యాంత్రిక జీవనానికి దూరంగా.. ప్రకృతితో వీలైనంత ఎక్కువ సేపు స్నేహం చేస్తే తీవ్రమైన మానసిక సమస్యల బారిన పడకుండా ఉంటామనేది తాజా అధ్యయనాల్లో తేలిన వాస్తవం. దీని వల్ల ఒత్తిడికి దూరమై.. మనోల్లాసానికి దగ్గరవడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ రిచర్డ్ వైద్యులు. వందల మందిపై జరిపిన పరిశోధన తర్వాత ఈ వాస్తవాన్ని వెల్లడించారు. దినచర్యలో భాగంగా ఎక్కువ సమయం మొక్కల పెంపకం, లాన్‌లో నడవడానికి సమయం కేటాయించగలిగితే మనసు తేలిక పడుతుంది. కొత్త ఆలోచనలు అంకురిస్తాయి. అంతేకాదు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.. ప్రకృతిలో ఉన్న మహత్తే అది అంటారు శాస్త్రవేత్తలు. అందుకే నిపుణులు యోగా, ధ్యానానికి అనువుగా పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తారు. అలానే తోటపని చేయడానికి, మొక్కల పెంపకానికి వీలు కాకపోతే కనీసం పచ్చని చెట్లు ఉన్న చిత్రాలనయినా ఇంటి గదుల్లో అలంకరించుకుంటే హాయిగా ఉంటుంది.
0 Comments