Full Style

>

Urinary Incontinence,యూరినరీ ఇన్‌కాంటినెన్స్


Urinary Incontinence,యూరినరీ ఇన్‌కాంటినెన్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 మూత్రాన్ని విసర్జించకుండా ఆపు కోవడాన్ని 'కాంటినెన్స్‌' అంటారు. మన నియంత్రణ లేకుండా, తెలియకుండా మూత్రం పడిపోవ డాన్ని లేదా వచ్చిందానిని  విసర్జనకు వెళ్లకుండానే పడిపోవడాన్ని 'యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌' అంటారు. ఇది జబ్బు కాదు. జబ్బుకు సంబంధించిన లక్షణం. ఇది చాలా సార్లు పలు రకాలుగా, పలు జబ్బుల్లో, వివిధ వయస్సుల్లో చూస్తుంటాం. మహిళల్లో వచ్చినా, పురుషుల్లో వచ్చినా ఒకటే కారణం అని అనుకోకూడదు. ఆ పరిస్థితిని, వయసును బట్టి, నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స చేస్తారు. అంతేకానీ మందులతో చికిత్స చేయలేం. కారణం తెలుసుకున్న తర్వాతనే చికిత్స చేస్తారు.

అసలు ఏం జరుగుతుంది?

మన మూత్రాశయంలో మూత్రం కొంతసేపు ఆగి ఉండే అవకాశం ఉంటుంది. మూత్రాశయం రిలాక్స్‌ అవుతుంది. ఇది నిల్వ ఉండే దశ. మూత్రాన్ని ఆపిపెట్టే దాన్ని స్ప్రింటర్‌ మెకానిజం అంటారు. ఇక్కడ స్ప్రింటర్‌ బిగుతుగా ఉండటంవల్ల మూత్రం లీక్‌ కాదు. ఎంత బిగుతుగా ఉంటుందంటే, మనం దగ్గినా, తుమ్మినా, నవ్వినా, మూత్రాశయంపై ఒత్తిడి పడినా మూత్రం రాకుండా చేస్తుంది. అంటే కొలాయి/ నల్లా/ ట్యాప్‌కు వాల్వ్‌ ఎలాగో మనకు స్ప్రింటర్‌ కూడా అలాగే. మూత్రం పోయాలనుకున్న ప్పుడు స్ప్రింటర్‌ రిలాక్స్‌ అవుతుంది. మూత్రాశయం ముడుచు కుంటుంది. అప్పుడు మూత్రం వస్తుంది. ఇది సాధారణంగా జరుగుతుంది. స్ప్రింటర్‌ బిగుతుగా మూసుకోలేక పోయిన ప్పుడు, మూత్రం నిండగానే మూత్రాశయంపై ఒత్తిడి పెరిగినప్పుడు, తుమ్మినా, దిగ్గినా మూత్రాశయం ముందున్న స్ప్రింటర్‌ మూసుకోకపోవడం వల్ల మూత్రం లీకవుతుంది.

‘వర్షం పడుతోంది కదా.. ఇది సాధారణమే..’ పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రం దీన్ని సమస్యగా పరిగణించాల్సి వస్తుంది. కంట్రోల్ తప్పి లీక్ అవుతుంటే దాని వెనుక ఏదో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మహిళల్లో ఇది సర్వసాధారణం. బయటకు చెప్పడానికి సిగ్గుపడి చాలామంది ఈ సమస్యతో లోలోపలే కుమిలిపోతుంటారు. కనీసం డాక్టర్‌ని సంప్రదించడానికి కూడా వెనుకాడుతుంటారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి.

