Full Style

>

అలర్జీతో బాధపడుతున్నారా



తేనె కలిపిన గ్రీన్ టీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే అలర్జీ తగ్గుతుంది. బ్లాక్ టీ అయినా మంచిదే. అలాగే అల్లం తేనెతో కలిపి తీసుకుంటే కూడా మంచిదంటున్నారు వైద్యనిపుణులు. 

ఆరోగ్యంపరంగా ప్రతి మనిషి ఏదోఒక జబ్బుతో సతమతమవుతుంటాడు. వాటిలో అలర్జీ కూడా ఒకటి. ఈ అలర్జీకి కొన్ని చిట్కాలు పాటిస్తే అలర్జీని దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. అలర్జీ ఉన్నవారు అల్లం తీసుకుంటే మంచిదంటున్నారు 

** తాజాగావున్న అల్లం తొక్క తీసి ఒక అంగుళం ముక్కను ముద్దగా చేసి దానిని ఒక డబ్బాలోవుంచి మరుగుతున్న నీటిలో ఉంచాలి. ఆ తర్వాత దానికి తోడుగా తేనె కలిపి తీసుకుంటే అలర్జీ వలన కలిగే కఫం తొలగిపోతుంది. 

** అలర్జీ వలన దద్దుర్లు వస్తే ఓట్‌మీల్ వలన కూడా మంచి ఫలితం వుంటుందంటున్నారు వైద్యులు. 

** ఒక కప్పు నీటిలో టేబుల్ స్పూన్ ఓట్‌మీల్‌ను ఉడికించి అరగంట సేపు చల్లారనివ్వాలి, ఆ తర్వాత గుజ్జును దూదికి రాసి దద్దుర్లువున్నచోట పూయాలి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. మిగిలిన దానిని ఫ్రిజ్‌లో ఉంచుకుని తరువాత మళ్ళీ రాసుకోవచ్చు. దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉడకబెట్టుకుని దానిని బకెట్ నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే కూడా మంచిదే. 

** రెండు స్పూన్ల అల్లం రసానికి రెండు స్పూన్ల తేనె కలుపుకుని రోజుకు నాలుగైదు సార్లు సేవిస్తే గొంతు అలర్జీ తగ్గుతుందంటున్నారు వైద్యనిపుణులు.

Post a Comment

0 Comments