Full Style

>

అల్సర్ సమస్యకు అధ్భుత చికిత్స:

 అబ్బ! ఆ వంటకం ఎంత బాగుందో...! మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది. ఇలా ఒక్కోసారి మనం జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేకపోతాం. అవును ఇష్టంగా తింటేనే ఆరోగ్యం. అందుకే కండకలవాడే మనిషి అని అన్నారు. అన్నీ తినాలని ఎవరికి మాత్రం ఉండదు. వచ్చిన సమస్యల్లా తింటే అరుగుతుందా? అని. తీసుకునే ఆహారం వంటికి పడకపోతే జీర్ణకోశం అనేక ఇబ్బందులు పడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

నగర జీవనానికి అలవాటుపడిన వారి ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, కల్తీ, పరిశుభ్రత లేని తినుబండారాలు తినడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీంతో జీర్ణకోశ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అజీర్తి చాలా మంది రోగులను వెంటాడుతోంది. తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, పుల్లటి తేన్పులు, అపానవాయువు ఎక్కువగా ఉండటం, కొంచెం తినగానే కడుపు నిండిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. 

చాలా మంది గ్రాస్టిక్ సమస్యను అశ్రద్ధ చేస్తారు. దీనివల్ల కడుపులో పుండు ఏర్పడే అవకాశం ఉంది. దీన్నే పెప్టిక్ అల్సర్ అంటారు. ఇందులోనూ డియోడినల్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్‌చెప్పుకోదగినవి. డియోడినల్ అల్సర్ ఉన్న వ్యక్తులు ఆహారం తీసుకున్న మూడు నాలుగు గంటల్లో కడుపు నొప్పితో బాధపడుతారు. మళ్లీ ఆహారం తీసుకునే వరకు ఈ నొప్పి ఉంటుంది.

గ్యాస్ట్రిక్ అల్సర్ బాధితులను ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి వెంటాడుతుంది. తిన్నది వాంతి చేసుకునే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. మానసిక ఆందోళన, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఇటువంటి వ్యక్తులకు కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, బయటి పదార్థాలు తింటే అరగకపోవడం, ఏదైనా తినాలంటే భయం వంటి లక్షణాలుంటాయి. దీనివల్ల బరువు తగ్గిపోతారు. ఆందోళనతో నీరసించే అవకాశాలున్నాయి. 

ఇంకో ప్రధానమైన సమస్య పెద్దపేగుల్లోవచ్చే అల్సర్. కడుపునొప్పి, రక్త విరేచనాలు, నీరసం, బరువు తగ్గడం, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, లివరు సమస్యలు పెద్దపేగు క్యాన్సర్‌కు లక్షణాలు. వైద్యపరీక్షల తరువాతే వ్యాధిని గుర్తించడం సాధ్యం. ఇవి కాకుండా చాలా మందిలో తరుచుగా కనిపించే వ్యాధి అమీబియాసిస్. అపరిశుభ్ర ఆహారం, ఫాస్ట్‌ఫుడ్స్, కలుషితమైన నీటి వల్ల వ్యాధి వస్తుంది. ఈ మధ్య ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది కాలేయం నొప్పితో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, పరిశుభ్రమైన నీరుతాగడం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం, బయట ఆహారాలు తీసుకోకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత చేకూర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కొన్ని హోమియోపతి మందులు వాడటం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. 

నక్స్‌వామికా : 
అన్ని రకాల జీర్ణకోశవ్యాధులను నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాఫీ, టీ, ఆల్కహాల్, పొగతాగడం వల్ల అల్సర్ బారినపడిన వారు ఈ మందు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

పల్సటిల్లా : 
కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఇబ్బంది పడేవాళ్లు, జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ మందు తీసుకోవచ్చు. హైడ్రెస్టిస్ : దీర్ఘకాల జీర్ణకోశ వ్యాధులకు ఈ మందు బాగా పనిచేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ బారినపడిన వారు కూడా ఈ మందు ఉపయోగించవచ్చు.

యాంటిమ్‌స్క్రడ్ :
 ఆహారం తీసుకున్న చాలాసేపటి వరకు కడుపు ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం. కుర్చీ : అమీబియాసిస్ సమస్యను నివారించేందుకు ఇది మంచి ఔషధం.

యాసిడ్ సల్ఫ్ :
 మద్యపానం వల్ల వచ్చే సమస్యలను నివారించేందుకు ఇది తిరుగులేని ఔషధం.

నాట్‌ఫోస్ :
 అసిడిటీని నివారిస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది.

ఈ ఔషధాలను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం వాడినపుడే మంచి ఫలితం ఉంటుంది. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకుంటే అల్సర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Post a Comment

0 Comments