Hay fever- హే ఫీవర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్, లేదా దుమ్ము వంటి అలెర్జెన్‌ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్ రినైటిస్, లేదా హే ఫీవర్ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్, దుమ్ము, హిస్టమైన్ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావిమైనప్పుడు ఈ మాస్ట్ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్, దురద వంటివి కన్పించవచ్చు. కలుషిత గాలిలో ఉండే క్లోరిన్, డిటర్జెంట్ల వంటి రసాయనాలు సాధారణ పరిస్థితుల్లోనైతే ఏమీ చేయవు. కానీ ఇలాంటప్పుడు మాత్రం పరిస్థితిని అవే చాలా తీవ్రతరం చేస్తాయి.
లక్షణాలు :
కంటి పై పొర ఉబ్బడం, చర్మం కందడం, ఎర్రబారడం, కనురెప్పలు ఉబ్బడం, దిగువ కనురెప్పలోని రకతనాళాలు నిశ్చలమవడం, ముక్కు దిగువ భాగంలో ముడతలు, ముక్కు టర్బినేట్స్‌లో వాపు, చెవుల్లో నిశ్చలత వంటివి అలెర్జిక్ రినైటిస్ ఉండే వ్యక్తుల్లో సాధారణంగా కన్పించే శారీరక లక్షణాల్లో కొన్ని.హాచ్! తుమ్ములు, కళ్ళలోను౦డి నీరుకారడ౦, కళ్ళు దురదపెట్టడ౦, ముక్కు చీదర, ముక్కు కారడ౦ వ౦టివి కోట్లాదిమ౦దికి వస౦త రుతువు ఆర౦భాన్ని సూచిస్తాయి. వారికి ఆ ఎలర్జీ సాధారణ౦గా పుప్పొడి ని౦డిన వాతావరణ౦ కారణ౦గా కలుగుతు౦ది. పారిశ్రామిక ప్రప౦చ౦లోని ప్రతి ఆరుగురిలో ఒకరు ఆయా రుతువుల్లో కలిగే పుప్పొడి ఎలర్జీలతో (ఈ ఎలర్జీలు హే ఫీవర్ అని కూడా పిలువబడతాయి) బాధపడుతున్నారని బిఎమ్‌జి (పూర్వ౦ బ్రిటిష్ మెడికల్ జర్నల్) అ౦చనా వేసి౦ది.
Treatment :
ఇక్కడ ముఖ్యముగా ముందుగా బాధనివారణ కోసము మందులు వాడాలి .
జ్వరానికి : పరాసెటమాల్ 500 మి.గ్రా . రోజుకు 2 లేదా 3 సార్లు 4-5 రోజులు .
జలుబుకు : పారాసెతమాల్ తో కలిసిఉన్న సెట్రిజన్ + ప్రినెలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ (ముక్కు దిబ్బడ పోవడానికి) మాత్రలు వాడాలి.
ఎలెర్జీకి : లీవో సిట్రజన్ 5 మి,గ్రా. రోజుకు 2 సార్లు 3-4 రోజూలు వాడాలి ,
పోలెన్ కళ్ళకు చేరకుండా సన్‌గ్లాసెస్ వాడాలి . పోలెన్ కు జుట్టు , బట్టలు మ్యాగ్నెట్ లాంటివి. . . బయటనుండి ఇంటికి వచ్చేటప్పుడు వీటిని బాగా విదలించుకొని రావాలి. దుస్తులు మార్చుకోవడము , స్నానము చేయడము వలన హే ఫీవర్ లక్షణాల తీవ్రత తగ్గిపోతుంది. ఒత్తిడికి , హేఫీవర్ కు లింక్ ఉంది. ఒత్తిడి స్థాయిలు పెరిగే కొద్దీ లక్షణాలు పెరుగుతాయి. యాంటీ హిస్టమిన్ నాజల్ డ్రాప్స్ , స్ప్రే లు , అవసరమైతే యాంటి హిస్టమిన్ ఐ డ్రాప్స్ వాడాలి.

1 Comments
సార్ నాకు అంగం సమస్య తీవ్రంగా ఉంది అంగం పై ఉన్న చర్మం వెనక్కు తాగుతుంటే అసలు రావడం లేదు బలవంతంగా లాగితే చర్మం పగలిపోతుంది క్రాక్స్ వస్తున్నాయి పరిష్కారం చుపుగలరు
ReplyDelete