Full Style

>

శరీరానికి నూతనోత్తేజాన్నించే ఓట్ మీల్


ఓట్ మీల్: ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు. పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు.

స్టవ్ పైన కూడా పది నిమిషాలతో తయారైపోతుంది. రీసెర్చర్ల మేరకు, దీనిలోని కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొల్లెస్టరాల్ తగ్గిస్తాయి. చెడు కొల్లెస్టరాల్ గుండె వ్యాధులను ప్రత్యేకించి పోటు కలిగించే బ్లాకులను రక్తనాళాలలో తగ్గిస్తుంది. ఓట్లు రెగ్యులర్ గా తింటే చెడు కొల్లెస్టరాల్ నిలువ వుండదు. దీనిలో వుండే పీచు పిండి పదార్ధాల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలోని షుగర్ నిల్వలు నియంత్రిస్తుంది. డయాబెటిక్ రోగులకు మంచి ఆహారంగా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సిఫార్సు చేసింది.

Post a Comment

0 Comments