Full Style

>

నడుము - మెడనొప్పి లకు ఆపరేషన్‌ విశ్వనీయత ఎంత?, Usefulness of operation for neck and back pains

నడుము - మెడనొప్పి లకు ఆపరేషన్‌ విశ్వనీయత ఎంత?, Usefulness of operation for neck and back pains- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నడుంలోని ఎముకల మధ్య డిస్క్‌లుంటాయి. వీటి మధ్య మెత్తగా ఉన్న జిగురు పదార్థం స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. సాధారణంగా వయసుతో ఏర్పడే డీ-జనరేటివ్‌ మార్పులననుసరించి బాహ్యమార్పులు.. చూపుతగ్గడం, బట్టతల, చర్మం మడతలుపడతాయి. వీటితోపాటు అంతర్గతంగా ఎముకలు బలహీనపడడం, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. అలాగే డిస్క్‌ల మధ్యలోగల 'న్యుక్లియస్‌ పల్పోసస్‌' గట్టిపడి డిస్క్‌ అరిగిపోతుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో నడుంలోని ఎల్‌4, ఎల్‌5 డిస్క్‌లు, మెడలోని సి6, సి7 డిస్క్‌లు ఈ మార్పులకు ఎక్కువగాలోనవుతాయి. వీరిలో కొద్ది మందికి డిస్క్‌ వెనకకుగానీ, ఎడమపక్క భాగానికి గానీ జరుగుతుంది. తద్వారా వెన్నుపామును కాని, వెన్నుపాము నుంచి శాఖలుగా విస్తరించిన నాడులపై ఒత్తిడిపెరుగతుంది. ఫలితంగా సయాటికా లేక బ్రేకియల్‌ న్యూరాల్జియా, మోటార్‌ నాడుల బలహీనత ఏర్పడుతుంది. 50 నుండి 60 ఏళ్లుపైబడిన వారిలో ప్రతి పది మందిలో కనీసం ఆరుగురి ఎక్స్‌రేలు, సిటి, ఎంఆర్‌ఐ స్కాన్‌లలో నడుం మధ్యగల డిస్క్‌ అణిగిపోవడం, కొంత వరకు వెనుకగల వెన్నపాముగానీ, నరాలపైన గల పొరలను ఒత్తిడికిగురిచేస్తాయి. ఈ కేసుల్లో కేవలం నొప్పి కొద్దిగా మొద్దుబారుతుంది. మోటార్‌ నాడలుపై ఒత్తిడిగానీ తద్వారా బలహీనతకానీ ఏ మాత్రం ఉండదు.

ఏం చేయాలి?

ఈ సమస్యను ఏ వ్యక్తైనా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. చేతివేళ్లు, కాలివేళ్లు, పాదాలు, ముందు చేయి పైభాగాన్ని బ్రష్‌ ద్వారా ముట్టినప్పుడు, చిన్న సూది ద్వారా గుచ్చినప్పుడు తెలిపే స్పర్శ, నొప్పి సరిగా ఉంటే, వేళ్లలోని మణికట్టు, పాదంలోని బలం బాగా ఉంటే ఆపరేషన్‌ ఏమాత్రం అవసరం ఉండదు. కేవలం మొదటిదశలో విశ్రాంతి, బెల్ట్‌ లేక కాలర్‌సపోర్ట్‌ అవసరం. రెండవ దశలో ట్రాక్షన్‌ వైద్యం, నడుం, మెడ వెనకగల కండరాలను గట్టిపరిచే వ్యాయామాలు (భుజంగాసనం, ఊర్థ్వాసనం) చేయాలి. సాధారణంగా యోగాలో ముందుకు వంగి చేసే వ్యాయామాల్ని పూర్తిగా మానాలి. అలాగే చేతులతో మరీ ముఖ్యంగా భుజం కీలు బిగుసుకుపోకుండా సపోర్టెడ్‌, ఇండిపెండెంట్‌ షోల్డర్‌ వ్యాయామాలు చేయాలి. చేతనైనంత వరకు మునికాళ్లమీద (కాలివేలకొనలపై) నిలబడి ఏదైనా కిటికి కడ్డీలు చేతితోపట్టుకుని సగం వరకు నిటారుగా ఉంటూ బస్కీలు (సగంవరకు మాత్రమే) చేయాలి. దీంతో కాలివేళ్లు, పాదం, పిక్క, తొడకండరాల బలం పెరుగుతుంది.

దుష్ఫ్రభావాలున్నాయా?