*కారణాలు..
మహిళల్లో యురెత్రా పొడవు కేవలం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉండడం ఒక కారణమైతే కటి భాగంలోని కండరాలు, కణజాలాలు బలంగా లేకపోవడం మరో కారణం. నార్మల్ డెలివరీ అయినవాళ్లలో ప్రసవం తరువాత ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. పుట్టేటప్పుడు ఏవైనా గాయాలైనా, యాక్సిడెంట్‌కు గురయి దెబ్బలు తగిలినా కూడా పెల్విక్ కండరాలు బలహీనపడి ఈ సమస్య తలెత్తుతుంది. పురుషుల్లో యురెత్రా 25 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి
సమస్య తక్కువే. నరాల సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలున్నవాళ్లలో ఈ సమస్య మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగవార్తో పోల్చినప్పుడు ఆడడవారరలలో ఇన్‌కాంటినెన్స్ సమస్య రెండింతలు ఎక్కువ . ఈసమస్య కొన్ని ప్రత్యేక  పరిస్థితులలో ఎక్కువవుతుంది. అవి ---

*మెనోపాజ్ లో ఈస్ట్రోజన్‌ తగ్గడమువలన యురెత్రాలోని టిష్యూకు హాని జరుగుతుంది

 *గర్భం దాల్చడము ,పిల్లలు పుట్టడము జరిగినప్పుడుపెల్విక్ ఫ్లోర్ కండరాలు డ్యామేజీ అయి యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కు దారితీస్తుంది.

*మలబద్దకము కొన్ని రకాల మందులు వాడడము , హార్మోన్‌ రిప్లేస్ మెంట్ ట్రీట్మెంట్ , యూరినరీ ట్రాక్ట్ .. బ్లాడర్ ఇన్‌ఫెక్షన్‌ , స్థూలకాయము , శారీక చురుకు దనము లేకపోవడము , నరాలలోపాలు , వయసు రీత్యా శరీరములో వచ్చేటటువంటి మార్పులు ... తాత్కాలిక లేదా దీర్ఘకాలిక  యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కారణాలు .

లక్షణాలు
- నవ్వినా, దగ్గినా, తుమ్మినా, బరువు ఎత్తినా, వ్యాయామం చేసినా మూత్రం పడుతుంది. న్యూరోజెనిక్ స్పైనల్‌కార్డ్ ఇంజురీస్ అంటే వెన్నెముకకు దెబ్బలు తగలడం వల్ల నరాలు ప్రభావితమై ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. దీన్నే స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు.
- బాత్రూమ్‌లోకి వెళ్లేలోపే మూత్రం పడిపోతుంది.
- రాత్రి పక్క తడుపుతారు.
- తరచుగా పదే పదే బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఆపరేషన్ తరువాత......కటి భాగంలోని అవయవాలకు ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆపరేషన్ తరువాత ఇలాంటి సమస్య రావచ్చు. సర్జరీ సమయంలో ఏవైనా గాయాలు కావడం, కొన్నిసార్లు యురెత్రా దగ్గర్లోని కణజాలాలను తొలగించాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కూడా ఆ భాగం బలహీనమై సమస్య వస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి పెద్దది కావడం వల్ల బ్లాడర్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విసర్జన కాదు. దాదాపు లీటర్ దాకా మూత్రం బ్లాడర్‌లోనే ఆగిపోయి లీక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అంటారు. ప్రొస్టేట్ సమస్య ఉన్నప్పుడు కండరాలకు పనివుండదు కాబట్టి ప్రొస్టేట్ ఆపరేషన్ తరువాత కూడా అవి అంత సమర్థవంతంగా పనిచేయవు. మూత్ర విసర్జనలో రెండు కవాటాల్లాంటి నిర్మాణాలు పనిచేస్తాయి. కండరాలు సంకోచించినప్పుడు ఈ కవాటాలు తెరుచుకుంటాయి.మూత్రం విసర్జన అవుతుంది. తర్వాత అవి మూసుకుంటాయి. ప్రొస్టేట్ సమస్య వల్ల ప్రొస్టేట్ గ్రంథిని తొలగించాల్సి వచ్చినప్పుడు గ్రంథితో పాటు అంతర్గత కవాటాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. ఇకపోతే బాహ్య కవాటం అప్పటివరకు ఎక్కువ పనిలేకుండా ఉండడం వల్ల దాని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందువల్ల ప్రొస్టేట్ ఆపరేషన్ అయినవాళ్లలో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. సాధారణంగా ఇటువంటి సమస్యను మందులతోనే తగ్గించవచ్చు. తీవ్రంగా మారితే మాత్రం సర్జరీ అవసరం అవుతుంది.

