Full Style

>

అజీర్ణము ,Indigestion


[GIT..+intestines.gif]
అజీర్ణము ,Indigestion- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తిన్నది సరిగా జీర్ణము కాకపోవడాన్ని , కడుపులొ గాస్ ఫార్మయి ఇబ్బంది కలిగించినపుడు , ఆహారము కడుపులో పులిసి మంట అనిపించునపుడు , అజీర్తి విరోచనాలు అవుతున్నపుడు , కడుపు ఉబ్బరము ,త్రేన్పులు రావడము .. అనిపించినపుడు ... మనకు తినంది సరిగా జీర్ణము అవలేదని అంటాము ... అదే అజీర్ణము . వ్యక్తిని బట్టి , తినే ఆహారము బట్టి , జీర్ణరసాలు ఊరడం బట్టి , శరీరము ఏదైనా వ్యాధి బట్టి జీర్ణ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది . అజీర్ణానికి మూల కారణము కనుగొని చికిత్స చేయవలది ఉంటుంది . తాత్కాలికము గా జీర్ణము అవడానికి అనేక మార్గాలు ఉన్నాయి .

మరి కొంత సమాచారము కోసము : జీర్ణము - అజీర్ణము

అజీర్ణానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు

1. పచ్చి అరటికాయను ఎండబెట్టి పొడిచేసి ఉప్పుతో 1 నుంచి 2 గ్రాముల పొడిని కలిపి సేవించిన అజీర్ణం తొగలగిపోవును.
2. బెల్లముతో శొంటిపొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము పోవును.
3. ఉప్పునీళ్లు త్రాగిన అజీర్ణం పోవును.
4. కరక్కాయల పొడి బెల్లం కలిపి సేవించచున్న అజీర్ణము నశించును.
5. అల్లం, జీలకర్ర సైంధవలవణము నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం సేవించిన అజీర్ణము తొలగిపోవును.
6. మర్రిచెక్క పొడిచేసిగాని కషాయం పెట్టిగాని సేవించిన అజీర్ణము పోవును.
7. సైంధవ లవణము అల్లము సమానంగా కలుపుకొని ఉదయం, సాయంత్రం 3 గ్రాములు భోజనములందు సేవించిన అన్నిరకముల అజీర్ణరోగములు నశించును.
సంబంధిత సమాచారం

Post a Comment

0 Comments