Full Style

>

కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా? ,Kidney stones Removal without surgery


కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా?
ఇఎస్‌డబ్ల్యుఎల్‌ : ఇది జర్మనీ రూపొందించిన యంత్రం. దీని ద్వారా రోగిని ఒక నీటితొట్టిలో పడుకోబెడ్తారు. మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములును పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లుగా మార్చవచ్చును. మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వాడినవాటిని మూత్రము ద్వారా బయటకు పంపవచ్చు. దీనికి మూడు రోజులు పడుతుంది. ఇలా కత్తితో పనిలేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు.

మూత్రపిండంలో చేరిన రాళ్ళలో ఏ ఒకటికో చికిత్స అవసరమొస్తుంది. మిగతావి కరిగిపోవడమో, మూత్రం ద్వారా బయటకు రావటమో జరుగుతుంది. ఇవి రీనెల్‌ మార్గంలో పెద్దవిగా లేదా వికృతంగా ఏర్పడ్డ రాళ్ళ వల్లనే ప్రమాదానికి లోనవడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కలిగే నొప్పిని సర్జికల్‌ పుస్తకాల్లో లోయిన్‌- టు- గ్రోయిన్‌ అని పేర్కొన్నారు. కొంతమంది యూరాలజిస్టులు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను విద్యుదయస్కాంత తరంగాలను ప్రయోగించి రాళ్ళను ఇసుకంత పరిమాణం ఉన్న చిన్న కణాలుగా చేస్తుంటారు. దీనిని ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్సీ అని అంటారు. కేవలం 3 రోజుల్లో ఈ పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్ళను తొలగిం చుకోవడం జరుగుతుంది. డయాబెటిస్‌, బి.పి., గుండెజబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్ళను తొలగించుకోవచ్చు.

కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను పగలగొట్టేందుకు మరోపద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబును కిడ్నీలోనికి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతి వేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతి ధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్నముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్‌ ద్వారా తీస్తారు. దీనినే 'పర్క్యుటేనియస్‌ సెప్రోలిథోటోనమి' అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి గాటుపెట్టడం జరుగుతుంది. అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం ఇద్దరు వ్యక్తులకైనా అవసరమొస్తుంది. ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగా లను కావలసిన చోటికి పంపుతారు. టాన్యుడ్యూజర్‌ ద్వారా సుమారు నూరు స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంప బడతాయి. తరంగాలు ఒకదాని వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల వత్తిడి కిడ్నీలో రాళ్ళున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్ళుబ్రద్ధలై చిన్నముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్‌టర్‌ పద్ధతి వల్ల ప్రయో జనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు.

Post a Comment

0 Comments