Full Style

>

Uterine cancer, Endometrial cancer,గర్భాశయ క్యాన్సర్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ , యుటెరైన్‌ క్యాన్సర్


Uterine cancer, Endometrial cancer,గర్భాశయ క్యాన్సర్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ , యుటెరైన్‌ క్యాన్సర్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 గర్భసంచి లో ఒక లైనింగ్ లాగా ఉండి ప్రతి నెలా గర్భం దాల్చడానికి అనువుగా మందం గా తయారయి , గర్భం ధరించకపోతే నెలసరిలో స్రవించబడేదే ఎండోమెట్రియం . సగటుగా ఎండోమెట్రియం 6.7 మి.మీ.ఉంటుంది. నెలసరి ముందు మందం గా ఉండటము , తర్వాత తగ్గడము జరిగే ఎండోమెట్రియం హార్మోనుల అసమతుల్యత వలన మరీ పలుచగా తయారయితే సంతాన లేమికి దారితీస్తుంది. మెనోపాజ్ దశలో ఎండోమెట్రియం పలుచగా మారుతుంది. పిల్లల్ని కనే వయసులో మరీ ఎక్కువగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పెరిగితే మందముగా , ఎక్కువగా ప్రొజెస్టిరాన్‌ ఉన్న బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే ఎండోమెట్రియం పలుచగా మారిపోతుంది. గర్భదారణ సమయములో మందముగా తయారయ్యే ఎండోమెట్రియం ద్వారానే పిండానికి పోషకాలు , ఆక్షిజన్‌ అందుతాయి. అందుకనే సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి చేసే పరీక్షలలో , కృత్రిమ గర్భధారన పద్ధతులలో సంతాన భాగ్యము పొందాలనునే వారికి చేసే పరీక్షలలో ఎండోమెట్రియం ఎంత మందం గా ఉందో నిర్ధారించే పరీక్ష కీలకమైనది . 6mm - 14mm ఉండే ఎండోమెట్రియం గర్భధారణకు అనువుగా ఉంటుంది.

ఎండోమెట్రియం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మందం గా ఉండడము లేదా ఎక్కువ పలుచగా ఉండటము  వంటి సమస్యలతో పాటు ఫైబ్రాయిడ్ , సిస్ట్ , ఎండోమెట్రియాసిస్ , ఎండోమెట్రియక్ క్యాన్సర్  వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్‌ లెవల్స్ శరీరములో  దీర్ఘకాలికంగా ఉన్నా , ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వని స్త్రీలలో, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలకి , నెలసర్లు 9 ఏళ్ళ కంటే ముందు , మెనోపాజ్ దశకు లేటుగా చేరుకునే స్త్రీలలో , అధిక బరువు ఉన్న స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గర్భాశయం లో లైనింగ్  గా ఉండే ఎండోమెట్రియం (కొన్ని సందర్భాలలోనెలసర్లు ప్రారంభం కాని అమ్మాయిలలో , మినోపాజ్ దశ తర్వాత కూడా) గర్భాశయం బయట ఇతర అవయవాలచుట్టూ కూడా పెరగటం ప్రారంభిస్తుంది. . . దీన్నే ఎండోమెట్రియాసిస్ అంటారు. అధికం గా పెరిగిన  ఎండోమెట్రియం వలన పొత్తికడుపు నొప్పి , కలయికలో నొప్పి , మూత్రము అదుపులో లేకపోవడం , అజీర్తి , అలసట వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.  అండాశయాల చుట్టూ పెరిగిన ఎండోమెట్రియం చుట్టూ రక్తం చేరి  బ్రౌన్‌ కలర్ లో కనిపించడము వలన వాటిని " చాక్ లెట్  సిస్ట్ (chocolate cyst)" అంటారు. ఎండోమెట్రియాసిస్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండడమే కాకుండా ఎండోమెట్రియాసిస్  ఉన్నవారికి  ఒవేరియన్‌ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నాన్‌హాడ్ కిన్స్ లింఫోమా(Non-Hodgkin's lymphoma ) , పిట్యూటరీ , థైరాయిడ్  గ్రంధి క్యాన్సర్ కూడా వచ్చె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి  ఎండోమెట్రియాసిస్ తో బాధపడే వారు ఈ విషయాలపై అవగాహన పెంపొందించుకొంటే  మంచిది .  ఎండోమెట్రియల్ ఫైబ్రాయిడ్స్ లేక  యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్ చిన్నగా చాలా మందిలో ఎటువంటి లక్షణాలు  కలిగించకుండా కూడా ఉంటాయి. పెద్దగా ఉండి పొత్తి కడ్పు బరువుగా ఉండడము , నెలసరిలో రక్తస్రావము ఎక్కువ కావడము , మూత్రము అదుపులో లేకపోవడము మొదలగు లక్షణాలు కనిపిస్తే మందులు లేక  సర్జరీ వంటి చికిత్స తప్పనిసరి.

