Full Style

>

చెవులు పగిలే గురకా? గుర్రుమనే భాగస్వామా?





Effective Remedies Stop Snoring  Aid0181
నేటి రోజుల్లో జంటలు చాలామంది తమ జీవిత భాగస్వామి రాత్రివేళ చెవులు పగిలేలా గురకలు పెట్టి తమకు నిద్రాభంగం చేస్తున్నాడంటూ వివాహ జీవితాలను సైతం తెగతెంపులు చేసుకుంటున్నారు. కనుక మేము కొన్ని గురక పరిష్కారాలు సూచిస్తున్నాం. వాటిని ఆచరించి మీ అనుబంధాలను, విలువైనవైతే, కాపాడుకోండి. మంచి నిద్ర పొండి. గురకకు కారణాలేమిటి? .....గురక అనేది నయం చేయలేనిది కాదు. శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను వైబ్రేట్ చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది.

గురకకు చికిత్స- 

1. ఓకల్ కార్డులు వైబ్రేట్ అవటానికి కారణం ప్రధానంగా ముక్కులోని శ్వాసమార్గంలో అడ్డంకులుండటం. ఈ అడ్డంకులను తొలగించాలంటే, మెడికల్ షాపులలో రెడీగా దొరుకుతున్న నాసల్ స్ట్రిప్స్ వాడాలి. ఇవి ముక్కు రంధ్రాలను తెరచి గాలి బాగా ప్రవహించేలా చేస్తాయి.
2. పడకకు వెళ్ళే ముందు ఆవిరి పట్టి శ్వాస మార్గాన్ని శుభ్రపరచుకుంటే అందులో వుంటే మ్యూకస్ శుభ్రపడి మంచి నిద్రపడుతుంది.
3. శ్వాస మార్గంలో బ్లాకేజ్ కలిగించే ఆల్కహాలు, నిద్రమాత్రలు, ట్రాంక్విలైజర్లు, యాంటీ హిస్టమిన్లు మొదలైనవి వదిలేస్తే గురక తగ్గుతుంది.
4. గురకకు పొగతాగటం కూడా ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది.
5. ముక్కు రంధ్రాలలో మ్యూకస్ శుభ్రపరచుకొని అధికంగా వున్న వెంట్రుకలను కత్తిరిస్తే కూడా గురక తగ్గే అవకాశం వుంది.


నిద్ర పోయే పొజిషన్ ఎలా వుండాలి? 

1. తలగడలు మెత్తగా వుండరాదు. గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది.
2. వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది. నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి.


గురక తగ్గాలంటే తినకూడనివి ఏమిటి? 

1. నిద్రించేముందు స్నాక్స్ ఏవీ తినకండి. పిజ్జాలు, బర్జర్లు, ఛీజ్, పాప్ కార్న వంటివి తినరాదు. వీటిలో కొవ్వు అధికంగా వుండి మ్యూకస్ పేరుకుంటుంది.
2. నిద్రించేముందు ఎక్కువగా భుజించవద్దు. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే జీర్ణమై పడుకునే సమయానికి శ్వాస కోశంలో గాలి స్వేచ్ఛగా ఆడుతుంది.

Post a Comment

0 Comments