Full Style

>

మన ఆరోగ్యాన్ని రక్షించే వైద్యపరీక్షలు , Our health protecting Medical Tests

ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూక్తి మనం నిత్యమూ పాటిస్తూ ఉండాలి . మన ఆరోగ్యము గురించి మనము తెలుసుకోలేము . అందుకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను . ఏ రకమైన అనారోగ్యమూ లేదు . . . నాకెందుకు వైద్యపరీక్షలు ... అనుకునేవారు చాలామంది ఉన్నారు . మన అంతర్గత ఆరోగ్యము గురించి ఒక్కొక్కప్పుడు అంత త్వరగా బయటికి తెలియకపోవచ్చు . పూర్వకాలములో కొంత పెద్ద వయసులో వచ్చే బి.పి. , సుగరు లంటి కొన్ని రోగాలు ఇప్పుడు చాలా తొందరగా చిన్న వయసులోనే బయటపడుతున్నాయి . అందువల్ల సరైన సమయమ్లో తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల పరిస్థితి చేజారిపోకుండా కాపాడుకోవచ్చును.

కొన్ని ముఖ్యమైన పరీక్షలు : ప్రతి సమంత్సరమూ చేయించుకోవలసినవి .

పాప్ స్మియర్ పరీక్ష :
బ్లడ్ ప్రెషర్ పరీక్ష ,
డయబిటీస్ స్క్రీనింగ్ ,
25-హైడ్రాక్షి విటమిన్‌ ' డి ' టెస్ట్ ,
క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్‌ (CBE),
Hiv టెస్ట్ ,
హెపటైటిస్ బి టెస్ట్ ,
Routine Blood Tests like -- TC, DC, ESR, Hb, Group and Rh type ,



12-20 ఏళ్ళ మధ్య సామాన్యంగా చేయించు కోవాల్సిన పరీక్షలేంటో ఇప్పుడు చూద్దాం.

పాప్ స్మియర్ పరీక్ష :
స్త్రీలలో సెర్వైకల్ కాన్సర్ ను ముందుగా పసిగట్టే పరీక్ష ఇది . చాలా సింపుల్ గా చేయవచ్చును . HPV (virus) వలన ఈ కాంసర్ వస్తుంది . చైతన్యవంతమైన శృంగార జీవతం గడిపే ప్రతి స్త్రీ ఈ పరీక్ష చేసుకొని ప్రమాదకరమైన జబ్బును పూర్తిగా నివారించుకోవచ్చును .

బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌

రక్తంలో గ్లూకోజ్‌ శాతం ఎంత వుందో తెలిపే డయాబెటిస్‌ పరీక్ష ఇది. వ్యాధి ముదరకముందే తెలుసుకుని చికిత్స తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయమౌతుంది.

రక్తపోటు పరీక్ష

సామాన్యంగా ఏ డాక్టర్‌ దగ్గరికెళ్ళినా బీపీ పరీక్షిస్తారు. లో బీపీ, హై బీపీ.. ఏది ఉన్నా కష్టమే. బ్లడ్‌ ప్రెషర్‌ ఉందని తెలిసినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

రొమ్ము పరీక్ష

రొమ్ము భాగంలో ఏదైనా గడ్డ ఉన్నట్లనిపిస్తే ఆలస్యం చేయకుండా నివృత్తి చేసుకోవడం మంచిది. బ్రెస్ట్‌ కాన్సర్‌లాంటి ప్రమాదమేదైనా పొంచి వుందేమో ఒకసారి బయాప్సీ చేయించుకోవాలి. అలాంటిదేమీ లేకపోతే ఆనందమే కదా. ఒకవేళ కాన్సరైతే తొలిదశలోనే చికిత్స పొందితే తగ్గిపోతుంది.

సి.బి.సి. టెస్ట్‌ (కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌)

ఈ పరీక్ష ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎలా వుంది, ఎనీమియా ఏమైనా వుందా లాంటిది తెలుస్తుంది. అప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

25-హైడ్రాక్షి విటమిన్‌ -డి టెస్ట్ :
ఇది ఎముకల ఆరోగ్యము గిరించి తెలియజేసే పరీక్ష . ఎప్పుడు అవసరమంటే--
ఎముకలు బలహీనము గా ఉన్నప్పుడు .,
ఎముకలు కండరాలు కీళ్ళలో నొప్పులు దీర్ఘకాలం గా ఇబ్బంది పెడుతుంటే ,

బ్లడ్ గ్రూప్ టెస్స్ట్ :
ప్రతి మనిషి నేటి సమాజం లో ప్రమాదాలకు గురవుతూఉంటారు . అత్యవసరం గా బ్లడ్ ఎక్కించవలసి వస్తే బ్లడ్ గూప్ ముందుగా తెలిస్తే త్వరగా ట్రీట్ మెంట్ జరిగేందుకు అవకాశము ఉంటుంది .Rh నెగటివా ? పొజిటివా తెలుస్తుంది .

HIV టెస్ట్ :
వయసులో ఉన్న ఆడ మగ చేసే పొరపాట్లు వలన కొన్ని ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశాలు మిండుగా ఉన్న ఈ రోజుల్లో ముందు జాగ్రత్త గా ఈ పరీక్షలు చేసుకోవడం మంచిది .
Hbs Ag టెస్ట్ :
ఇది పచ్చకామెర్ల కు సంభందించిన పరీక్ష . వైరస్ వలన వచ్చే కాలేయం జబ్బులలో ఈ పచ్చకామెర్ల వ్యాధి అతి భయంకరమైనది . ఇది లైంగిక సంబంధిత వ్యాధి . ముందు జాగ్రత్త వలన పూర్తిగా నయము చేయవచ్చును .


చర్మ కాన్సర్‌ పరీక్ష

ప్రతిరోజూ శరీరం మొత్తాన్నిగమనించాలి. చర్మంపై ఎక్కడన్నా మార్పు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. స్కిన్‌ కాన్సర్‌ లాంటిదేమైనా వుంటే తక్షణం చికిత్స పొందాలి. కుటుంబంలో ఎవరికయినా చర్మ కాన్సర్‌ ఉన్నట్లయితే ప్రతి మూడేళ్ళకోసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి.

క్షయ పరీక్ష

తరచు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు బాధిస్తున్నట్లయితే టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌) పరీక్ష చేయించుకోవాలి.

యూరినాలసిస్‌

మూత్రనాళం లేదా మూత్రపిండాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే యూరినాలసిస్‌ చేయించుకోవాలి. యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్‌, మూత్రపిండాల్లో రాళ్ళేర్పడం లాంటి సమస్యలు వుంటే వాటికి చికిత్స చేయించుకోవచ్చు.

ఏమీ లేదన్న ధీమాతోగానీ, ఏదో వుందన్న భయంతోగానీ టెస్టు చేయించుకోకుండా ఆలస్యం చేస్తే ఆనక వ్యాధి ప్రబలి బాధపడాల్సొస్తుంది.

Post a Comment

0 Comments