దాదాపుగా ఎండోమెట్రియాసిస్ , యుటెరైన్‌సిస్ట్ , ఫైబ్రాయిడ్ , గర్భసంచి క్యాన్సర్  లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంతే కాకుండా గర్భసంచికి సంబంధించిన ఈ సమస్యలు తెలెత్తడానికి కూడా కారణాలు లేదా  రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఒకేలా ఉంటాయి.  అందుకనే లక్షణాలు కంపించినప్పుడు సమస్య ఏమై ఉంటుందా ? అని సరిగా పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.  నెలసరి మధ్యలో రక్తస్రావము కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

స్త్రీలలో గర్భసంచి ముఖ ద్వరము సంబంధించిన క్యాన్సర్ , ఒవేరియన్‌ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా కనిపించేది గర్భాశయ క్యాన్సర్ . గర్భసంచిలో కణితి పెరిగిన ప్రదేశాన్ని బట్టి అనేక రకాలుగా విభజిస్తారు. లక్షణాలు కనిపించినప్పుడు " పాప్  స్మియర్ " తో పాటు ఎండోమెట్రియల బయాప్సి , హిస్టెరోస్కోపి, ఆల్ట్రాసౌండ్  వంటి పరీక్షలు చేసి గర్భసంచికి సంబంధించిన ఏ సమస్య అయి ఉంటుందో నిర్ధారిస్తారు. క్యాన్సర్ అని నిర్ధారణ అయితే మాత్రం ప్రధానము గా సర్జరీ నే చికిత్స . దశను బట్టి గర్భసంచిని , చుట్టూ ఉన్న లింఫ్ నాళాలను , అండాశయాలను తీసివేస్తారు. తొలిదశలో గుర్తిస్తే  కీహోల్ సర్జరీ లకు కూడా చేయగలుగుతారు.

స్టేజ్ 1 కంటే ఎక్కువ దశ ఉంటే గర్భాశయాన్ని తీసివేశాక రేడియో , కీమోథెరఫీలను దశను బట్టి ఎన్నిసార్లు ఇవ్వాలో నిర్ధారిస్తారు. ఈ క్యాన్సర్ 55 నుండి  65 ఏళ్ళ స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంది .వయస్సు పై బడేకొద్ది ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.  బ్రెస్ట్ క్యాన్సర్ కు టోమాక్షిఫెన్‌ మందు వాడిన స్త్రీలు , ఇతర కారణాల వలన పెర్విస్ కు రేడియేషన్‌ థెరఫీ తీసుకున్నవారు , హార్మోన్‌థెరఫీ ఎక్కువగా తీసుకున్నవారు , 55 ఏళ్ళు పైబడినవారిలో నెలసరిలు ఆగని స్త్రీలు , స్మోకింగ్ అలవాటు ఉన్నవారు తగిన పరీక్షలు చేయించుకుంటూ ఏవైనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యము చేయకుండా ఉండడము చాలా మంచిది.డాక్టర్ సలహామేరకు క్రమము తప్పకుండా " పాప్ స్మియర్ , ఆల్ట్రాసౌండ్ , కాల్పోస్కోపి, హిస్టెరో స్కోఫీ చీయించుకుంటూ ఉండాలి   

Post a Comment

0 Comments