ఊర్ధ్వ శ్వాసమార్గంలో అడ్డంకి,Upper Respiratary Tract Obstruction- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
--ఊర్ధ్వ శ్వాసమార్గం (అప్పర్ ఎయిర్ వే)లో అడ్డంకి ఏర్పడినప్పుడు తక్షణమే వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది. ఊర్ధ్వ శ్వాసమార్గంలో కలిగే అడ్డంకి శ్వాస నాళంలో కాని, స్వరపేటికలో కాని, గొంతులో కాని ఏర్పడవచ్చు.
--కారణాలు
ఊర్ధ్వ శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్నింటి గురించి స్థూలంగా తెలుసుకుందాం. బాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకడంవల్ల అడ్డంకి ఏర్పడ వచ్చు. అగ్ని ప్రమాదాల్లో పొగను పీల్చడం, రసాయ నాలవల్ల గాయాలు కావడం, ఎలర్జీ, శరీరతర వస్తు వులు (ఫారెన్‌బాడీస్) అడ్డుపడటం, ప్రమాదాలకు గురికావడం వంటి అంశాల వల్ల శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడుతుంది.
శ్వాస మార్గంలో ఏర్పడే అడ్డంకి పాక్షికంగా ఉండ వచ్చు. లేదా పూర్తిస్థాయిలో ఉండవచ్చు. అడ్డంకి స్వల్పంగా ఉన్నప్పుడు తీసుకునే శ్వాస సరిపోదు. అడ్డంకి తీవ్రంగా ఉన్నప్పుడు చర్మం నీలి రంగులోకి మారుతుంది. ఈ స్థితిని సయనోసిస్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల కణాలకు ఆక్సిజన్ అందని కారణంగా ఈ స్థితి ఏర్పడుతుంది. సయనోసిస్‌తోపాటు అయోమయం లేదా స్పృహ తప్పడం జరుగుతుంది. పూర్తిస్థాయిలో అడ్డంకి ఏర్పడినప్పుడు తక్షణమే చికిత్స తీసుకోనిపక్షంలో ఊపిరి ఆడని పరిస్థితి నెల కొని మరణం సంభవి స్తుంది. ఊర్ధ్వ శ్వాస మార్గంలో అడ్డంకి ఏర్పడి నప్పుడు కనిపించే లక్షణాలను చాలా తేలికగా గుర్తిం చవచ్చు. బాధితుడికి హఠాత్తుగా శ్వాస తీసుకో వడంలో ఇబ్బంది ఏర్పడటం కాని, అసలు శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నం కావడం కాని జరుగు తుంది. పూర్తిస్థాయి అడ్డంకి ఏర్పడటం, సయనో సిస్, స్పృహతప్పడం, మరణం ఒకదాని తరువాత మరొకటి వెంటవెంటనే సంభవిస్తాయి.
--సాధారణ కారణాలు
ఊర్ధ్వ శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడటానికి పైన పేర్కొన్న కొన్ని కారణాలతోపాటు అనేక ఇతర కార ణాలు కూడా ఉంటాయి. వాటిలో సర్వసాధారణంగా కనిపించే కారణం - శరీరేతర వస్తువులు అడ్డు పడటం. పెద్దవారిలో ఆహారాన్ని మింగుతున్నప్పుడు కొన్ని తునకలు గొంతులో అడ్డుపడవచ్చు. పిల్లల్లో వేరు శనగకాయలు (పల్లీలు) ఎక్కువగా అడ్డుపడతాయి. పిల్లల్లో బెలూన్ తాలూకుముక్కలు, గుండీలు, చిల్లర నాణాలు, చిన్న చిన్న బొమ్మలవంటివి కూడా అడ్డు పడే సందర్భాలు ఉంటాయి.ఎలర్జీ కారణంగా సంభవించే ప్రతిచర్యల వల్ల శ్వాసనాళం లేదా గొంతు వాపునకు గురై మూసుకు పోవడం మరొక కారణం. పెన్సిలిన్ వంటి యాంటి బయాటిక్స్, అధిక రక్తపోటుకు వాడే మందులు మొదలైన వాటి వల్ల ఎలర్జీ కలిగి ఈ స్థితి రావచ్చు.
ఎపిగ్లాటిస్ వ్యాధిగ్రస్తమైనప్పుడు అదివాచి, శ్వాస మార్గంలో అడ్డంకి కారణమవుతుంది. రిట్రోఫారింజి యల్ యాబ్సెస్, పెరిటాన్సిలార్ యాబ్సెస్ వంటి అంశాలు కూడా శ్వాసమార్గంలో అడ్డంకి కారణమ వుతాయి.
-లక్షణాలు
ఊపిరి అందక ఇబ్బంది పడటం, ఎగశ్వాస, సయనోసిస్, ఈల, గురకలాంటి శబ్దాలు శ్వాసకోశంలో వినిపించడం స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు రోగిని శారీరకంగా పరీక్షించినప్పుడు శ్వాసలో మార్పులకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తాయి. సాధారణంగా దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం కావు. అయితే అత్యవస రాన్నిబట్టి ఎక్స్‌రే, బ్రాంకో స్కోపీ, లారింగోస్కోపీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
--చికిత్స
శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడినప్పుడు బాధితుడు మాట్లాలేక, శ్వాస తీసుకో లేక ఇబ్బంది పడుతున్న ప్పుడు హెమ్‌లిక్ మాన్యూవర్ ప్రక్రియ ప్రాణాలను నిలబెట్టగలుగుతుంది. ఈ సమస్యకు గురైన వ్యక్తు లకు చేసే చికిత్స సమస్య తీవ్రతను అనుసరించి ఉంటుంది.
శ్వాస మార్గంలో ఏవైనా వస్తువులు అడ్డుపడి ఉంటే వాటిని లారింగోస్కోప్ లేదా బ్రాంకోస్కోప్ ద్వారా తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో శ్వాసమార్గాన్ని శస్త్రచికిత్స ద్వారా తెరిచి ఊపిరి ఆడేలా చేయాల్సి ఉంటుంది. దీనిని ట్రేకియాస్టమీ అంటారు.
సాధారణంగా ఈ సమస్యకు గురైనవారికి వెంటనే చికిత్స చేయడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయి. అయితే రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే, చికిత్స చేసినప్పటికీ, ప్రాణాంతకం కావచ్చు.
ఇక్కట్లు
శ్వాసమార్గంలో అడ్డంకిని తొలగించడం సాధ్యం కాకపోతే రోగి శ్వాస తీసుకోవడంలో వైఫల్యం చెందు తాడు. మెదడు దెబ్బ తినవచ్చు. మరణం సంభవిం చవచ్చు. శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడటమనేది అత్యవసరంగా వైద్య సహాయం పొందాల్సిన స్థితి. ఎట్టిపరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయడం పనికిరాదు.
0 Comments