Full Style

>

నలుపు మచ్చల జ్వరము , Kalazaar fever, నలుపు మచ్చల జ్వరము


కాలాఅజార్ జ్వరము - నలుపు మచ్చల జ్వరము

నలుపు మచ్చల జ్వరము అంటే ఏమిటి ?


  • ఇలా చాలా మెల్లగా వ్యాపించే లేక వృద్ధి చెందే దేశీయ జబ్బు. దీనికి కారణం ప్రోటోజోవాకు చెందిన లీప్యానియా అను (కొత్తి మెర పురుగు) (చిన్న దోమ) పరాన్నజీవి
  • మన దేశంలో లీష్మానియా అను ఒకే ఒక పరాన్నజీవి ఈ కాలా అజార్ జ్వరానికి కారణం అవుతుంది
  • ఈ పరాన్న జీవి ముఖ్యంగా శరీర రక్షణ వ్యవస్ధ మీద ప్రభావం చూపుతుంది. తరువాత అస్ధిరమజ్జు
  • (బోన్ మారో) , కాలేయము, మహాభక్షక వ్యవస్ధలలో ఎక్కువ మోతాదులో కనబడుతుంది
  • కాలా జ్వరము లేక నల్ల మచ్చల జ్వరము. తదుపరి వచ్చే చర్మవ్యాధి లో లీప్యానియా డోనవాని అను పరాన్నజీవి చర్మం ఉపరితలంలోని కణాలలో చొచ్చుకొని పోయి అక్కడ వృద్ధి చెందుతూ వ్యాధి లక్షణాలకు కారణం అవుతుంది. కొందరు వ్యాధిగ్రస్థులలో ఈ చర్మ సమస్య చికిత్సానంతరం కొన్ని సంవత్సరాల తరువాత బయటపడవచ్చును
  • కొన్ని సార్లు ఈ పరాన్నజీవి జీర్ణ వ్యవస్థ లో ప్రవేశించకుండానే చర్మంలోనే వృద్ధి చెంది అక్కడే లక్షణాలను వృద్ధి చేయవచ్చును. దీని గురించి ఇంకా విపులంగా పరిశోధనలు జరగవలసి వున్నవి
 
నల్లమచ్చలు జ్వరంలో కనపడే లక్షణాలు మరియు చిహ్నాలు
  • మళ్ళీ, మళ్ళీ, వచ్చే జ్వరం లేక ఆగి వచ్చే జ్వరం. ఈ మళ్ళీ జ్వరం తీవ్రంగా ద్విగణీకృతమై వుంటుంది
  • ఆకలి లేకపోవడం, పాలిపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం
  • ప్లీహపు (స్ప్లీ న్) వాపు - ప్లీహము త్వరితగతిన వాపునకు గురౌతుంది. మెత్తగా ఉంటుంది. ముట్టుకుంటే నొప్పితెలియదు
  • కాలేయము - వాపునకు గురౌతుంది కానీ ప్లీహమంత (స్ప్లీ న్)  ఎక్కువగా వుండదు. మెత్తగా, ఉపరితలం సమంగా అంచులు కొస్సెగా వుంటాయి
  • లింఫ్ గ్రంధుల్లో వాపు
  • చర్మం - ఎండిపోయినట్టు, పలచబడినట్టు, పొలుసుబారినట్టు వుంటుంది. వెంట్రుకలు వూడి పోవచ్చు. చర్మం పాలిపోయి  పాలిపోయి అక్కడక్కడా బూడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. దీని గురించి ఈ జ్వరానికి నల్ల మచ్చల  జ్వరము అని  పేరు వచ్చింది
  • రక్త హీనత - శీఘ్రంగా వృద్ధి చెందుతుంది. బలహీనత రక్తహీనత శుష్కించి పోవడం, ప్లీహము వాపు వంటి లక్షణాలతో వీరు ప్రత్యేకంగా కనబడుతూ వుంటారు
 kala_2.gif
నల్ల మచ్చల జ్వరానంతరం కనపడే చర్మ వ్యాధి లక్షణాలు, మరియు చిహ్నాలు చర్మంలో వచ్చే మార్పుల ఆకృతిని బట్టి రకాలుగా విభజన
నల్ల మచ్చల జ్వరానంతరం వచ్చే చర్మ వ్యాధిలో ఈ పరాన్న జీవి చర్మపు ఉపరితలపు పొరల్లో కనబడుతుంది. ఈ చర్మంలో మార్పులు నల్ల మచ్చల జ్వరం వచ్చి కోలుకున్న 1-2 సం. తరువాత కనబడవచ్చు. అప్పుడప్పుడు నల్ల మచ్చల జ్వరం రాకుండానే కేవలం చర్మం వ్యాధిలాగా కనపడవచ్చు. 

  • తక్కువ వర్ణ పరిమాణంతో కూడిన   మచ్చలు కనపడడం.  ఇవి కుష్టు వ్యాధిలో కనబడు మచ్చలను పోలివుంటాయి.  కానీ సాధారణంగా 1 cm కంటే తక్కువ పరిమాణంలో ఎక్కువగా ముఖంలో కనపడుతాయి. కానీ శరీరంలో ఏ భాగంలోనైనా  కనబడవచ్చు
  • కొంత కాలం తరువాత (కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాలు కావచ్చు) ఈ మచ్చల మీద వివిధ పరిమాణాల కంతులు ఉత్పన్నమవుతాయి
  • ఎఱ్ఱగా సీతాకోక చిలుక ఆకారంలో ఉండే దద్దుర్లు కనబడుతాయి. ఇవి సూర్యరశ్మికి తీవ్ర తరమవుతాయి. ఇది ఈ చర్మవ్యాధిలో తొలిదశలో కనబడే ఒక లక్షణం
  • ఎఱ్ఱగా ఉండే కంతులు, బుడిపెలు ముఖ్యంగా గడ్డంమీద, ముఖం మీద కనపడతాయి
  • ఇవి చాలా సంవత్సరాల కాలంలో పెరుగుతూ వుంటాయి. అకస్మాత్తుగా మానడం సాధారణంగా జరుగదు
అతి తక్కువగా చూసే నల్లజ్వరం తదనంతరం వచ్చే మార్పులు
  • ఒకటికంటే ఎక్కువ కణుతులు, బుడిపెలు కలిసిపోయి గారలాంటి ప్రదేశాలు చర్మం మీద ఏర్పడతాయి
  • చేతులు మరియు కాళ్ళ మీద పులిపిర్లవలే ఉత్పన్నం అవుతాయి
  • పులిపిరుల వంటి కంతులు మొఖం మీద ముక్కుపై, గడ్డం, పెదవుల మీద కనబడతాయి
  • అభివృద్ధి చెందిన కణజాలం (కనురెప్పల, ముక్కు, పెదవుల పైన)
  • కనుబొమ్మల దగ్గర పసుపు పచ్చని తరకలు కట్టడం కొవ్వుతో కూడిన కంతులు చంకలలో, మోకాలి వెనుక భాగంలో, తొడల లోపలి భాగంలో నోటి చుట్టూ కనబడతాయి
  • చర్మం పొలుసులలాగా కట్టి పొరలు పొరలుగా రాలిపోవుట. ఇది నానా రంగుల పొలుసుల రూపంలో ఉండవచ్చు

Post a Comment

0 Comments