవటమే కాకుండా లివర్‌ మార్కర్స్‌ ద్వారా వైరస్‌ కారకాలను ఇట్టే గుర్తించి నిపుణులైన వైద్యుల సలహా సూచనల మేరకు తగిన వైద్యాన్ని చేయించుకుంటే హెప టైటిస్‌-ఏ ని 4 వారాలలోనే తగ్గించుకోవచ్చు. హెపటిటిస్ -బి, సి లను అంతతేలికగా నయం చేయలేము .

జాగ్రత్తలిలా...

హెపటైటిస్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్‌ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గానూ గ్లూకోజ్‌తో పాటు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అడపా దడపా తాగించాలి.

అవసరమైతే.. నరాల ద్వారా కూడా సిలెన్‌ రూపంలో గ్లూకోజ్‌ ఎక్కిం చాల్సి ఉంటుంది. అలాగే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పళ్లను గానీ, టాబ్లెట్లని ఇవ్వాలి. అలాగే అవసరం మేరకు విటమిన్‌ సి ఇంజక్షన్‌ ఇవ్వాల్పి ఉంటుంది.

ఇక హెపటైటిస్‌ సోకిన వ్యాధి గ్రస్తులలో విటమిన్‌ బి తక్కువగా ఉండటం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీనిని నుండి కాపాడుకునేందుకు విటమిన్‌ బి టాబ్లెట్లని ఎక్కువ మోతాదులో ఇవ్వాలి.

శరీరంపై దద్దుర్లు, దురదల వస్తే 'కొలిస్టరిమిన్‌'ని ఇవ్వాల్సి ఉంటుంది. వీలైనంత వరకు విటమిన్‌- కెని కూడా ఇవ్వటమే కాకుండా మల్టీవిటమిన్‌ టాబ్లిట్లు మింగించాలి. ఇన్‌ఫిక్షన్లు సోకితే నియోమైసిన్‌, ప్రెడ్సిసలోన్‌, మెట్రో నిడజాల్‌ మాత్రలు ఇవ్వాలి. కొన్ని రకాల మందులు కూడా శరీర తత్వాన్ని బట్టి ప్రభావం చూపి ఇన్‌ఫిక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం మరింతగా దెబ్బతింటుంది. అందుకే మందులు వాడేటపుడు నిపుణులైన వైద్యుల సలహా సూచలను ఖచ్చితంగా తీసుకో వాల్సిందే.ం


ఆహారం...
ఈ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి దూరంగా ఉంచాలి. ఆకలిగా ఉన్నపుడు అధిక ఆహారం ఇవ్వాలి. పళ్ల రసాలు, మజ్జిగ తదితరాలు ఎక్కువగా ఇవ్వటమే కాకుండా కూరగాయలు, పప్పుదినులు బాగా ఉడక పెట్టి ఇవ్వటంతో పాటు పౌష్టికాహరం ఇవ్వటం ద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకుంటారు.

Post a Comment

0 Comments