*ఏ రకము ? :

ఏ రకము ఇన్‌కాంటినెన్స్ ఉందో ఖచ్చితముగా చెప్తే సరైన సూచనలు , చికిత్స సిఫార్సు చేయడానికి వైద్యులకు వ్వీలుగా ఉంటుంది.

*స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ : మహిళల్లో ఇది అత్యంత సాధారణ రకము . నవ్వినా , తుమ్మినా , దగ్గినా మూత్రము లీకేజీ ఉంటుంది . వ్యాయామాలు చేస్తున్నా , ఏధైనా బరువులు ఎత్తినా నీరుడు అయిపోతూ ఉంటుంది. పూర్వపు వెజినల్ ప్రసవాలు (డెలివరీ) ,మెనోపాజ్ , బరువు పెరగడము  ఇందుకు కారణము కావచ్చు.

 *అర్జ్ ఇన్‌కాంటినెన్స్ : సడన్‌ గా , అతిత్వరగా , వెంటనే మూత్రానికి వెళ్ళాలన్న కోరిక ఉంటుంది. వెళ్ళకపోతే మూత్రము లీకేజీ అవుతుంది. నీరు , ఇతర పానీయాలు తాగిన వింటనే బాత్ రూం కి వెళ్ళాలన్న కోరిక కలుగుతుంది . ఇంటికి వచ్చి తాళం చెవి పెట్టీపెట్టగానే లేదా నీటి శబ్దము విన్నా వెంటనే మూత్రానిని వెళ్ళాలన్న కోరిక పుడుతుంది . ఇదే విధము గా రాత్రులు మూత్రానికి వెళ్తూ ఉంటే " Nocturia" అంటారు .

*ఓవర్ ఫ్లో ఇన్‌కాంటినెన్స్ : ఇక్కడ యూరినరీ బ్లాడర్ లో మూత్రము పూర్తిగా ఖాలీ అవదు . సుమారు 1.లీటరు వరకూ ఉండిపోవడము వలన మూత్రము లీకు అవుతుంది. మగవారిలో పోస్ట్రేట్ గ్రంధి సమస్యలు వలన ఇది ఎక్కువగా కలుగుతుంది. మహిళలో ఓవర్ ఫ్లో ఇన్‌కాంటినెన్స్ చాలా తక్కువ .
*మిక్షిడ్ ఇన్‌కాంటినెన్స్ : ఇది మహిళలో ఎక్కువ . అటు స్ట్రెస్ , ఇటు అర్జ్  ఇన్‌కాంటినెన్స్ కలిసి ఉంటాయి. వీల్ చైర్ వాడడమో , ఆల్జిమర్ ఉండడమో , పార్కిన్‌సోనిజం  వంటివి కారణమవుతాయి. వీరిలో బాత్ రూం అవసరమన్న విషయమే గుర్తుండడము కష్టమవుతుంది.

*ఏవి చేయాలి ? :

తక్కువ పానీయాలు త్రాగడము : పూర్తిగా త్రాగడం మానేయకూడదు .

కెజెల్ల్ వ్యాయామము : స్క్వీజింగ్ , పల్విక్ కండరాల రిలాక్షింగ్ ల పై ఫోకస్ చేస్తూ వ్యాయామము చేయాలి .

బ్లాడర్ ఇర్రిటెంట్స్ : కెఫైన్‌(caffine), ఆల్కహాల్ , స్పైసీ పదార్ధాలు , టొమాటోలు , టొమాటో ఆదారిత ఉత్పత్తులు , కృత్రిమ స్వీట్నర్స్ వంటివి మూత్రాశయాన్ని ఇర్రిటేట్ చేస్తాయి . తినవద్దు .వీటిని తినకపోవడము వలన అర్జ్ ఇన్‌కాంటినెన్స్ గలవారికి సౌకర్యముగా ఉంటుంది.

బ్లాడర్ ట్రైనింగ్ : కొంత వ్యవధిని నిర్దేశితముగా పెట్టుకుంటూ , బార్ రూం ట్రిప్స్ కు సరైన ఇంటర్వెల్స్ పాటిస్తున్నట్లైతే అర్జ్ ఇన్‌కాంటినెన్స్ చాలా వరకు కంట్రోల చేయవచ్చును . దీనిని " టైమ్‌డ్ వాయిడింగ్ " అని అంటారు.

