మన నాసిక లోపల, గొంపు లోపల ఉంటే గ్రంథులు రోజు దాదాపు
లీటర్ వరకూ కఫం తయారు చేస్తుంటాయి. ఈ పదార్థం నాసికలను, గొంతును తడిగా
ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడుఅంతర్గత ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంటుంది.
మామూలు పరిమాణంలో ఉన్నంత వరకూ ఈ పదార్థాన్ని మనకు తెలియకుండానే
మింగేస్తుంటాం. అయితే ఎలర్జీలు, జలుబు, సైనస్ ఇన్‌ఫెక్షన్లు వంటి కారణాల
వల్ల ఒకవేళ ఈ కఫం అత్యధిక మొత్తాల్లో విడుదలైతే గొంతు భాగంలో అపరిమితంగా
సంచితమ వుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘పోస్ నేసల్ డ్రిప్’ అంటారు.
దీనివల్ల గొంతులోపల భాగం కల్లోవనికి గురై శోథ తయారవుతుంది. ఈ నేపథ్యంలో
ప్రతి చర్యగా దగ్గు ఉత్పన్నమవుతుంది. ఈ సమస్య దీర్ఘకాలం నుండి ఉండే దగ్గు
కూడా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. చాలా మందిలో ఈ లక్షణం స్పష్టంగానే
అనుభవమవుతుంది. అయితే కొంతమంది మాత్రం దీనిని గ్రహించలేరు. దీని ఫలితంగా
కనిపించే దగ్గు మాత్రం దీర్ఘకాలం పాటు బాధిస్తుంటుంది.
దీర్ఘకాలపు దగ్గుకు ఉబ్బసం ఒక సాధారణ మైన కారణం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపించే మొండి దగ్గుకు ఉబ్బసం ప్రధాన కారణం. కొన్ని సందర్భాల్లో దగ్గుతో పాటు గాలిని బలంగా, వేగంగా తీసుకోవాల్సి రావ టం, పిల్లి కూతలు వంటి అనుబంధ లక్షణా లు కూడా కనిపిస్తాయి. కానీ, అనేక సందర్భా ల్లో మాత్రం కేవలం పొడి దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఆస్థమా సంబంధమైన తగ్గు రుతువులను బట్టి వచ్చిపోతుం టుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులను అనుసరించి గాని, చలిగాలిలో గడిపినప్పుడు గానీ తీక్షణ రసాయ నాలకు గురైనప్పుడు గాని, ఘాటైన సుగంధ ద్రవ్యాలను పీల్చుకున్నపుడు గానీ ఈ తరహా దగ్గు వస్తుం టుంది. జలుపు, ఫ్లూ, నిమోనియా వంటి శ్వాసవ్యవ స్థకు చెందిన వ్యాధులు వచ్చి తగ్గిపోయిన తరువాత కూడా చాలా మందిలో దగ్గు మాత్రం అవశేష లక్షణంగా చాలా కాలం పాటు కొనసాగుతుంటుంది.
ఈ వ్యాధుల్లో గాలి ప్రయాణించే మార్గం శోధకు గురై రేగ టం వల్ల దీర్ఘకాలం పాటు దగ్గు కొనసాగు తుంది. రక్తపోటు మందుల వాడకం, రక్తపోటు, హార్ట్‌ఫెయిల్యూర్ వంటి సమస్యల్లో వాడే ఆంజియోటెన్సిస్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనే మందులు 20 శాతం కేసుల్లో మొండి దగ్గును కలిగించే అవకాశం ఉంది. ఈ మ్‌దులను మొదలుపెట్టిన తరువాత పది రోజులకు దగ్గు మొదలవుతుంది. మందు వాడకం నిలిపివేసి నప్ప టికీ నెలరోజుల వరకూ దగ్గు కొనసాగుతూనే ఉంటుంది. శ్వాస వ్యవస్థలోని పెద్ద శ్వాసనాళాలు ఇన్‌ఫెక్ష న్‌కు గురైతే బ్రాంకైటిస్ అంటారన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి స్థితిలో శ్వాసమార్గాలు కఫంతో సంచితమ వటం, ఆయాసం, దగ్గు, పసుపుపచ్చని రంగులో శేష్మం వెలువడటం వంటి లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
పరీక్షలు - నిర్ధారణ
దగ్గు దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న పుడు సరైన వ్యాధి నిర్ణయం కోసం కూలంక షంగా వ్యాధి ఇతి వృత్తాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ధూమపానం చేసే అలవా టున్నా, వాతావరణ కాలుష్యానికి గురవు తున్నా ఆ విషయం వైద్యుడి దృష్టికి తీసుకు వెళ్ళాలి. వీటిని సిటి స్కాన్ ద్వారా పరీక్షిస్తారు. అలాగే ఊపిరితిత్తులకు చెందిన క్యాన్సర్ వంటి వాటిని గుర్తించగలిగే అవకాశం ఉం టుంది. ఎక్స్‌రేల్లో లభించే సమాచారాన్ని బట్టి అవసరమైతే సిటి స్కాన్ వంటి తదుపరి పరీక్షలను సూచిస్తారు. అలాగే, ఎండో స్కోపి, బ్రాంకోస్కోపి పరీక్షల ద్వారా పరీక్షలు జరుపుతారు.
0 Comments