'లామినక్టమీ' శస్త్రచికిత్సలో నడుం లేక మెడ ఎముక భద్రతకు సంబంధించిన వెనక పక్కనగల ఎముకల అతకులను (లామినా), లిగమెంట్లను (లిగమెంటం ఫ్లేవం) పూర్తిగా తొలగిస్తారు. 'డిస్కెక్టమీ'లో వెన్నుపూసల మధ్యగల అనిగిన, ఎండిన, పక్కకు జరిగిన డిస్క్‌లను తొలగిస్తారు. దీనివల్ల శాశ్వత ప్రాతిపదికన నడుం బలహీనపడుతుంది. అంతేకాక భవిష్యత్తులో మిగిలిన డిస్క్‌లమీద లోడ్‌పెరిగి అవికూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. అంటే ఆపరేషన్‌ వల్ల సమీప భవిష్యత్తులోనే మిగిలిన డిస్క్‌లు దెబ్బతినడం, స్లిప్‌ అవడం జరుగుతాయి. నా వ్యక్తిగత వైద్య అనుభవంలో లామినెక్టమీ, డిస్కెక్టమీ చేయించుకున్న వారిలో చాలా మంది భవిష్యత్తులో శాశ్వతంగా బరువైన పనులు చేయలేరు. దాంపత్య జీవితంలో కూడా పెనుసమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో కనీసం ఆరుగురికి సమీప భవిష్యత్తులో 'సెకండరీ డిస్క్‌ప్రొలాప్స్‌' సంభవిస్తోంది. (ఆపరేషన్‌లో తొలగించిన డిస్క్‌లపైన, కింద ఉన్న డిస్క్‌లు దెబ్బతినడం). ఈ పరిణామాలను దృష్టిలోపెట్టుకుని ముఖ్యంగా, వ్యవసాయ, కార్మికవర్గానికి చెందినవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆపరేషన్లు ముఖ్యంగా నడుం, మెడలకు సంబంధించినవి చేయించుకోరాదు. ఉద్యోగరీత్యా, ఆరోగ్యశ్రీలోని 'రీ-ఎంబర్స్‌మెంట్‌'కు ఆశపడి ఇటువంటి శస్త్రచికిత్సలు చేయించుకోరాదు. వైద్య వ్యాపారంలో విపరీతమైన పోకడల వికృత పరాకాష్ట నడుం, మెడ నొప్పులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ లేనిరోజుల్లో ఈ సర్జరీ చిన్న ఆసుపత్రుల్లో కేవలం 10 నుండి 15 వేల రూపాయలలో నిర్వహించేవారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఈ సర్జరీకి రూ.45 వేల వరకు చెల్లిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం కేవలం నడుం, మెడ భాగాలకు చేసే డిస్కెక్టమీ, లామినెక్టమీ ఆపరేషన్లలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్‌ వైద్య సంస్థలకు 100 కోట్లకుపైగా చెల్లించిందని ఒక అంచనా. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించడం ఆరోగ్యశ్రీలోని ఉదాత్తతను అర్థం చేసుకుని వైద్య సమాజం ప్రవర్తించాల్సిన న్యాయహేతుబద్ధ సమాజంలోని మేధావివర్గ కనీస నైతిక బాధ్యత.

విటమిన్‌-సి లోపం

విటమిన్‌-సి లోపం వల్ల వచ్చే వ్యాధులను స్కర్వి అంటారు. ఎముకల కీళ్లలో విటమిన్‌-సి లోపం వల్ల వచ్చే జబ్బును సర్విటిస్‌/సర్విటిక్‌ ఆర్థ్రైయిటీస్‌ అంటారు. ఈ జబ్బు పిల్లల్లో ప్రధానంగా, పుట్టిన తర్వాత వారికి పాలివ్వడంలో ఉండే లోపాల వల్ల మొదలవుతుంది. ఫలితంగా పెరిగే వయసులో తీవ్ర ఎముకల కీళ్లలో మార్పులేర్పడి పెద్ద వయసులో చాలా నిస్తేజపూరిత కీళ్ల జబ్బులు ఏర్పడతాయి.

విటమిన్‌-సి (ఆస్కార్బిక్‌ ఆసిడ్‌) అనే పదార్థం తల్లిపాలలో విస్తారంగా ఉంటుంది. సమాజ పోకడలతో ఏర్పడుతున్న అవాంఛితమార్పు చాలా మంది తల్లులు పాలివ్వక నవజాతశిశువులకు పోతాపాలు, డబ్బాపాలకు అవాటు చేస్తున్నారు. సాధారణంగా తల్లిపాలు శుద్ధత, సాధారణ శారీరక ఉష్ణోగ్రత కలిగి ఉండి బిడ్డకు అవసరమైన పోషకాలు, విటమిన్‌-సి సమృద్ధిగా అందిస్తాయి. కానీ, కాచిన పోతపాలు, డబ్బాపాలు వాడడం వల్ల ఆ వేడికి విటమిన్‌-సి దెబ్బతిని బిడ్డ పెరుగుదలలో లోపం ఏర్పడి ముఖ్యంగా మోకాళ్లలో ఒక కాలు వారస్‌ బెండుకు, ఇంకోకాలు వాల్గస్‌ బెండుకు గురవుతుంది. దీన్ని 'టాకిల్డ్‌ డిఫార్మిటీ' అంటారు.

విటమిన్‌-సి లోపంతో రికెట్స్‌లో రెండు కాళ్లలోనూ వాల్గస్‌ లేక వారస్‌ వస్తుంది. దీన్లో ఒక్కోకాలు ఒక రకమైన తేడాఉండడం వల్ల ఎక్కువ కష్టంగా ఉంటుంది.
నివారణ : పోతపాలపై పెరిగే పిల్లలందరికీ క్రమబద్దంగా విటమిన్‌-సి అధికంగా కలిగిన విటమిన్‌ డ్రాప్స్‌ వాడాలి.
వైద్యం : రికెట్స్‌లోలాగా దీన్లో కూడా సర్జరీల ద్వారా బెండ్లు సరిచేసిన తర్వాత పిండికట్ల ద్వారా స్ప్లింట్స్‌ ద్వాఆర దీర్ఘకాల విశ్రాంతినివ్వాలి.

Post a Comment

0 Comments