Full Style

>

పెరటి వైద్యం:




అబ్బబ్బ పులుపు... ఎక్కువయితే ఏంటి...?!!

'అబ్బబ్బ పులుపు ' అంటూ అయిష్టత చూపిస్తారు. కొందరికైతే తలుచుకుంటేనే నోరూరుతుంది.

 ఏదేమైనా శరీరంపై మంచి ప్రభావం చూపుతోంది కాబట్టి పులుపు కూడా మన శరీరంలో అంతర్భాగం కావాలి. 

లభించే పదార్థాలు : 

చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి. 

శరీరంపై ప్రభావం : 

*నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 

*జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 

*మల విసర్జన బాగా జరగుతుంది. 

* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 

* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 

*జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు. 

అధికంగా తీసుకుంటే : 

* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 

* దృష్టి మందగిస్తుంది. 

* శరీరాన్ని శిథిల పరుస్తుంది. 

* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 

* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 

* దాహం ఎక్కువ అవుతుంది. 

* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.

  

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి దివ్యౌషధ


  1. మన పెరడులో, ముంగిట్లో, తోటల్లో విస్తృతంగా లభించే బొప్పాయి పైసా ఖర్చులేకుండా శరీరాన్ని అదుపులో ఉంచే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ పళ్లు వేడి చేస్తాయి కనుక, గర్భవతులకు ఇస్తే గర్భస్రావం అవుతుందని మన దేశంలో చాలా చోట్ల విశ్వసిస్తారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. ఇందులోని పోషకతత్వాల వల్ల గర్భిణికే కాక, గర్భస్థశిశువుకూ మేలే జరుగుతుంది. కనుక అందరూ నిర్భయంగా మిగతా అన్ని పళ్లలాగే బొప్పాయినీ, అన్ని వేళల్లోనూ తీసుకోవచ్చు.
  2. ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శ భోజనం తీసుకునే వారికీ, ఇది మంచి ఆహారం, ప్రతీ రోజూ ఓ బొప్పాయి పండు తింటే స్థూలకాయం బాగా తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. మామూలుగా బొప్పాయికాయతో పప్పు, పులుసు, కూర, పచ్చడి, హల్వా చేసుకోవచ్చు.
  3. ఈ నాడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్న పలురకాల సౌందర్య సాధనాల్లో, ముఖ్యంగా ఫేషియల్ క్రీములు, షాంపూలలో బొప్పాయి పళ్ల గుజ్జునే వాడుతున్నారు, పచ్చి బొప్పాయి నుంచి తెల్లని పాల వంటి రసం స్రవిస్తుంది. 'పాపైన్ ' అనే పేరున్న ఈ ఎంజైమ్ వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. 
  4. బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్‌ సి) ఎక్కువగా ఉంటుంది

వెల్లుల్లి రేకులతో గొంతునొప్పి తగ్గుతుంది


  • సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే శరీరంలో ఎన్నో అనారోగ్యంతో ఎన్నో సమస్యలు. తల తడిస్తే చాలు జలబు పిలువని పేరంటంలా వచ్చేస్తుంది. వారమైన... పదిరోజులైన పోనంటుంది. ఆహారంలో కాస్త మార్పులు చేస్తే చాలు పరిస్థతిలో ఇట్టే మార్పు వస్తుంది. 
  • తలనొప్పి, గొంతునొప్పికి చేమంతి టీ ఉపయోగకరంగా ఉంటుంది. చేమంతి పూలను ఎండబెట్టి స్పూన్ మోతాదులో కలుపుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రేకులు వేసి మరిగించి రెండు, మూడు గంటలకొకమారు తాగితే నొప్పి వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 
  • గొంతు సమస్య అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి నీరు, ఎక్కువ చల్లనీరు తాగకూడదు. శరీరానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. గొంతులో బాధ ఎక్కవగా ఉన్నపుడు ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకోవాలి.

కడుపులో మంటా... దోసకాయ రసం తాగండి..!!


  1. కొంతమంది కడుపులో మంటతో సతమతమవుతుంటారు. ఈ మంట తగ్గేందుకు ఏవేవో మాత్రలను మింగుతుంటారు. కడుపులో మంటగా ఉన్నప్పుడు దోసకాయ రసాన్ని తాగితే ఆ మంట తగ్గుతుంది. అంతేకాదు... దోసకాయకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉన్నది. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. అయితే ప్రస్తుతం ఏ కూరగాయలను పండించేందుకైనా రసాయన ఎరువులు వాడుతున్నారు కనుక సహజసిద్ధమైన కాయలను మాత్రమే తొక్కుతో తినాలి.
  2. దోస తొక్కలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో ఉంది. అయితే దోసకాయను ఊరగాయలా తినకూడదు. కీరదోస, మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడినవారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
  3. కళ్ల కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కల్ని కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే.

గ్యాస్ట్రిక్ సమస్యలతో తబ్బిబ్బవుతున్నారా..? తులసి రసాన్ని తీసి....



  • సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు చూద్దాం..
  • తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు కూడా సేవించవచ్చు. 
  • మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాలపొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
  • పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి నాకిస్తే అవి తగ్గుముఖం పడతాయి. నల్ల తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది. 
  • నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్థమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.

Post a Comment

0 Comments