మూత్రాశము ఖాళీ : బాత్ రూమ్‌ కి వెళ్ళిన ప్రతిసారి " డబ్ల్ వాయిడింగ్ " పూర్తిగా చేస్తుండాలి. పూర్తిగా రిలీఫ్ అయిన తర్వాత నిల్చోవాలి లేదా యదాస్థానానికి రావాలి .ఓ నిముషము పాటు ఆగి మరోసారి యూరిన్‌ పాస చేయాలి. దీనివల్ల మూత్రాశము పూర్తిగా ఖాళీ అయిపోతుంది.

బెల్లీ వెయిట్ :  అదనపు ఉదరపు బరువుని తగ్గించు కోవడము వల్ల స్ట్రెస్ లేదా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ తగ్గుతుంది . బరువు తగ్గడము వల్ల మూత్రాశయం కండరాల ఒత్తిడి తగ్గుతుంది . వ్యాయామాలు , డైట్ కార్యక్రమాలను వైద్యులు చెప్పిన ప్రకారము ప్లాన్‌ చేసుకోవాలి . మధుమేహము నియంత్రణలో ఉంచుకోవాలి.

ఇతర పరిష్కారాలు :
కేవలము జీవన శైలి అంచనాలు ఒక్కటే సహకరించవు . . . వాటితో పాటు వైద్య చికిత్సలు , పద్దతులు  మూత్రాశయ నియంత్రణలో సహకరిస్తాయి.

డ్రగ్ థెరఫీ :
అర్జ్ ఇన్‌కాంటినెన్స్ , ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లను కొన్నిసార్లు పూర్తిగా మందులతో మేనేజ్ చేయవచ్చు . మందుల్ని బ్లాడర్ ట్రైనింగ్ తో జతచేడడము వల్ల ఫలితాలు మెరుగా ఉంటాయి. అత్యంత ప్రభావవంతమైన ఈ గ్రూఫ్ మందులను " యాంటీ కొలినర్జిక్స్ " గా క్లాసిఫై చేస్తారు . మందులు వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి .

వెజినల్ పెస్సరీ : పెస్సరీ అనేది ఫ్లెక్షిబుల్ సిలికాన్‌ రింగ్ . వైద్యులు వెజైనాలో ఇన్‌సర్ట్ చేస్తారు. స్ట్రెస్ లీకేజీని తగ్గించడానికి గాను , యురెత్రా రీపొజిషనింగ్ కు , పెల్విక్ ఆర్గాన్స్ ను నొక్కిపట్టేందుకు ఈ పరికరము సహకరిస్తుంది. పెస్సరీ తీసేసి క్లీన్‌ చేయించుకోవడానికి ప్రతి 3-6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళుతుండాలి . ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది.

నరాల స్టిములేషన్‌ :నరాలు లేదా ఎలక్ట్రానిక్ స్టిమ్యులేషన్‌ అనేది పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడములో సహకరించే నొప్పిలేని ఎలక్ట్రికల్ కరెంట్ అప్లికేషన్‌.

బయోఫీడ్ బ్యాక్ :  అర్జ్ , స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ కోసము ఉపయోగము . ఇది బయోఫీడ్ బ్యాక్ ట్రైనింగ్ టెక్నిక్ , మూత్రాశయ , యురెత్రల్ కండరాల నియంత్రణ అభ్యాసం తో సహకరిస్తుంది. ఇది సాధారణముగా కెజెల్ వ్యాయామాలు , బ్లాడర్ ట్రైనింగ్ , నెర్వ్ స్టిమ్యులేషన్‌ కలిపు ఉంటాయి.

స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ వదలకుండా , ఏ చికిత్సలకూ లొంగకుండా ఉన్నప్పుడు చివరి పరిష్కార మార్గము సర్జరీ . విభిన్న ప్రక్రియల్ని , లీకేజీ కారణాన్ని బట్టి సర్జరీ ప్లాన్‌ చేస్తారు .

Post a Comment

1 Comments

  1. Discover effective treatments for urinary incontinence at World of Urology. From lifestyle adjustments and pelvic exercises to medications and advanced therapies, our experts offer comprehensive solutions.

    ReplyDelete