Full Style

>

ఐస్‌ థెరపీ, ice theraphy



మేని సౌందర్యాన్ని పెంపొందించడానికి... వేధించే మొటిమలను తొలగించడానికి... 'ఐస్‌ థెరపీ' మంచిదంటున్నారు సౌందర్యనిపుణులు.. అదెలానో చూద్దాం..

ఒక్కోసారి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అమ్మాయిలను తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సమస్యకు ఐస్‌ ముక్కలతో చెక్‌ పెట్టవచ్చు. మొదట ఐస్‌ను శుభ్రమైన వస్త్రంలో తీసుకోవాలి. చుబుకం మీద వలయాకారంలో మెల్లిగా రుద్దుతూ పోవాలి. మద్యమధ్యలో కాసేపు విరామమిస్తూ నెమ్మదిగా ముఖమంతా అప్త్లె చేయాలి. మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా ఒత్తిపెడుతూ ఐస్‌ ఉంచాలి. ఇలా ఓ క్రమపద్ధతిలో చేస్తే కొన్ని రోజులకు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతే కాదండోయ్‌ చర్మానికి ఇది మంచి యాంటీఏజింగ్‌ కారకంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు సౌందర్యనిపుణులు. ఐస్‌ను రుద్దడం వల్ల ముఖం శుభ్రపడి... కాంతిమంతంగా కనిపిస్తుంది.

ఒత్తిడికి ఉపశమనం.. ఒత్తిడితో తలనొప్పిగా ఉంటే ఐస్‌ను ముక్కలుగా చేసి వస్త్రంలో వేసి నుదురుమీద ఉంచాలి. కనురెప్పల మీదా కాసేపు ఉంచితే శరీరం, మనసు ఉత్తేజితమవుతాయి. ఈ ప్రక్రియనే 'ఐస్‌ థెరపీ' అంటారు. అయితే పదిహేను నిమిషాలకంటే ఎక్కువ సేపు ఈ థెరపీని చేయకూడదు. ముఖం పొడి బారాక తడి తువాలుతో సున్నితంగా తుడవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రుతుక్రమము లో కడుపు నొప్పి తగ్గదానికి ఐస్ తో పొత్తికడుపు ఒత్తాలి . నివారణ అవుతుంది .

ఐస్‌ సిద్ధమిలా.. సౌందర్య పోషణలో వాడే ఐస్‌ను ప్రత్యేకంగా తయారుచేసుకుంటే మేలు. ఇందుకోసం శుభ్రమైన ఓ మోస్తరు స్టీలుగిన్నె తీసుకోవాలి. దాన్నిండా నీరు నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. స్టీలుపాత్రలో తీసిన ఐస్‌ పెద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోయే సమస్య ఉండదు. గిన్నెలో ఉన్న ఐస్‌ను ట్యాప్‌కింద పెట్టి తొలగించి ఓ సారి శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించడం మేలు. ఇలా శుభ్రపరిచిన ఐస్‌ను చిన్న ముక్కలుగా వాడాలి. ఐస్‌ను నేరుగా ముఖం మీద రుద్దితే చర్మం కంది ఎర్రగా అయ్యే ప్రమాదం ఉంది. దూదిలోగానీ, మెత్తని వస్త్రంలోగానీ ఉంచి రుద్దాలి.

Post a Comment

0 Comments