Full Style

>

వైట్ పెట్రోలియం జెల్లీతో పాదాల పగుళ్ళకు చెక్!


                                             వైట్ పెట్రోలియం జెల్లీతో పాదాల పగుళ్ళకు చెక్!   


స్త్రీపురుషులు అనే తేడా లేకుండా వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా.. తడిలో ఉండే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పగుళ్ళ కారణంగా పాదాల నొప్పులు కూడా పుడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే.. పాదాల పగుళ్ళ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రధానంగా.. తడి నుంచి నాణ్యమైన సాక్స్‌, షూ వేసుకోవడం వల్ల పాదాల పగుళ్ల నుండి కాపాడుకోవచ్చు.

ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే.. పాదాల పగుళ్ళ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రధానంగా.. తడి నుంచి నాణ్యమైన సాక్స్‌, షూ వేసుకోవడం వల్ల పాదాల పగుళ్ల నుండి కాపాడుకోవచ్చు. 

పగుళ్లు వచ్చిన వారు పాదాలను రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు చిటికెడు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వైట్‌ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా కూడా తయారవుతాయని వైద్యులు చెపుతున్నారు.

మహా మొండి చుండ్రు.. వదలగొట్టుకునేదెలా...?!!


                                    మహా మొండి చుండ్రు.. వదలగొట్టుకునేదెలా...?!!

చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్, చర్మతత్వాలు అంతర్గతంగా ప్రధాన పాత్ర వహించే కారణాలు. ఇతర బాహ్యకారణాలు చర్మ పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి. సాధారణ ఆరోగ్య స్థితిగతులు చుండ్రుకు దారితీస్తాయన్నది నిపుణుల అభిప్రాయం.

ఎలా నివారించాలి : 
నిజం చెప్పాలంటే చుండ్రు నివారణకు ప్రత్యేక చికిత్స లేదు. చుండ్రును నియంత్రించే ఉద్దేశ్యంతో రూపొందించిన షాంపూలు చర్మ పరిస్థితిని నియత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, మరగ వచ్చేవరకు రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితమూ వుండదు. మాడుపై షాంపూ అప్లయ్ చేశాక కనీసం ఏడెనిమిది నిమిషాలు అలా ఉంచేసుకుని కడగాలి. దీనివల్ల యాంటీ ఫంగల్ లక్షణాలు బాగా పనిచేస్తాయి. 

ఎందుకు తొలగించాలి : 
చుండ్రువల్ల జుట్టురాలిపోతుంది. ముఖం, వీపు, మెడమలపై మొటిమలకు కారణమయ్యే అవకాశం ఉంది. చుండ్రుతోపాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూలకాయం, పాలిసిస్టిక్ ఓవరియస్ సిండ్రోమ్ వుందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.

చుండ్రుతో తరచూ ఇబ్బందిపడే వారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీడాంట్రఫ్ షాంపూ వాడకూడదు. చాలా మంది స్త్రీ, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు. కాని ఇది నిజంకాదు. చుండ్రుకు లింగవివక్ష వుండదు. చికిత్స ఎవరికైనా ఒక్కటే.


వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి...

                          

రోజంతా పని...పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు.

చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసెపు రిలాక్సవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి. ఇలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అద్భుతమయిన ఆనందం స్వంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.


 

శిరోజ సంరక్షణ కోసం...

                                      

శిరోజాల కొసలు చిట్లుతుంటే గోరువెచ్చని ఆముదంలో ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించండి. శిరోజాలను టవల్‌తో చుట్టి ఒక అరగంట సేపు అలా ఉంచండి. తర్వాత షాంపూతోపాటు గుడ్డలోని పచ్చసోనను కలిపి తలంటి స్నానం చేయండి.

మరో చిట్కా- గ్యాలన్ చన్నీటికి అరకప్పు యాపిల్ సిడెర్ వెనిగర్‌ను కలిపి ఆ నీళ్ళతో శిరోజాల్ని శుభ్రం చేసుకోవాలి. శిరోజాలపై ఏమీ మిగలకుండా మంచి నీళ్ళతో మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి.

జుట్టు పలచబడుతున్నట్టయితే సల్ఫర్ అధికంగా వున్న ఆహారాలను ఎక్కువుగా తీసుకోండి. క్యాబేజి, బ్రస్సెల్స్, మొలకెత్తిన గింజలు, క్యాలీఫ్లవర్లో సల్ఫర్ ‌అధిక మోతాదులో వుంటుంది. బి విటమిన్లు అధికంగా వున్న ఆహారాలను కూడా ఎక్కువుగా తినాలి

తలనొప్పి తగ్గేందుకు చిట్కాలు

                                  తలనొప్పి తగ్గేందుకు చిట్కాలు


బ్రౌన్ పేపర్ ముక్కను కత్తిరించి వెనిగర్‌లో ముంచాలి. వైట్ వెనిగర్ అయితే బాగా పనిచేస్తుంది. దాన్ని నుదుటిపై కాసేపు వుంచుకుంటే చిన్నగా వచ్చే తలనొప్పి మటుమాయమవుతుంది. 

మరో చిట్కా- చేతులను అదేపనిగా కొన్ని నిమిషాలు సేపు ఊపడం. ఇది ఒక్కొక్కసారి పని చేస్తుంది. ఎందుకంటే చాలా తలనొప్పులు తల లోపలి రక్తనాళాలు నొక్కుకుపోవడం వల్ల వస్తాయి. చేతుల్ని బాగా కదిలించినప్పుడు రక్తప్రసరణ కొంత తగ్గుతుంది. అలా నాళాల పరిస్థితి సర్దుకుని తలనొప్పి తగ్గవచ్చు. అయితే అలా చేతులు కదపడం వల్ల అసౌకర్యంగా అన్పించినా, నొప్పి పెరిగినా వెంటనే ఆపేయాలి.



Post a Comment

0 Comments